అన్వేషించండి

Mushrooms: వానాకాలంలో పుట్టగొడుగులు తింటే ఈ సమస్యలు వచ్చే అవకాశం

పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొందరికి మాత్రం అనారోగ్యాలను తెచ్చిపెడతాయి.

పోషకాహారాల్లో పుట్టగొడుగులు కూడా ఒకటి. ఇవి అందించే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ. దీనిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఇవి అందరికీ సరిపడాలని లేదు, అలాగే వానాకాలంలో ఎక్కువగా పుట్టగొడుగులు దొరుకుతూ ఉంటాయి. అయితే వానకాలంలో వీటిని తినడం వల్ల కొంతమంది తీవ్ర అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉంది. అలాగే కీళ్ల నొప్పులు,  ఆస్తమా, మల్టిపుల్ స్ల్కెరోసిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు బారిన పడినవారు కూడా పుట్టగొడుగులను తీసుకోకూడదు. కానీ  వాటిని తిని అనారోగ్యాలను తెచ్చి పెట్టుకుంటున్నారు. వీటిని తినడం వల్ల ప్రధానంగా ఐదు సైడ్ ఎఫెక్టులు కలుగుతాయి.

పుట్టగొడుగులు తినడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలలో వికారం, వాంతులు, అతిసారం వంటివి ఎక్కువగా వస్తాయి.  పుట్టగొడుగులు తిన్నాక 20 నిమిషాల నుండి నాలుగు గంటల మధ్య ఈ లక్షణాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

అలాగే పుట్టగొడుగులు తిన్న తర్వాత అవి సరిగా అరిగినట్లు అనిపించవు. దీనివల్ల పొట్ట అసౌకర్యంగా అవుతుంది. విపరీతమైన నీరసం వస్తుంది. అలసట బారిన పడేవారు అధికంగా ఉంటారు.

కొన్ని పుట్టగొడుగులలో కొన్ని రకాల కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి త్వరగా జీర్ణం కావు. ఈ కార్బోహైడ్రేట్లు జీర్ణం కాకపోవడం వల్ల ఇది పెద్ద పేగు  గుండా వెళుతున్నప్పుడు అక్కడ పులిసిపోతాయి. దీనివల్ల విపరీతంగా గ్యాస్ ఉత్పన్నమవుతుంది. దీంతో జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ.

పుట్టగొడుగులు శరీర రోగనిరోశక్తిని పెంచుతాయి. కానీ కొంతమందిలో ఈ పుట్టగొడుగులు చర్మ ఎలర్జీకి కారణం అవుతాయి. చర్మంపై దద్దుర్లు, చికాకులు వస్తాయి. మరి కొంతమందికి ముక్కు నుండి రక్తస్రావం రావడం, నోరు పొడిబారిపోవడం, ముక్కు పొడిబారిపోవడం వంటి సమస్యలు కలుగుతాయి. ఇలాంటి సమస్యలు కనిపిస్తే వారు పుట్టగొడుగులను తినకపోవడమే మంచిది.

గర్భిణీ స్త్రీలు, బాలింతలు పుట్టగొడుగులకు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే ఇవి ఎటువంటి తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయో అంచనా వేయడం కష్టం. కాబట్టి పుట్టగొడుగులను తినడం మానేసి మిగతా ఆహారాలను తినడమే మంచిది.

కొందరిలో పుట్టగొడుగులు తినడం వల్ల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చిన్న స్థాయి నుండి తీవ్రమైన స్థాయి వరకు యాంగ్జయిటీ రావచ్చు. పుట్టగొడుగులను మితంగా కాకుండా అధికంగా తినడం వల్ల ఇలా మానసిక ఆందోళన బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి వానాకాలంలో పుట్టగొడుగులను దూరం పెట్టడం ఉత్తమం. సాధారణ సమయంలో కూడా అవి మీకు పడనట్టు అనిపిస్తే వాటిని తినక పోవడమే అన్ని విధాలా శ్రేయస్కరం.

Also read: అధిక బరువుతో బాధపడుతున్నవారు థైరాయిడ్ క్యాన్సర్ బారిన సులువుగా పడతారా?

Also read: వర్షాకాలంలో మైగ్రేన్ తలనొప్పి వేధిస్తోందా? ఈ ఆయుర్వేద మందులను వాడండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Butter Chicken Roast Recipe : టేస్టీ, జ్యూసీ బటర్ చికెన్ రోస్ట్.. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ ఇదే
టేస్టీ, జ్యూసీ బటర్ చికెన్ రోస్ట్.. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ ఇదే
Female Fertility : నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Scrolling Social Media for Hours : గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
Foods for Bone Health : ఎముకలను డ్యామేజ్ చేసే ఫుడ్స్ ఇవే.. బోన్స్ హెల్తీగా ఉండాలంటే ఇవి తినేయండి
ఎముకలను డ్యామేజ్ చేసే ఫుడ్స్ ఇవే.. బోన్స్ హెల్తీగా ఉండాలంటే ఇవి తినేయండి

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Impact Indian Politics: భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
Heatwave In AP and Telangana: తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
Abhishek Banerjee Attack: బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలిస్తాం: మమతా బెనర్జీ
బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీ హైదరాబాద్‌కు తరలింపు: మమతా బెనర్జీ
Female Fertility : నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Drinker Sai OTT: ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
IPL Best Ever Opening Pair: టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ.. మాజీ క్రికెట‌ర్ అనాల‌సిస్
టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ..
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
CM Vijay Condoles Ajith: అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
Embed widget