Chick Cup Cakes Recipe : ఈస్టర్ స్పెషల్ టేస్టీ చిక్ కప్ కేక్స్.. చాలా ఈజీగా తయారుచేసుకోగలిగే రెసిపీ ఇదే
Easter Recipes : క్రీస్తు పునరుత్థానం పురస్కరించుకుని ఈస్టర్ను సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకే ఈ సమయంలో పలు రకాల స్వీట్లు చేసుకుని వాటిని తింటూ ఎంజాయ్ చేస్తారు. వాటిలో కప్ కేక్స్ ఒకటి.
Cup Cakes for Easter : ఈస్టర్ సమయంలో చేసుకునే డెజర్ట్‌లు చూసేందుకు చాలా అందంగా.. తినేందుకు చాలా టేస్టీగా ఉంటాయి. అయితే ఈ సమయంలో ట్రెడీషన్ స్వీట్లకు బదులుగా బేక్ చేసిన డెజర్ట్స్, కేక్స్ వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తారు. అయితే ఈ ఈస్టర్కి మీరు కూడా మంచి టేస్టీ కేక్ తయారు చేసుకోవాలనుకుంటే ఈస్టర్ చిక్ కప్ కేక్స్ తయారు చేసుకోవచ్చు. ఇవి చూసేందుకు చాలా ఇంట్రెస్టింగ్గా, తినేందుకు చాలా రుచిగా ఉంటాయి. పైగా వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీ ఈస్టర్ (Easter 2024)డిన్నర్‌కి అతిథులను పిలిచినా.. ఇవి వారిని అస్సలు నిరాశపరచవు. మరి ఈస్టర్ చిక్ కప్ కేక్స్‌ని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చుద్దాం.
కావాల్సిన పదార్థాలు
చక్కెర - ఒకటిన్నర కప్పు
బటర్ - 1 కప్పు (సాల్ట్ లేనిది)
గుడ్లు - 3
వెనిలా ఎసెన్స్ - 2 టీస్పూన్స్
ఆల్ పర్పస్ ఫ్లోర్ - రెండు కప్పులు
మొక్కజొన్న పిండి - 3 టేబుల్ స్పూన్లు
బేకింగ్ పౌడర్ - ఒకటిన్నర స్పూన్
ఉప్పు - చిటికెడు
పాలు - ముప్పావు కప్పు
లేయర్ కోసం
షుగర్ పౌడర్ - 300 గ్రాములు
బటర్ - ముప్పావు కప్పు (ఉప్పులేనిది)
క్రీమ్ - 1 టేబుల్ స్పూన్
వెనిలా ఎసెన్స్ - 1 టీస్పూన్
ఎల్లో శాండింగ్ షుగర్ - పావు కప్పు
చాక్లెట్ చిప్స్ - గుప్పెడు
ఆరెంజ్ ఫుడ్ కలర్ - లుక్ కోసం
తయారీ విధానం
ముందుగా ఓవెన్‌ను 350 డిగ్రీలకు ప్రీహీట్ చేసుకోవాలి. దానిని లైనర్లతో, 2 స్టాండర్డ్, 12 కప్ మఫిన్ టిన్లతో లైన్ చేయాలి. ఇప్పుడు ఓ పెద్దగిన్నెలో చక్కెర, బటర్‌ను తీసుకోండి. మీ దగ్గర హ్యాండ్ హెల్డ్ మిక్సర్ ఉంటే హై స్పీడ్‌లో దానిని మిక్స్ చేయవచ్చు. లేదంటే విస్క్‌తో బాగా కలపవచ్చు. బటర్ పూర్తిగా మెత్తగా అయ్యి.. చక్కెర దానిలో పూర్తిగా కలిసేవరకు కలపాలి. ఇప్పుడు దానిలో ఒక్కో గుడ్డు వేసి.. బాగా కలపాలి. మిశ్రమం పూర్తిగా కలుస్తూనే మెత్తగా మారిపోవాలి. ఇలా ఒక్కోగుడ్డు వేసి వేసి కలిపిన తర్వాత వెనిలా ఎసెన్స్ కూడా వేసి పూర్తిగా దానిలో కలిసేలా కలపాలి. మీరు ఎంత బాగా కలిపితే.. కప్ కేక్స్ అంత బాగా వస్తాయి.
