అన్వేషించండి

Rice Cooking Tips : అన్నం మాడిపోకుండా, అతుక్కోకుండా వండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. పొడిపొడిగా వస్తుంది

Tips to Cooking Perfect Rice : కొందరికి అన్నం వండడం కూడా రాదు. దీనివల్ల తప్పక వండుకున్నప్పుడు అన్నం చిమిడిపోవడం, అతుక్కుపోవడం జరుగుతుంది. అలా కాకుండా అన్నం బాగా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బియ్యాన్ని కడిగి, 15-20 నిమిషాలు నానబెట్టడం ముఖ్యం.
  • బియ్యానికి సరైన మోతాదులో నీరు, స్టవ్ మంట నియంత్రించాలి.
  • అన్నం అతుక్కోకుండా నూనె, నెయ్యి వాడటం మంచిది.
  • ఉడికిన తర్వాత 5 నిమిషాలు మూత తీయకుండా ఉంచాలి.

Cooking Perfect Rice Without a Cooker : అన్నం వండటం సింపుల్ అనిపించినా.. కొందరికి మాత్రం అస్సలు రాదు. కొందరు రైస్ కుక్కర్ లేనిదే అన్నం చేయలేరు. కొత్తగా పెళ్లి అయిన వారి నుంచి.. బ్యాచిలర్స్ వరకు ఈ ఇబ్బంది ఎదుర్కొంటారు. దానివల్ల రైస్ కుక్ చేస్తే అది అతుక్కుపోయి స్టిక్కీగా మారడం, మాడిపోవడం జరుగుతుంది. కానీ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే పొడిపొడిలాడే.. ఫ్లఫీగా ఉండే అన్నం చేసుకోవచ్చు. 

అన్నం మాడిపోకుండా.. అతుక్కుపోకుండా రావాలంటే కొన్ని ఈజీ టిప్స్ ఫాలో అవ్వాలి. అలాగే పిల్లలకి వంట నేర్పించాలి అనుకున్నప్పుడు వారికి అన్నం వండేప్పుడు ఈ టిప్స్ ఫాలో అవుతూ వండమని చెప్తే బాగా గుర్తు ఉంటుంది. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో.. అన్నం మంచిగా ఉడికేందుకు అవి ఎలా హెల్ప్ అవుతాయో చూసేద్దాం. 

బియ్యం బాగా కడగాలి

అన్నం వండే ముందు బియ్యం బాగా కడగాలి. దీనివల్ల దానిలో ఉన్న అదనపు స్టార్చ్ పోతుంది. కాబట్టి 2 లేదా 3 సార్లు నీటితో కడిగితే స్టిక్కీనెస్ తగ్గుతుంది.

నానబెట్టండి

చాలామంది చేసే తప్పు ఏంటంటే.. బియ్యం కడిగిన వెంటనే ఉడికించేస్తారు. అలా కాకుండా 15 నుంచి 20 నిమిషాలు నానబెడితే రైస్ సమంగా ఉడుకుతుంది. ఫ్లఫీ టెక్స్చర్ వస్తుంది.

నీటి మోతాదు 

సాధారణంగా 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీరు వేస్తే సరిపోతుంది. ఎక్కువ నీరు వేస్తే అన్నం అతుక్కుంటుంది. గంజి వార్చకపోతే ఈ పద్ధతి ఫాలో అవ్వాలి. మీకు రైస్ ఉడికింది అని తెలిశాక వార్చేస్తామనుకుంటే కొన్ని ఎక్కువ నీళ్లు వేసుకోవచ్చు. అలాగే బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ రైస్క్​కి ఒకటిన్నర గ్లాసుల నీరు సరిపోతుంది

క్వాలిటీ రైస్ 

కొత్త బియ్యం కొన్నిసార్లు అతుక్కుపోతుంది. కానీ పాత బియ్యం వాడితే అన్నం పొడిపొడిలాడుతుంది. 

స్టవ్ ఫ్లేమ్ కంట్రోల్ 

రైస్ వండేప్పుడు ముందుగా హై ఫ్లేమ్​లో పెట్టి.. పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్‌లో ఉడికించాలి. అలా చేస్తే అన్నం సమంగా కుక్ అవుతుంది. అలాగే అన్నం ఉడికేప్పుడు ఓ రెండుసార్లు కలపండి. ఎక్కువసార్లు కలిపితే.. గింజలు బ్రేక్ అయి అన్నం అతుక్కుంటుంది. 

నూనె లేదా నెయ్యి 

మీకు అన్నం అతుక్కోకుండా రావాలంటే ఒక టీస్పూన్ కొబ్బరి నూనె లేదా నెయ్యి వేసుకోవచ్చు. బియ్యం కడిగేప్పుడు లేదా పొంగు వచ్చాక వేసుకోవచ్చాక వేసుకోవచ్చు. 

ఉడికిన తర్వాత.. 

అన్నం ఉడికిన వెంటనే ఓపెన్ చేయకండి. 5 నిమిషాలు మూత పెట్టి ఉంచితే ఆవిరి వల్ల అన్నం ఫ్లఫీగా అవుతుంది. ఎక్కువ నీరు గంజి వార్చితే దానిని ఓ నిమిషం చిన్న మంట మీద ఉంచి స్టౌవ్ ఆపి.. మూత వేసి ఉంచాలి. రైస్ కుక్కర్ వాడితే మీ రైస్ బట్టి 1 లేదా రెండు విజిల్స్ వేస్తే చాలు. ఎక్కువ వేస్తే అన్నం అతుక్కుంటుంది. పైగా కుక్కర్ మూత వెంటనే తీయం కాబట్టి ఎక్కువగా ఉడుకుతుంది. కుకింగ్ టైమ్ ఓవర్ అయితే అన్నం పాడవుతుంది. బియ్యం కడగడం నుంచి నీటి మోతాదు, ఫ్లేమ్ కంట్రోల్ చేయడం వస్తే చాలు పర్ఫెక్ట్ ఫ్లఫీ రైస్ వండేయవచ్చు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
House Cleaning Tips: ఇల్లు తుడిచినా సువాసన రావడం లేదా నీళ్ల బకెట్‌లో ఇది కలిపి చూడండి, రోజంతా రీఫ్రెష్
ఇల్లు తుడిచినా సువాసన రావడం లేదా నీళ్ల బకెట్‌లో ఇది కలిపి చూడండి, రోజంతా రీఫ్రెష్
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
Easy Breakfast Recipes: సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ENG Record Score VS IND In 3rd ODI: లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
CM Revanth Reddy: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
Embed widget