News
News
X

Prawns: అనవసర భయాలతో రొయ్యలు తినడం మానేస్తున్నారా? అయితే మీకే నష్టం

చాలామంది చికెన్, మటన్ తినడానికి ఇష్టపడతారు. కానీ రొయ్యలు మాత్రం అంతగా తినరు.

FOLLOW US: 
Share:

రొయ్యల ఉత్పత్తిలో ప్రపంచంలో మన దేశం టాప్ టెన్ దేశాల్లో ఒకటి. కానీ అధికంగా తినే దేశాల్లో చూసుకుంటే మన దేశం ఎక్కడో అడుగుస్థానంలో ఉంది. రొయ్యలు ఆరోగ్యానికి మంచివే అయినా అనవసర భయాలతో మన దేశంలో చాలామంది వాటిని పక్కన పెడుతున్నారు. చైనాలో ఏడాదికి ప్రతి ఒక్కరూ 10 నుంచి 12 కిలోల రొయ్యలు తింటున్నారని అంచనా. అదే అమెరికాలో సగటున ఏడాదికి ఒక వ్యక్తి ఎనిమిది నుంచి పది కిలోలు తింటున్నారు. ఇతర యూరోపియన్ దేశాల్లో కూడా ప్రతి వ్యక్తి 8 కిలోలకు తక్కువ కాకుండా ఏడాదికి రొయ్యలు తింటున్నారు. అయితే మన దేశంలో మాత్రం కేవలం 800 గ్రాములు మాత్రమే తింటున్నట్టు అంచనా. అంటే కనీసం కిలో కూడా తినడం లేదు. రొయ్యలు తింటే గుండె సమస్యలు వస్తాయేమోనని ఎక్కువ మందికి ఉన్న అనుమానం. కానీ ఆ అనుమానం కేవలం అపోహ. ఇతర మాంసాహారాలలాగే రొయ్యల్లో కూడా పోషకాలు చాలా ఎక్కువ. తింటే గుండెకు కూడా మంచిదే అని చెబుతున్నారు వైద్య నిపుణులు.

కొంతమంది రొయ్యలు తింటే పక్షవాతం వస్తుందని కూడా అనుకుంటారు. వాటిని తినేందుకు భయపడతారు. అయితే రొయ్యల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అది కూడా ఇతర మాంసాహారాలతో పోలిస్తే అధిక నాణ్యత కలిగిన ప్రొటీన్ రొయ్యల్లో ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంది. మనిషికి అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలు వీటిలో ఉంటాయి. రొయ్యలు తినడం వల్ల శరీరంలో హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయని who చెప్పింది. రొయ్యల్లో పిండి పదార్థాలు, కొవ్వులు ఉన్నప్పటికీ వాటి ద్వారా వచ్చే కేలరీలు చాలా తక్కువ. కాబట్టి వీటిని తిన్నా కూడా బరువు పెరగరు. అలా అని పిండి పదార్థాలు, కొవ్వు ఉంటాయి కాబట్టి గుండె జబ్బులు ఉన్నవాళ్లు, డయాబెటిస్ ఉన్నవాళ్లు దూరం పెట్టమని కాదు. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి టైప్ 2 మధుమేహంతో పాటు రక్తపోటును కూడా రాకుండా అడ్డుకుంటాయి రొయ్యలు.  గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది కాబట్టి రొయ్యలు తినడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.

మహిళలు తినాల్సిందే
రొయ్యల్లో మినరల్స్, కాల్షియం, అయోడిన్, జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, కాపర్, అన్ని విటమిన్లు, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల జ్ఞాపకశక్తిని పెంచడంతోపాటు, ఎముకలకు బలాన్ని, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా మహిళలు రొయ్యలు తినడం చాలా అవసరం. వీరే అధికంగా థైరాయిడ్ సమస్యల బారిన పడతారు. రొయ్యల్లోని పోషకాలు థైరాయిడ్ గ్రంధుల పనితీరును మెరుగుపరుస్తాయి.

అలెర్జీ ఉంటే...
నూనెలో డీప్ గా ఫ్రై చేసుకుని తినడం వల్ల మాత్రం సమస్యలు పెరుగుతాయి, కాని తగ్గదు. కాబట్టి రొయ్యలను కూరలా వండుకొని లేక బిర్యానిలా వండుకొని తినడం మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి చర్మానికి, జుట్టుకు, గోళ్ళకు కూడా ఆరోగ్యాన్ని అందిస్తాయి. అయితే కొందరిలో ఇవి ఎలర్జీని కలిగిస్తాయి. ఎలర్జీ ఉన్నవాళ్లు మాత్రం వీటికి దూరంగా ఉండడం మంచిది. రొయ్యలు తినగానే చర్మంపై దద్దుర్లు లాంటివి వచ్చాయంటే అవి మీకు పడడం లేదని అర్థం. అలాంటి వాళ్ళు వీటిని దూరంగా ఉంచాలి. లేకుంటే శ్వాస కోస సమస్యలు వచ్చి ఒక్కోసారి పరిస్థితి చేయి జారుతుంది. 

Also read: షాకింగ్, మనిషి ఎత్తు ఎక్కువగా ఉంటే కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువ

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 24 Jan 2023 10:49 AM (IST) Tags: Prawns Eating prawns Prawns Health benefits Prawns for Health

సంబంధిత కథనాలు

Brain Health: మెదడుకు హాని చేసే ఆహారాలు ఇవే - వీటికి దూరంగా ఉండండి

Brain Health: మెదడుకు హాని చేసే ఆహారాలు ఇవే - వీటికి దూరంగా ఉండండి

Vitamin D: రోజూ 10 నిమిషాలు ఇలా చెయ్యండి - ‘విటమిన్ డి’ లోపమే ఉండదు

Vitamin D: రోజూ 10 నిమిషాలు ఇలా చెయ్యండి - ‘విటమిన్ డి’ లోపమే ఉండదు

Weight Loss: బరువు తగ్గే ప్లాన్ వేసుకుంటున్నారా? జాగ్రత్త, ఈ అపోహలు నమ్మొద్దు

Weight Loss: బరువు తగ్గే ప్లాన్ వేసుకుంటున్నారా? జాగ్రత్త, ఈ అపోహలు నమ్మొద్దు

ఏవండోయ్ ఇది విన్నారా? 'జస్ట్ ఫ్రెండ్స్' అన్నందుకు మహిళపై రూ.24 కోట్లు పరువు నష్టం కేసు వేశాడు!

ఏవండోయ్ ఇది విన్నారా? 'జస్ట్ ఫ్రెండ్స్' అన్నందుకు మహిళపై రూ.24 కోట్లు పరువు నష్టం కేసు వేశాడు!

Curd Vs Buttermilk: పెరుగు కంటే మజ్జిగ తీసుకోవడం మంచిదా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోంది?

Curd Vs Buttermilk: పెరుగు కంటే మజ్జిగ తీసుకోవడం మంచిదా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోంది?

టాప్ స్టోరీస్

Krishna Tribunal : కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటుపై వీడని సందిగ్ధత, అభిప్రాయం చెప్పేందుకు ఏజీ నిరాకరణ

Krishna Tribunal : కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటుపై వీడని సందిగ్ధత, అభిప్రాయం చెప్పేందుకు ఏజీ నిరాకరణ

Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?

Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు