అన్వేషించండి

Neem Leaves: ఖాళీ కడుపుతో వేప ఆకులు తీసుకుంటే ఈ రోగాలన్నీ పరార్!

వేప తీసుకోవడమా యాక్.. ఎంత చేదుగా ఉంటుందో అని అనుకుంటున్నారా? కానీ ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.

వేప ఎన్నో గొప్ప ఔషధాలని కలిగి ఉంది. వేప ఆకు నుంచి పువ్వు వరకు ప్రతీ ఒక్కటి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. పూర్వం వేప పుల్లలతోనే పెద్దవాళ్ళు పళ్ళు శుభ్రం చేసుకునే వాళ్ళు. ఇప్పటికీ పల్లెటూరిలో కొంతమంది అలాగే చేస్తున్నారు. బ్రష్ కంటే ఇదే ఎక్కువ ఆరోగ్యాన్ని ఇస్తుందని నమ్ముతారు. పిల్లకు వేప ఆకులతో తయారు చేసిన పానీయాలు, కషాయం ఇస్తారు. ఇది తాగడం వల్ల పొద్దున్నే మలబద్ధకం సమస్య లేకుండా కడుపు శుభ్రం చేస్తుందని చెప్తారు. ఖాళీ కడుపుతో వేప ఆకులు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

మెరుగైన గట్ వ్యవస్థ

వేప ఆకులు ఖాళీ పొట్టతో తీసుకోవడం వల్ల పేగు వ్యవస్థని శుభ్రం చేస్తుంది. ప్రస్తుత రోజుల్లో మనం పాటించే అనారోగ్యకరమైన జీవనశైలి, తీసుకునే ఆహారం, తాగే అలవాట్ల కారణంగా పేగు ఇన్ఫెక్షన్లకు గురవుతుంది. పేగుల్లో మంట, అసౌకర్యం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. వాటిని నయం చేసేందుకు వేప ఆకులు ప్రభావవంతంగా పని చేస్తాయి.

కాలేయ ఆరోగ్యం

పొద్దున్నే నాలుగు వేపఆకులు నమలడం వల్ల కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఫ్రీ రాడికల్స్ వాలల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని దూరం చేస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి కాలేయ కణజాలాల్ని దెబ్బతీస్తుంది. వేప తినడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడొచ్చు.

రక్తంలో చక్కెర స్థాయిలు క్రమబద్ధీకరణ

చేదు రుచి కలిగినప్పటికీ వేపని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. బ్లడ్ షుగర్ సమస్యలు ఉన్నవాళ్ళు పొద్దున్నే కాసిన్ని వేప ఆకులు నమిలితే మంచిది. ఇది ఆరోగ్యాన్ని మొత్తం కాపాడుతుంది.

మలబద్దకాన్ని తగ్గిస్తుంది

పొట్ట సంబంధిత సమస్యల్ని నయం చేయడంలో వేప ఆకులు అద్భుతంగా పని చేస్తాయి. ఉబ్బరం, మలబద్ధకం వంటి వాటిని సులభంగా నయం చేస్తాయి. వేప ఆకుల్లో ఉండే పీచు పదార్థాలు పేగు కదలికలకు సహాయపడతాయి.

ఎలా తినాలి?

వేప ఆకులు తీసుకుని వాటిని శుభ్రంగా నీటిలో కడిగి మిక్సీ లేదా రోట్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దాని నుంచి రసాన్ని తీసుకోవచ్చు. వేప ఆకుల పేస్ట్ రుచి చాల చేదుగా ఉంటుంది. అందుకే మిక్సీ వేసినా రోకలితో రుబ్బినా కూడా వాటికి చేదు రుచి అంటుకుంటుంది. వాటితో మిగతావి ఏవి కలిపినా కూడా అది కూడా చేదు రుచిని ఇస్తాయి. ఎప్పుడు తాజాగా తయారు చేసిన వేప ఆకుల రసాన్ని తీసుకోవాలి. వేప ఆకులు బాణలిలలో వేయించి దాన్ని చేతులతో చూర్ణం చేసుకోవచ్చు. అందులో వెల్లుల్లి, ఆవాల నూనె వేసుకుని కలుపుకోవచ్చు. దీన్ని అన్నంలో కూడా తినొచ్చు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఒకేసారి ఎక్కువ వేప ఆకులు తినకూడదు. మంచి చేస్తుందని అతిగా తీసుకుంటే అది అనార్థాలు కలిగిస్తుంది. పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. ఇది ఆహారాలు, మందులకు ఎప్పుడు ప్రత్యామ్నాయం కాదు. వైద్యులని సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని తీసుకోవడం మంచిది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: ఈ వాటర్ వర్కౌట్స్ తో మీ బరువు భారం దించేసుకోండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
PV Narasimha Rao: తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
YS Jagan News: రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
They Call Him OG : 'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
PV Narasimha Rao: తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
YS Jagan News: రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
They Call Him OG : 'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్
అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు
Unstoppable 4 : వెంకీ మామ, బాలయ్య ఒకే స్టేజ్ మీద... నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్‌ రిలీజ్ డేట్
వెంకీ మామ, బాలయ్య ఒకే స్టేజ్ మీద... నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్‌ రిలీజ్ డేట్
PMAY 2.0 Scheme: మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
ITR: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
Embed widget