అన్వేషించండి

Banana: అరటి పండ్లు అతిగా తింటున్నారా? ఇక అంతే సంగతులు

మీ మూడ్ మార్చి తక్షణ శక్తిని అందించే వాటిలో అరటిపండు ముందుంటుంది. కానీ అతిగా తింటే మాత్రం అనార్థాలు తప్పవు.

అన్ని సీజన్లలో అందరికీ అందుబాటులో ఉండే పండు అరటిపండు. ఆరోగ్యానికి అవసరమైన పోషకాలన్నీ అందించే సూపర్ ఫుడ్ ఇది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. రోగనిరోధక శక్తి స్థాయులను పెంచుతుంది. అరటిపండులో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, చక్కెర, మెగ్నీషియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నాయి. జీర్ణక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పేగు కదలికలని నియంత్రిస్తుంది. ఎన్నో పోషక గుణాలు కలిగిన అరటి పండు ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందో అతిగా తింటే మాత్రం అంతే అనారోగ్యాన్ని ఇస్తుంది.

అరటిపండులో దాదాపు 100 కేలరీలు ఉంటాయి. రోజు రెండు అరటిపండ్లకి మించి తింటే బరువు వేగంగా పెరుగుతారు. అంతే కాదు ఇందులో లభించే పొటాషియం పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన దానికి మించి పొటాషియం తీసుకుంటే మైకం, వాంతులు, పల్స్ రేటు పెరగుతుంది. ఇది హైపర్ కలేమియా లక్షణం. ఒక్కోసారి గుండె పోటుకు కూడా కారణమవుతుంది.

అతిగా అరటిపండు తింటే వచ్చే నష్టాలు

☀ అరటిపండ్లు అతిగా తినడం వల్ల దంతాల్లో పుచ్చు ఏర్పడుతుందని పరిశోధనలో తేలింది. ఇందులో స్టార్చ్ ఉంటుంది. ఇది దంతల మధ్య సులభంగా అంటుకుంటుంది. అందుకే అరటిపండు తిన్న రెండు గంటల్లోపు దంతాలు శుభ్రం చేసుకోవాలి.

☀ ఇందులో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. దీన్ని అధిక మోతాదులో తీసుకుంటే నరాలు దెబ్బతింటాయి. బాడీ బిల్డింగ్ కోసం అరటిపండ్లు ఎక్కువగా తినే వారికి ఈ సమస్య రావచ్చు.

☀ పచ్చి అరటిపండ్లలో స్టార్చ్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. రోజూ తీసుకుంటే గ్యాస్, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. పండిన అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకి మంచిది. తక్కువ నీటిని కలిగి ఉంటాయి. అతిగా తింటే మాత్రం మలబద్ధకాన్ని తీసుకొస్తుంది.

☀ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అందుకే మధుమేహం ఉన్న వాళ్ళు వీటిని వైద్యులను సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి.

☀ కిడ్నీ సంబంధిత సమస్యలు ఉంటే పొటాషియం అధికంగా ఆహారాన్ని తీసుకోవద్దని సలహా ఇస్తారు. అటువంటి వాళ్ళు అరటిపండుని దూరం పెట్టాలి.

అరటిపండు వల్ల లాభాలు

రోజూ అరటిపండు తింటే మంచిదే. పెద్దది కాకుండా మీడియం సైజుది తీసుకోవాలి. గుండెపై ఒత్తిడి పడకుండా చేస్తుంది. ఒక వ్యక్తికి రోజుకు అవసరమైన పొటాషియాన్ని అరటిపండు తీర్చేస్తుంది. ఇందులో లెక్టిన్ ఉంటుంది. క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. అయితే పరగడుపున అరటిపండు తీసుకోరాదు. అలా అని పాలు అరటి పండు కూడా కలిపి తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.  చాలా మంది బ్రేక్ ఫాస్ట్ చేయకుండా ఒక అరటిపండు తినేసి కడుపు నింపుకుంటారు. కానీ దాని వల్ల పొట్ట ఉబ్బరం సమస్య వస్తుంది. అందుకే పరగడుపున ఎప్పుడు అరటిపండు తీసుకోవద్దు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: కొవ్వు కరగాలా? వెల్లులిని ఇలా తీసుకోండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Notice to Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Notice to Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
Melbourne Test: ఆ వ్యక్తిగత రికార్డులపై బుమ్రా, జడేజా గురి.. నాలుగో టెస్టులో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్న భారత ప్లేయర్లు
ఆ వ్యక్తిగత రికార్డులపై బుమ్రా, జడేజా గురి.. నాలుగో టెస్టులో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్న భారత ప్లేయర్లు
Hyderabad Police Warning: సంధ్య థియేటర్ ఘటనపై దుష్ప్రచారం, కఠిన చర్యలు తప్పవన్న హైదరాబాద్ పోలీసులు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై దుష్ప్రచారం, కఠిన చర్యలు తప్పవన్న హైదరాబాద్ పోలీసులు
Delhi Elections : త్వరలో సీఎం అతిషి అరెస్ట్.. ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ పోస్ట్
త్వరలో సీఎం అతిషి అరెస్ట్ - ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ పోస్ట్
Vajpayee 100th Birth Anniversary: రాజ్యాంగానికి కట్టుబడి అధికారాన్ని వదులుకున్న గొప్ప నేత వాజ్‌పేయి: ప్రధాని మోదీ
రాజ్యాంగానికి కట్టుబడి అధికారాన్ని వదులుకున్న గొప్ప నేత వాజ్‌పేయి: ప్రధాని మోదీ
Embed widget