News
News
X

Onion: బరువు తగ్గేందుకు ఉల్లి మార్గం- అవునండీ మీరు విన్నది నిజమేనండోయ్

ఉల్లిపాయ.. ప్రతి ఒక్కరి వంటింట్లో ఉంటుంది. కూరలు రుచి రావాలంటే కచ్చితంగా ఉల్లిపాయ తాలింపులో వేసుకోవాల్సిందే. ఇది కూరలకి రుచి ఇవ్వడానికే కాదండోయ్ బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.

FOLLOW US: 

ఉల్లిపాయ.. ప్రతి ఒక్కరి వంటింట్లో ఉంటుంది. కూరలు రుచి రావాలంటే కచ్చితంగా ఉల్లిపాయ తాలింపులో వేసుకోవాల్సిందే. ఇది కూరలకి రుచి ఇవ్వడానికే కాదండోయ్ బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. అవును మీరు విన్నది నిజమే. పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వుని ఇది కరిగిస్తుంది. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదని పెద్దలు అంటారు. అయితే ఈ ఉల్లిపాయని సరైన పద్ధతిలో తింటే బరువు సులువుగా తగ్గొచ్చు. 

ఉల్లిపాయ వల్ల లాభాలు 

ఉల్లిపాయలు చాలా తక్కువ కేలరీలు మరియు అధిక జిగట ఫైబర్ కంటెంట్ కలిగి ఉన్నందున అవి శక్తివంతమైన ప్రీబయోటిక్ ఆహారంగా చెప్పబడుతుంది. 160 గ్రాముల తరిగిన ఉల్లిపాయ ముక్కల్లో 64 కేలారీలు, 15 గ్రాముల కార్బో హైడ్రేట్, 16 గ్రాముల కొవ్వు, 7 గ్రాముల ఫైబర్, 76 గ్రాముల ప్రోటీన్స్, 78 గ్రాముల చక్కెర, విటమిన్ సి, బి 6, మాంగనీస్, సల్ఫర్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్, కాలిష్యం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇది తింటే కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. తక్కువ కేలారీలు ఉండటం వల్ల బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఉల్లిపాయలో క్వెర్సెటిన్ అనే ఫ్లేవనాయిడ్ ఉండటం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది. ఉల్లిపాయలో ఇనులిన్, ఫ్రక్టోలిగోసాకరైడ్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రెండు పేగుల ఆరోగ్యానికి అవసరమైన ప్రీబయోటిక్‌లు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాక పొట్టలో ఆరోగ్యకరమైన సూక్ష్మ క్రిములను పెంచడంలో సహాయపడుతుంది. 

మధుమేహం, ప్రీడయాబెటిస్ ఉన్న వ్యక్తులు ఉల్లిపాయ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఉల్లిపాయలో ఉండే అధిక విటమిన్ సి కొల్లాజెన్ ప్రోటీన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది జుట్టు, చర్మ సంరక్షణకి ఉపయోగపడుతుంది. ఇది పిగ్మెంటేషన్‌ను తగ్గించడానికి మరియు UV కిరణాల నుండి చర్మాన్ని రక్షించడానికి విటమిన్ ఎతో కలిసి పనిచేస్తుంది. ఉల్లిపాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఎందుకంటే ఇందులో మంచి మొత్తంలో కాల్షియం ఉంటుంది. ఇందులో 25 కంటే ఎక్కువ రకాల ఫ్లేవనాయిడ్ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి క్యాన్సర్, మధుమేహం మరియు గుండె జబ్బులను తీవ్రతరం చేసే ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తిని నిరోధించగలవు. 

ఉల్లిపాయ జ్యూస్ 

ఉల్లిపాయ ఘాటుగా ఉంటుంది. మామూలుగా తినడానికి కాస్త కష్టంగా ఉంటుంది కానీ బరువు తగ్గాలంటే మాత్రం దీన్ని తీసుకోవాల్సిందే. ఉల్లిపాయ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఉల్లిపాయని ముక్కలుగా కోసుకుని వాటిని నీళ్ళల్లో బాగా ఉడబెట్టుకోవాలి. తర్వాత వాటిని బయటకి తీసి మెత్తగా జ్యూస్ లాగా చేసుకోవాలి. ఉడకబెట్టడం వల్ల కాస్త ఘాటు వాసన కూడా తగ్గుతుంది. 

ఉల్లిపాయ సూప్ 

సూప్స్ లో చాలా పోషకాలు ఉంటాయి. బరువు తగ్గడంలో ఇవి ఎంతో సహాయకారిగా ఉంటాయి. అందుకే ఒక్కసారి ఉల్లిపాయతో సూప్ చేసుకుని ట్రై చెయ్యండి. 

తయారీ విధానం 

సూప్ చేసే గిన్నెలో ఆలివ్ ఆయిల్ వేసి కొద్దిగా అల్లం, వెల్లుల్లి ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి. తర్వాత తరిగిన టమాటాలు, క్యాబేజీ వేసి 30 సెకండ్ల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ లేదా వెజ్జీ స్టాక్  జోడించాలి. ఆ మిశ్రమాన్ని కనీసం 10 నుండి 15 నిమిషాలు ఉడికించిన తర్వాత రుచి కోసం ఉప్పు మరియు మిరియాలు వేసుకుని మారిగించుకోవాలి. చివారిక దాని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి ఉల్లిపాయ సూప్ రెడీ అయిపోతుంది. 

పచ్చి ఉల్లిపాయ 

పోషకాలు పుష్కలంగా ఉండే ఉల్లిపాయని పచ్చిగా తినడం కూడా మంచిదే. పచ్చి ఉల్లిపాయ ముక్కలను కొద్దిగా నిమ్మరసం, పింక్ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. దీన్ని లంచ్ లేదా డిన్నర్ లో సైడ్ డిష్ గా కూడా ఉపయోగించవచ్చు. సలాడ్ లోనూ ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తినొచ్చు, 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: మీరు యవ్వనంగా కనిపించాలని అనుకుంటున్నారా? ఈ పండ్లు తప్పకుండా తీసుకోవాల్సిందే

Also Read: వాక్సింగ్- షేవింగ్ లో ఏది మంచిది? మీ స్కిన్ కి ఏది సరిపోతుందో తెలియడం లేదా?

Published at : 20 Jul 2022 02:51 PM (IST) Tags: Onions Eating Onions Can Help Weight Loss Onion Benefits Health Benefits Of Onions

సంబంధిత కథనాలు

Vitamin K2: విటమిన్ K2 - ఇది లోపిస్తే ఆరోగ్యానికి చేటు, ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి

Vitamin K2: విటమిన్ K2 - ఇది లోపిస్తే ఆరోగ్యానికి చేటు, ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి

Food: ఈ టేస్టీ ఫుడ్ వద్దు డూడ్, పొట్ట పెంచేస్తాయ్, పరేషాన్ చేసేస్తాయ్!

Food: ఈ టేస్టీ ఫుడ్ వద్దు డూడ్, పొట్ట పెంచేస్తాయ్, పరేషాన్ చేసేస్తాయ్!

Drinking Water: భోజనం మధ్యలో నీరు తాగితే బరువు పెరుగుతారా? ఈ అలవాటు వల్ల ఎన్ని నష్టాలో చూడండి

Drinking Water: భోజనం మధ్యలో నీరు తాగితే బరువు పెరుగుతారా? ఈ అలవాటు వల్ల ఎన్ని నష్టాలో చూడండి

Breakfast: మీ గుండె పదిలంగా ఉండాలంటే ఈ బ్రేక్ ఫాస్ట్ తినెయ్యండి

Breakfast: మీ గుండె పదిలంగా ఉండాలంటే ఈ బ్రేక్ ఫాస్ట్ తినెయ్యండి

Organ Donation: తొలి అవయవదానం ఎప్పుడు జరిగిందో తెలుసా? అవయవదానంపై ఉన్న అపోహలు - వాస్తవాలు ఇవే

Organ Donation: తొలి అవయవదానం ఎప్పుడు జరిగిందో తెలుసా? అవయవదానంపై ఉన్న అపోహలు - వాస్తవాలు ఇవే

టాప్ స్టోరీస్

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

TDP On Madhav : మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?

TDP On Madhav :  మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?

Independence Day 2022: ఎర్రకోట వద్ద పదివేల మంది పోలీసులు, 5 కిలోమీటర్ల వరకూ నో ఫ్లైయింగ్ జోన్

Independence Day 2022: ఎర్రకోట వద్ద పదివేల మంది పోలీసులు, 5 కిలోమీటర్ల వరకూ నో ఫ్లైయింగ్ జోన్

Srinivas Goud Firing : కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - పోలీసు దగ్గర ఎస్ఎల్ఆర్ తీసుకుని మరీ ..

Srinivas Goud Firing :  కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - పోలీసు దగ్గర ఎస్ఎల్ఆర్ తీసుకుని మరీ ..