Drone Saves Life: పెద్దాయన ప్రాణాలు కాపాడిన డ్రోన్.. ఐడియా బాగుందే!

డ్రోన్లతో మనుషుల ప్రాణాలను సైతం కాపాడవచ్చు. ఇదిగో స్వీడన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనే నిదర్శనం.

FOLLOW US: 

డ్రోన్లు.. పెళ్లిల్లు, ఫంక్షన్లకే కాదు.. ప్రాణాలు రక్షించేందుకు కూడా ఉపయోగపడతాయి. ఇందుకు స్వీడన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనే నిదర్శనం. ట్రాల్‌హటన్‌లో కారులో వెళ్తున్న 71 ఏళ్ల పెద్దాయనకు మార్గ మధ్యలో హార్ట్ ఎటాక్‌ వచ్చింది. తీవ్రమైన నొప్పితో అతడు స్పృహ కోల్పోయాడు. అయితే, రోడ్డుపై భారీగా మంచు పేరుకోవడం వల్ల అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లడం సాధ్యం కాలేదు. అదే సమయానికి అటుగా వెళ్తున్న ఓ డాక్టర్ వెంటనే అతడికి CPR  (cardiopulmonary resuscitation) చేశారు. పక్కనే ఉన్న మరో వ్యక్తికి వెంటనే 112‌(స్వీడన్ ఎమర్జన్సీ నెంబర్)కు కాల్ చేయమని చెప్పాడు. 

కొద్ది నిమిషాల తర్వాత ఓ డ్రోన్ అటుగా ఎగురుతూ వచ్చింది. అందులో ‘డీఫిబ్రిలేటర్’ (Defibrillator: గుండెకు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చే పరికరం) ఉంది. డాక్టర్ వెంటనే ఆ పరికరాన్ని తీసుకుని బాధితుడిపై ప్రయోగించాడు. వెంటనే అతడు లేచి కూర్చున్నాడు. అంబులెన్స్ అక్కడికి చేరుకొనే లోపే అతడికి చికిత్స అందించేందుకు డ్రోన్ బాగా పనిచేసింది. 

రోడ్డుపై అతడికి సీపీఆర్ చేసిన డాక్టర్ ముస్తఫా అలీ స్పందిస్తూ.. ‘‘నేను హాస్పిటల్‌కు వెళ్తుండగా.. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ కారులో పెద్దాయన స్పృహ కోల్పోయి కనిపించాడు. అప్పటికి అతడి పల్స్ కొట్టుకోవడం లేదు. దీంతో వెంటనే అతడికి చికిత్స అవసరమని భావించాను. బాధితుడిని తిరిగి స్పృహలోకి తెచ్చేందుకు సీపీఆర్ చేశాను. 112కు కాల్ చేసిన తర్వాత గాల్లో ఏదో ఎగురుతూ వచ్చింది. అందులో Defibrillator ఉంది. దానివల్ల అతడి ప్రాణాలు కాపాడగలిగాను’’ అని తెలిపారు. ఇలాంటి అత్యవసర సేవలకు డ్రోన్లను ఉపయోగించడం మంచి ఆలోచన అని పేర్కొన్నారు. ఈ డ్రోన్‌ను మెడికల్ ఏరియల్ డెలివరీ సర్వీస్ (EMADE), స్వీడన్‌లోనే అతి పెద్ద మెడికల్ యూనివర్శిటీ కరోలిన్స్‌కా ఇనిస్టిట్యూట్‌‌లు సంయుక్తంగా ఈ డ్రోన్లు తయారు చేశాయి.

Also Read: యాసిడ్ దాడి చేసిన వ్యక్తినే ప్రేమించి పెళ్లాడిన యువతి, చివరికి ఊహించని ట్విస్ట్...

Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్

Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!

Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)

Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Drone Saves Life Drone Saves Man Life Sweden Drone Sweden Drone Medical Help ప్రాణాలు కాపాడిన డ్రోన్

సంబంధిత కథనాలు

Viral video: అంతరిక్ష కేంద్రం నుంచి రాత్రి వేళ భూమిని చూస్తే ఆ కిక్కే వేరప్పా

Viral video: అంతరిక్ష కేంద్రం నుంచి రాత్రి వేళ భూమిని చూస్తే ఆ కిక్కే వేరప్పా

MonkeyPox Virus: అమ్మవారులా కనిపించే మంకీపాక్స్, ఆఫ్రికాలో పుట్టి ఇతర దేశాలకు పాకుతున్న వైరస్

MonkeyPox Virus: అమ్మవారులా కనిపించే మంకీపాక్స్, ఆఫ్రికాలో పుట్టి ఇతర దేశాలకు పాకుతున్న వైరస్

Periods: పీరియడ్స్ సమయానికి రావడం లేదా? ఆయుర్వేదం చెబుతున్న చిట్కాలు ఇవిగో

Periods: పీరియడ్స్ సమయానికి రావడం లేదా? ఆయుర్వేదం చెబుతున్న చిట్కాలు ఇవిగో

Icecream Headache: ఐస్‌క్రీము తలనొప్పి గురించి తెలుసా? ఎంతో మందికి ఉన్న సమస్యా ఇది

Icecream Headache: ఐస్‌క్రీము తలనొప్పి గురించి తెలుసా? ఎంతో మందికి ఉన్న సమస్యా ఇది

PreDiabetes: ప్రీడయాబెటిస్ స్టేజ్‌లో ఉన్న యువతలో గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, తేల్చిన అంతర్జాతీయ అధ్యయనం

PreDiabetes: ప్రీడయాబెటిస్ స్టేజ్‌లో ఉన్న యువతలో గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, తేల్చిన అంతర్జాతీయ అధ్యయనం

టాప్ స్టోరీస్

Parag Agrawal On Twitter Spam: పరాగ్ X మస్క్- స్పామ్ అకౌంట్లపై తగ్గేదేలే అంటూ ట్వీట్ వార్!

Parag Agrawal On Twitter Spam: పరాగ్ X మస్క్- స్పామ్ అకౌంట్లపై తగ్గేదేలే అంటూ ట్వీట్ వార్!

Prabhas Project K Update: ప్రభాస్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేశాం, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం - నాగ్ అశ్విన్ రిప్లై 

Prabhas Project K Update: ప్రభాస్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేశాం, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం - నాగ్ అశ్విన్ రిప్లై 

AP PCC New Chief Kiran : వైఎస్ఆర్‌సీపీతో పొత్తు దిశగా ప్లాన్ - ఏపీ పీసీసీ చీఫ్‌గా మాజీ సీఎం !?

AP PCC New Chief Kiran :   వైఎస్ఆర్‌సీపీతో పొత్తు దిశగా ప్లాన్ - ఏపీ పీసీసీ చీఫ్‌గా మాజీ సీఎం !?

Nalgonda: ‘పైసలియ్యి, లేకుంటే చావు’ పెళ్లి కాకముందే కట్నం కోసం వరుడి మెసేజ్‌లు - యువతి ఆత్మహత్య

Nalgonda: ‘పైసలియ్యి, లేకుంటే చావు’ పెళ్లి కాకముందే కట్నం కోసం వరుడి మెసేజ్‌లు - యువతి ఆత్మహత్య