ఇప్పుడు మరో మీడియం సైజ్ గిన్నె తీసుకుని.. దానిలో మొక్కజొన్న పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి కలపండి. ఇది పొడి పిండిని.. ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బటర్ మిక్స్‌లో కొంచెం కొంచెంగా వేస్తూ.. పూర్తిగా కలపాలి. ఉండలు లేకుండా.. పిండి ఎక్కడ ఉండకుండా.. పూర్తిగా ఆ మిక్స్‌లో కలిసేలా పొడి పిండి వేస్తూ కలపాలి. ఒకేసారి పిండి వేస్తే కలపడం ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం కొంచెంగా వేయాలి. ఇలా చేయడం వల్ల పిండిని కలపడం సులభం అవుతుంది. ప్రీ హీట్ చేసుకున్న లైనర్లను మూడువంతుల పిండితో నింపాలి. వాటిని ఓవెన్లో పెట్టాలి. ఈ కప్‌కేక్స్ కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేవరకు కాల్చండి. ఇది ఉడికిందో లేదో తెలుసుకోవడానికి టూత్ పిక్‌ని లోపలికి గుచ్చితే పిండి అంటుకోకుండా వస్తే తీసేయొచ్చు. ఇవి బేక్ అవ్వడానికి సుమారు 25 నిమిషాలు సమయం పడుతుంది. పూర్తిగా రెడీ అయిన వాటిని బయటకు తీసి చల్లారనివ్వాలి.
లేయరింగ్ కోసం..
ఓ పెద్ద గిన్నెలో చక్కెర, బటర్‌ను వేసి బాగా మెత్తగా అయ్యేవరకు బీట్ చేయాలి. హ్యాండ్ మిక్సర్ ఉంటే ఇంకా సులభంగా, త్వరగా దీనిని తయారు చేయవచ్చు. ఇప్పుడు దానిలో క్రీమ్, వెనిలా ఎసెన్స్ వేసి పూర్తిగా కలిసేలా బీట్ చేయాలి. ఇప్పుడు దానిలో ఎల్లో శాండెండ్ షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా తయారుచేసుకుని పెట్టుకున్న కప్ కేక్స్‌పై వీటిని లేయర్‌గా వేయాలి. చాక్లెట్ చిప్స్‌ను కప్కేక్స్పై గార్నిష్ చేయాలి. మీకు నచ్చిన విధంగా వాటిని క్రీమ్, చిప్స్‌తో గార్నిష్ చేసుకోవచ్చు.
గార్నిష్ చేయగా మిగిలిన బటర్ క్రీమ్‌లో ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి.. కావాల్సిన రంగు వచ్చేవరకు కలపాలి. ఇప్పుడు దానిని గుండ్రని పైప్ అమర్చిన.. పైపింగ్ బ్యాగ్‌లోకి వేసి.. మీకు నచ్చినట్లు చిక్ కప్ కేక్స్‌ని గార్నిష్ చేసుకోవచ్చు. ఇవి చూసేందుకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కాబట్టి పిల్లలు బాగా తింటారు. పెద్దలు కూడా చాలా ఇష్టంగా వీటిని లాగించేయవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి.. ఈస్టర్ని మరింత స్వీట్‌గా సెలబ్రేట్ చేసుకోండి.
Also Read : గుడ్ ఫ్రైడే తేది ప్రతి ఏటా ఎందుకు మారుతుంది? జీసస్ చనిపోయిన రోజును గుడ్ ఫ్రైడేనే అని ఎందుకంటారు?