Employee Sudden Death : బ్యాక్ పెయిన్ అంటూ లీవ్ అడిగాడు, పదినిమిషాల్లోనే చనిపోయాడు.. ఉద్యోగులు జాగ్రత్త
Sudden Cardiac Arrest : 40 ఏళ్ల ఉద్యోగి లీవ్ మెసేజ్ పంపిన కొద్ది సేపటికే గుండె సమస్యతో మరణించిన సంఘటన.. ఉద్యోగులపై పెరుగుతున్న ఒత్తిడిని హైలైట్ చేస్తుంది. అసలు ఏమైందంటే..

Employee Death Viral News : ఈ మధ్యకాలంలో ఉద్యోగులు చాలా స్ట్రెస్ బారిన (Mental Health at Workplace) పడుతున్నారు. చాలా సంఘటనలు ఉద్యోగులు ఎదుర్కొనే ఒత్తిడిని హైలెట్ చేశాయి. చేస్తూనే ఉన్నాయి. అప్పటివరకు బాగానే ఉన్నవారు సడెన్‌గా తీవ్రమైన ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి సంఘటనల్లో ఇది కూడా ఒకటి. అసలు ఎవరూ ఓ ఊహించని విధంగా ఓ ఉద్యోగి చనిపోయిన ఘటన అందరిని ఆలోచనల్లో పడేసింది. దీని గురించి ఓ వ్యక్తి తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు.
బ్యాక్ పెయిన్ అంటూ మెసేజ్..
ఈరోజు ఉదయం 8.37కి నా సహోద్యోగి నాకు "Sir, due to heavy backpain I am unable to come today. So please grant me leave." అంటూ మెసేజ్ చేశాడు. ఇలాంటి మెసేజ్‌లు మాకు చాలా కామన్. లీవ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తూ.. "Ok take rest" అంటూ రిప్లై ఇచ్చాను. తర్వాత నా పని నేను చేసుకున్నానంటూ KV అయ్యర్ ట్వీట్ చేశాడు. అప్పటివరకు అంతా నార్మల్‌గానే జరిగిందని.. ఆ తర్వాత 11 గంటలకు నాకు ఓ కాల్ వచ్చిందని.. అది తనని చాలా బాధకు గురిచేసిందని తెలిపాడు.
చనిపోయాడంటూ కాల్
శంకర్ ఫోన్ నుంచి కాల్ వస్తే ఆన్సర్ చేశాను. అయితే అక్కడ మాట్లాడింది శంకర్ కాదు. శంకర్ మరణ వార్తను అతని బంధువు నాకు చెప్పాడు. నేను షాక్ అయ్యాను. ముందు నమ్మలేదు. తర్వాత నేను మరో ఉద్యోగికి కాల్ చేసి అది నిజమని తెలుసుకున్నాను. శంకర్ అడ్రస్ తెలుసుకుని అతని ఇంటికి వెళ్లాను. అప్పుడు నా మైండ్ అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసింది He was NO MORE అని రాసుకొచ్చాడు.
DEVASTATING INCIDENT WHICH HAPPENED TODAY MORNING :-
— KV Iyyer - BHARAT 🇮🇳🇮🇱 (@BanCheneProduct) September 13, 2025
One of my colleague, Shankar texted me today morning at 8.37 am with a message
"Sir, due to heavy backpain I am unable to come today. So please grant me leave." Such type of leave requests, being usual, I replied "Ok take…
ఫిట్‌గా ఉండేవాడు
శంకర్ వయసు 40 సంవత్సరాలు. అతను తన టీమ్‌లో 6 ఏళ్లుగా పని చేస్తున్నాడని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేవాడని.. మందు, సిగరెట్ అలవాట్లు కూడా లేవని.. ఒక సంతానం కూడా ఉందని అయ్యర్ ట్వీట్లో రాశారు. కార్డియాక్ అరెస్ట్‌తో అతను చనిపోయాడని.. 8.47కి అతను చనిపోతే.. దానికి పది నిమిషాల ముందే అంటే 8.37కి తనకి మెసేజ్ చేశాడని.. అది తనని షాక్‌కి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
మానసిక ఒత్తిడిని జయించండి ఇలా
"Life is so unpredicatable. Be kind to people around you & live life happily till it lasts, for you never know whats in store the next minute" అంటూ తన ట్వీట్ ముగించారు. ఈ సంఘటన ఉద్యోగులు అందరికీ మేల్కొల్పు కావాలి. ఏ రకమైన ఒత్తిడి ఉన్నా.. దానిని ఓవర్ కామ్ చేసేందుకు ప్రయత్నించాలి. కార్డియాక్ అరెస్ట్ కావడానికి ఒత్తిడి ప్రధాన కారణంగా చెప్తున్నారు నిపుణులు. కాబట్టి మానసిక ప్రశాంతతకై అందరూ ప్రయత్నించాలి. ఉద్యోగులను కేవలం టార్గెట్స్ కోసమే కాకుండా.. వారి మానసిక ప్రశాంతతకు సంబంధించిన చర్యలను ప్రతి ఆఫీస్‌లో తీసుకోవాలనే అంశాన్ని ఇది హైలెట్ చేస్తుంది.






















