Beauty Tips: మెరిసే చర్మం కోసం రోజూ వీటిని తాగండి చాలు, మెరిసే రంగు రూపం సొంతమైపోతుంది
చర్మం కోసం ప్రత్యేకంగా ఆహారాన్ని తినాల్సిందే. అప్పుడే మరింతగా మెరుస్తుంది చర్మం.
పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివని అందరికీ తెలిసిందే. ఇవి అన్నింటికన్న ముఖ్యంగా చర్మానికి మేలు చేస్తాయి. వీటిని జ్యూస్ రూపంలో తీసుకున్నా,లేక పండురూపంలో తీసుకున్నా మంచిదే. ముఖ్యంగా సీజనల్ పండ్లను కచ్చితంగా తినాలి. ఇవి మంచి పోషణను అందించడంతో పాటూ తక్షణ శక్తిని అందిస్తాయి. చర్మం, జుట్టు రెండింటినీ మెరిసేలా చేస్తాయి ఈ పండ్ల రసాలు. శరీరాన్ని తేమవంతంగా మార్చడంలో కూడా ఇవి ముందుంటాయి.
యాపిల్ జ్యూస్
ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. హానికారకమైన వ్యాధులను కలిగించే బ్యాక్టిరియాల నుంచి కాపాడుతాయి. ఈ పండు రుచి కూడా బావుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తినేందుకు ఇష్టపడతారు. ఇందులో ఉండే ఖనిజాలు పొట్ట సమస్యలను నయం చేస్తాయి. అనారోగ్యంగా ఉన్నప్పుడు త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడే పండు యాపిల్. ఈ పండులో నిండుగా ఉండే ఇనుము జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. చర్మపు రంగును కూడా పెంచుతుంది. చర్మానికి మెరుపు తెస్తుంది. రోజుకో యాపిల్ పండు తినడం అలవాటు చేసుకుంటే కేవలం రెండు వారాల్లోనే మీకు చర్మంలో మార్పు కనిపిస్తుంది.
ద్రాక్ష రసం
ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. రక్తప్రసరణకు సహాయపడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే రక్త ప్రసరణ సక్రమంగా ఉండాలి. అప్పుడే చర్మం తాజాగా మెరుస్తుంది. చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి కూడా అవసరం. అలాగే విటమిన్ సి కూడా అత్యవసరం. ఈ రెండూ ద్రాక్షలో నిండుగా ఉంటాయి. నల్లని మచ్చలు, మొటిమల సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది ద్రాక్ష రసం. మచ్చలేని సౌందర్యానికి ద్రాక్ష ఎంతో సాయపడుతుంది.
నారింజ జ్యూస్
దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీన్ని రోజు తాగడం వల్ల చర్మపు రంగు మారుతుంది. కాంతిమంతంగా తయారవుతుంది. ఇందులో ఉండే పీచు కూడా చర్మపు రంగును మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది. జీర్ణక్రియ ప్రక్రియను కూడా ప్రోత్సహిస్తుంది. చర్మం రంగును నిర్ణయించేది మెలనిన్ అనే పదార్థం. ఆరెంజ్ రంగు వల్ల మెలనిన్ శాతం తగ్గుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల చర్మంపై ఉండే మురికిపోతుంది. నల్లమచ్చలు కూడా దూరం అవుతాయి.
దానిమ్మ రసం
దానిమ్మలో శరీరానికి అవసరమైన పోషకాలన్నీ ఉన్నాయి. రక్తహీనత ఉన్న వారు ఈ పండు తినడం వల్ల చాలా లాభం కలుగుతుంది. ఎర్రరక్త కణాల సంఖ్య పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. విటమిన్ ఎ, సి కూడా ముడతలను, గీతలను నివారించేందుకు సహకరిస్తాయి. దీన్ని ఫేషియల్ ప్యాక్ కూడా అప్లయ్ చేసుకోవచ్చు.
టొమాటో జ్యూస్
మీ చర్మం డల్‌గా ఉందా? ఏమాత్రం ఆకర్షణీయంగ లేదా? అయితే టోమటో జ్యూస్ తాగండి. చర్మం మెరుపులీనుతుంది. నల్లని మచ్చలు, కంటి చుట్టూ నల్లటి వలయాలు, గీతలు, ముడతలు అన్నింటినీ తొలగిస్తుంది. అందాన్ని కాపాడుకోవడానికి దీన్ని నేరుగా తిన్నా మంచిదే. ఫేస్ ప్యాక్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు.
పుచ్చకాయ జ్యూస్
ఈ పండులో నీటి శాం ఎక్కువ.ఇది మీ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచుతుంది. టానింగ్ నుంచి కాపాడుతుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ముఖంపై రాసుకుంటే చర్మంపై పట్టిన మురికిని పోగొడుతుంది.సూర్యరశ్మి నుండి మీ చర్మాన్ని రక్షించుకోవడానికి, వడదెబ్బను నివారించడానికి పుచ్చకాయను తినండి.
Also read: ఈ అయిదు ఆహారాలు తింటే చాలు, దంతాలు తెల్లగా మెరుస్తాయి
Also read: మగవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే అమ్మాయిలు ఇట్టే పడిపోతారు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.Al