Clove Tea: కఫం పోవాలంటే రోజుకు రెండుసార్లు లవంగ టీ తాగండి
Clove Tea: ఆయుర్వేదంలో లవంగాలను ఔషధాలతో సమానంగా చూస్తారు.
![Clove Tea: కఫం పోవాలంటే రోజుకు రెండుసార్లు లవంగ టీ తాగండి Drink clove tea twice a day to get rid of phlegm Clove Tea: కఫం పోవాలంటే రోజుకు రెండుసార్లు లవంగ టీ తాగండి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/15/77539efc63f5d08da9548f67f08c06c51700034877324248_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Clove Tea: చలికాలం వచ్చిందంటే ఎంతోమందికి శ్వాసకోశ సమస్యలు వేధిస్తాయి. ఆస్తమా ఉన్న వారి పరిస్థితి మదీ అధ్వానంగా ఉంటుంది. ఎంతో మందికి జలుబు, దగ్గు వంటివి దాడి చేస్తాయి. కఫం ఊపిరితిత్తులకు పట్టి చాలా ఇబ్బంది పెడుతుంది. ముక్కుదిబ్బడం వల్ల సరిగా నిద్ర కూడా రాదు. అందుకే కఫం పట్టిన వెంటనే లవంగ టీని తాగడం మొదలుపెడితే కఫం త్వరగా వదిలేసే అవకాశం ఉంది. ఆయుర్వేదంలో కూడా లవంగ టీని ఔషధ టీ గానే చెబుతారు. కఫం ఎక్కువగా పడితే ముఖంలోని నుదుటి భాగంలో నొప్పులుగా అనిపిస్తుంది. గొంతులో ఇబ్బందిగా ఉంటుంది. వైద్యులను కలిసి మందులు వాడే బదులు ఇంట్లోనే ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే త్వరగా కఫం పోతుంది.
లవంగ టికి కఫాన్ని విరిచే శక్తి ఉంది. ఈ టీ చేయడం చాలా సులువు. రెండు లవంగాలు, చిన్న అల్లం ముక్క, చిన్న దాల్చిన చెక్క ముక్క, నీళ్లు తీసుకోవాలి. ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి. అందులో అల్లం ముక్క, దాల్చిన చెక్క ముక్క, లవంగాలు వేసి చిన్న మంట మీద మరిగించాలి. అవి బాగా మరిగాక స్టవ్ కట్టేయాలి. నీళ్లు గోరువెచ్చగా మారాక వడకట్టి ఒక గ్లాసులో వేయాలి. ఆ గ్లాసులో అర చెంచా తేనె కలుపుకోవాలి. ఆ టీ ని కొద్దికొద్దిగా సిప్ చేస్తూ తాగాలి. ఆ పానీయం గొంతులోకి జారుతూ ఉంటే ఎంతో సాంత్వనగా అనిపిస్తుంది. ఈ లవంగ టీ శరీరంలోకి చేరాక కఫాన్ని విరిచేస్తుంది. త్వరగా కఫం బయటికి వచ్చేస్తుంది. నోట్లోకి వచ్చిన కఫాన్ని ఎప్పటికప్పుడు ఉమ్మేస్తూ ఉండండి.
ఈ లవంగ టీలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఎక్కువ. దగ్గు, జ్వరం, జలుబు వంటివి రాకుండా అడ్డుకుంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సైనస్ సమస్యతో బాధపడేవారు లవంగ టీని తరచూ తాగుతూ ఉండాలి. కఫం అధికంగా పట్టినప్పుడు లవంగ టి మాత్రమే కాదు, కాకరకాయలతో చేసిన వంటకాలను కూడా అధికంగా తినడం ముఖ్యం. కాకరకాయలకు కూడా కఫాన్ని విరిచే శక్తి ఉంది. వీటితో పులుసు లేదా కూర వండుకొని తింటే మంచిది. దగ్గు, జలుబు వంటి వాటికి కాకరకాయ ఔషధంలా పనిచేస్తుంది. లవంగ టీ తాగడం వల్ల వాంతులు, వికారం, అలసట, అజీర్తి వంటివి రాకుండా ఉంటాయి.
Also read: గుండె వ్యాధి ఉన్నవారు తప్పకుండా తాగాల్సిన ఐదు పానీయాలు ఇవే
Also read: మగవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తే మొదట కనిపించే లక్షణాలు ఇవే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)