By: ABP Desam | Updated at : 13 Dec 2022 04:39 PM (IST)
Edited By: Soundarya
Image Credit: Pixabay
పండగ టైమ్ వచ్చేసింది. ఇంట్లో ఆడవాళ్ళు అందరూ వంటగది సామాన్లు తోమడానికి రెడీ అయిపోతారు. వంట గది శుభ్రం చేయడం చాలా శ్రమతో కూడుకున్నది. దాన్ని మరింత కష్టం చేసేది మాడిపోయిన గిన్నెలు, జిడ్డు, నూనె వదలని పాత్రలు. వీటి జిడ్డు వదిలించి, మాడిపోయిన పాత్రలు శుభ్రం చేయాలంటే చేతులు నొప్పులు పుట్టేస్తాయి. కానీ ఎటువంటి కష్టం లేకుండా సింపుల్ గా వాటి జిడ్డు వదిలించే మార్గం ఉంది. టీవీ యాడ్స్ లో రెండు చుక్కల డిష్ వాష్ తో అన్ని పాత్రలు కడగవచ్చో లేదో తెలియదు కానీ ఈ టిప్స్ పాటించారంటే మాత్రం మీ వంట పాత్రలు అద్దాల్లా మెరిసిపోతాయి.
ఉప్పు లేనిదే ఏ వంటకి రుచి రాదు. ఇది భోజనం రుచి పెంచడమే కాదు వంటగదిని శుభ్రం చేస్తుంది. జిడ్డుగా ఉన్న పాత్రని గోరు వెచ్చని నీటిలో పెట్టి అందులో కాసింత ఉప్పు వేసి ఒక గంట పాటు ఉంచాలి. అప్పుడు స్క్రబ్బర్ ఉపయోగించి తోమారంటే జిడ్డు త్వరగా వదిలిపోతుంది. పాత్రలని శుభ్రపరిచే మరొక మార్గం.. డిటర్జెంట్ ని ఉప్పులో కలిపి ఆ మిశ్రమాన్ని పాత్రలపై వేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది.
జిడ్డు లేదా మాడిన పాత్రలు వేడి బియ్యం నీటిలో నానబెట్టాలి. 30 నిమిషాల తర్వాత స్క్రబ్ తీసుకుని దాన్ని తోముకోవాలి. ఈ మిశ్రమంలోని స్టార్చ్, సిట్రిక్ యాసిడ్ మురికి, జిడ్డుని సులువుగా వదిలించేస్తాయి.
నూనె వల్లే జిడ్డు పడుతుంది. మరి నూనెతో జిడ్డు వదిలించడం ఏంటా అని ఆలోచిస్తున్నారా! కానీ ఇది చక్కని చిట్కా. వెజిటబుల్ ఆయిల్ ఉపయోగించి జిడ్డు, మురికి, మాడిపోయిన పాత్రల్ని సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. వేడి వేడి వెజిటబుల్ ఆయిల్ లో నిమ్మరసం, ఉప్పు, పంచదార వేసుకుని బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని పాత్రల మీద పోసి స్ప్రెడ్ చేసుకోవాలి. కొంత సేపు వాటిని నానబెట్టిన తర్వాత రఫ్ స్క్రబ్బర్ తో తుడిచేసి వేడి నీటితో కడగాలి. ఇలా చేశారంటే మరకలు లేకుండా మీ పాత్రలు మిలమిలా మెరిసిపోతాయి.
ఇప్పుడు అయితే స్క్రబ్బర్ లు వచ్చాయి కానీ గతంలో అయితే బొగ్గు, కొబ్బరి పీచు వేసి అంట్లు తోముకునే వాళ్ళు. ఇప్పుడు కూడా ఆ చిట్కా బాగా పని చేస్తుంది. వెనిగర్, బేకింగ్ సోడా, వాషింగ్ సబ్బు వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమంలో కొబ్బరి పొట్టు నానబెట్టాలి. తర్వాత పాత్రని వేడి నీటిలో నానబెట్టి కొబ్బరి పిచ్చుతో స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది. పాత్రలకి ఉన్న జిడ్డు చిటికెలో మాయం అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే ఈ చిట్కాలను ట్రై చేయండి.
Also Read: బ్రేక్ ఫాస్ట్‌లో పండ్లు తినకూడదని చెప్తున్న ఆయుర్వేద శాస్త్రం, ఎందుకంటే?
Bitter Gourd: కాకరకాయ చేదు వదిలించే సింపుల్ మార్గాలు ఇవే!
Parenting Tips: మీ పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారా? మీరు మరింత అప్రమత్తంగా ఉండాలని అర్థం
రూ.99 చెల్లిస్తే కోపం తీర్చుకునేందుకు ఏవైనా పగలగొట్టొచ్చు - అదే ఈ రేజ్ రూమ్ ప్రత్యేకత
ఈ జ్యూసు రోజుకో గ్లాసు తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం ఖాయం
Blood Circulation: శరీరంలో రక్త సరఫరా సరిగా జరగకపోతే కనిపించే లక్షణాలు ఇవే - జాగ్రత్త
Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్ని కూడా !
PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?
బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
RBI Policy: దాస్ ప్రకటనల్లో స్టాక్ మార్కెట్కు పనికొచ్చే విషయాలేంటి?