Ginger Benefits: అల్లం ఇలా తింటే బోలెడు ప్రయోజనాలు ఉన్నాయండోయ్
మసాల కూరలు రుచిగా ఉండాలన్నా, తలనొప్పి, జలుబు నుంచి ఉపశమనం లభించాలన్నా కావాల్సింది అల్లం. ఇందులో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి.
మసాల కూరలు రుచిగా ఉండాలన్నా, తలనొప్పి, జలుబు నుంచి ఉపశమనం లభించాలన్నా కావాల్సింది అల్లం. ఇందులో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి. కడుపులో గ్యాస్ ఫామ్ అయి ఇబ్బందిగా అనిపిస్తే కొద్దిగా అల్లం ముక్క నమిలి మింగేస్తే ఉపశమనం లభిస్తుందని పెద్దలు చెబుతారు. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పొద్దున్నే పరగడుపున కొద్దిగా అల్లం రసం తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దరి చేరవని నిపుణులు చెప్తున్నారు.
యాంటీ ఆక్సిడెంట్స్ మెండు
ఇతర ఆహారాలతో పోలిస్తే అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను స్థిరీకరించి, ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తాయి. దాని వల్ల శరీరానికి అనారోగ్య సమస్యలు దరి చెరనివ్వకుండా చూస్తుంది.
కడుపులో మంట తగ్గిస్తుంది
ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణగా నిలుస్తుంది గ్యాస్ సంబంధ సమస్యలకి అల్లం గొప్ప ఔషధం. కడుపు ఉబ్బరంగా ఉన్న సమయంలో కొద్దిగా అల్లం ముక్క నోట్లో వేసుకుంటే ఉపశమనంగా ఉంటుంది.
వికారం తగ్గిస్తుంది
పచ్చి అల్లంలో ఉండే జింజెరాల్స్ వికారం మరియు అజీర్ణం వంటి కడుపు సమస్యలు లేకుండా చేస్తుంది. మార్నింగ్ సిక్ నెస్ తో బాధపడే వాళ్ళు కొద్దిగా అల్లం తింటే బాగుంటుంది. గర్బిణి స్త్రీలకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహంతో బాధపడే వారికి అల్లం గొప్ప ఔషధం. రుతుక్రమం సమయంలో వచ్చే నొప్పులని ఇది తగ్గిస్తుంది. అల్లంలో ఉండే జింజెరోల్స్, షోగోల్ మరియు పారాడోల్ రుతుస్రావంలో వచ్చే కండరాల నొప్పితో పోరాడుతున్న మహిళలకు చాలా సహాయకారిగా ఉంటుంది. కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందేలా చేస్తుంది. అందుకే ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళు అల్లం రసం తీసుకోవడం చాలా మంచిది. తలనొప్పిని కూడా తగ్గిస్తుంది.
అల్లం డైట్లో ఎలా తీసుకోవాలి
* కొద్దిగా వేడి నీళ్ళలో నిమ్మకాయ, అల్లం ముక్కలు వేసుకుని కాసేపు నానబెట్టుకుని తాగాలి.
* ప్రతి రోజు ఉదయం అల్లం టీ తీసుకున్న ఆరోగ్యానికి మంచిదే.
* అల్లం రసం, తేనె కలుపుకుని పొద్దున్నే పరగడుపున తాగొచ్చు.
* కూరలు, ఉడికించిన కూరగాయాల్లో అల్లం తురుము వేసుకుని తినవచ్చు.
* అల్లంతో కేకులు, బిస్కెట్లు కూడా చేసుకుని తినొచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: ఈ పదార్థాలు ఇచ్చిన డేట్ కంటే ముందే ఎక్స్‌పైర్ అవుతాయి , జాగ్రత్త పడండి
Also read: మీ పిల్లలు తొమ్మిది గంటలకన్నా తక్కువ నిద్రపోతున్నారా? ఈ నష్టాలు తప్పవంటున్న కొత్త అధ్యయనం