Fatty Liver Disease: ఆకలిగా ఉండటం లేదా? ప్రమాదకరమైన వ్యాధికి ఇది ముందస్తు లక్షణం
కాలేయానికి ఒక గొప్ప లక్షణం ఉంది. దానికి వచ్చిన వ్యాధిని సకాలంలో గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని అదే నయం చేసుకోగల లక్షణం దీనికి ఉంది.
అతి తక్కువ సమయంలో ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆల్కహాల్ సంబంధిత ఫ్యాటీ లివర్ డీసీజ్ సంభవిస్తుంది. ఒక వ్యక్తి చాలా సంవత్సరాలుగా వారానికి 14 యూనిట్ల కంటే ఎక్కువ ఆల్కహాల్ తాగినప్పుడు ఈ వ్యాధి అభివృద్ధి చెందుతుంది. ఆల్కహాల్ సంబంధిత కొవ్వు కాలేయ వ్యాధి సంకేతాలు సాధారణంగా లివర్ దెబ్బతినే వరకు కనిపించవు. కానీ ముందుస్తుగా కొన్ని హెచ్చరిక సంకేతాలు ఇస్తుంది. వాటిని ముందే పసిగడితే మాత్రం ఈ వ్యాధి నుంచి బయట పడొచ్చు.
కడుపు నొప్పి
ఈ వ్యాధి ఉన్న రోగుల్లో అస్పష్టంగా ఎగువ పొత్తి కడుపు నొప్పి అనుభవిస్తారు. ఈ రకమైన నొప్పి సాధారణంగా లేదా ఎక్కువగా ఉంటుంది. కడుపు నొప్పితో పాటు వికారం కూడా ఉంటుంది.
ఆకలి కోల్పోతారు
ఆకలి లేకపోతే మాత్రం అది ఆల్కహాలిక ఫ్యాటీ లివర్ డీసీజ్ వల్ల కావచ్చు. యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం కాలేయ వ్యాధిలో గ్రెలిన్ స్థాయిలు ఆహారనికి ముందు అంటే భోజనం చేసే ముందు పెరగడంలో విఫలమవుతాయి. దాని వల్ల ఆకలిగా అనిపించదు. భోజనం చేసేటప్పుడు గ్రేలిన్ స్థాయిలు ప్రభావాన్ని కోల్పోతాయి. ఈ గ్రెలిన్ అనేది ఆకలి కలిగించే హార్మోన్. ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఎలివేటెడ్ పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్, సీరం లెప్టిన్ కలయిక వల్ల గ్రెలిన్ స్థాయి తగ్గుతుంది.
అలసట
అలసట శారీరకంగా కావచ్చు, లేదంటే మానసికంగా కూడా అలసటగా అనిపిస్తుంది. ఆల్కహాల్ సంబంధిత ఫ్యాటీ లివర్ వ్యాధి వల్ల కాలేయంలో అధిక కొవ్వు ఏర్పడుతుంది. దీని వల్ల మంట వస్తుంది. ఇది ప్రొ ఇన్ఫ్లమేటరీ సైటోకిన్ విడుదలకు కారణమవుతుంది. అలసటకి దారి తీస్తుంది.
అతిసారం
ఈ వ్యాధి పేగు కదలికలను కూడా పాడు చేస్తుంది. యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం సిర్రోసిస్ లో చిన్న పేగు పనితీరు ఆటంకం ఏర్పడటం వల్ల బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. అతిసారం సమస్య వస్తుంది.
అనారోగ్యంగా అనిపిస్తుంది
కాలేయం మీరు తాగే ఆల్కహాల్ ని విచ్ఛిన్నం చేస్తుంది. శరీరం నుంచి దాన్ని తొలగించలేదు. దాన్ని విచ్ఛిన్నం చేసే ప్రక్రియ హానికరమైన పదార్థాలను కూడా ఉత్పత్తి చేస్తుంది. ఇది కాలేయ కణాలను దెబ్బతీస్తుంది. వాపును కలిగిస్తుంది. శరీరం సహజ రక్షణ బలాన్ని బలహీనపరుస్తుంది. దీని వల్ల అనారోగ్యంగా అనిపిస్తుంది.
ఈ హెచ్చరిక సంకేతాలలో ఏదైనా అనుభవిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. అయితే ఈ సంకేతాలు ఎప్పుడు కాలేయ వ్యాధితో సంబంధం కలిగి ఉండాల్సిన అవసరం లేదు. కానీ రోగ నిర్దారణ కోసం ముందస్తుగా పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: వేసవిలో ఏసీ లేకుండానే మీ రూమ్ ఇలా చల్లబరుచుకోవచ్చు