Hair Growth Secrets : జుట్టు వేగంగా పెరగాలంటే కత్తిరించాలా? Long Hair కోసం నిపుణుల సూచనలివే
Cutting Hair for Grow Better : జుట్టు పొడుగ్గా పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా చివర్లు కత్తిరించుకోవాలంటున్నారు నిపుణులు. షాకింగ్ రిజల్ట్స్ పక్కా అంటున్నారు. ఎంతవరకు నిజం?

Hair Trims for Faster Hair Growth : జుట్టు పెరుగుదల అనేది వివిధ అంశాలపై ప్రభావం చూపిస్తుంది. కానీ దానికి దోహదం చేసే చిట్కాలపై కచ్చితంగా దృష్టి పెట్టాలి. అలాంటి వాటిలో ఎఫెక్టివ్‌గా ఉండేది హెయిర్ ట్రిమ్స్. దీని గురించి చాలామంది చెప్తూ ఉంటారు. రెగ్యులర్‌గా జుట్టు కత్తిరించుకుంటే.. ఫాస్ట్‌గా పెరుగుతుందని అంటారు. కానీ జుట్టు పెరిగేది కొనల నుంచి కాదు. కుదుళ్ల నుంచి. కానీ హెయిర్ కట్ చేయించుకోవడం వల్ల కలిగే లాభమేంటి? నిజంగానే హెయిర్ కట్ చేస్తే జుట్టు పెరుగుతుందా?
స్ప్లిట్ ఎండ్స్
జుట్టు కత్తిరించుకోవడం వల్ల పెరుగుదల వేగంగా ఉండదని అంటున్నారు హెయిర్ స్టైలిస్ట్‌లు. కానీ జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి మాత్రం చాలా హెల్ప్ చేస్తుందంటున్నారు. ఎందుకంటే హెయిర్ ట్రిమ్ చేయకపోతే.. చివర స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి. ఇవి జుట్టు చీలిపోవడానికి కారణమవుతాయి. దీనివల్ల ఎదుగుదల తగ్గిపోతుంది. జుట్టు పొడవు పెరగకపోగా.. బాగా డ్యామేజ్ అవుతుంది.
రెగ్యులర్‌గా జుట్టు ట్రిమ్ చేస్తుంటే.. జుట్టు హెల్తీగా ఉంటుంది. చివర్ల కూడా హెయిర్ స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల జుట్టు పెరుగుదలకు ఆస్కారం ఉంటుంది. దీనివల్ల జుట్టు దట్టంగా, బలంగా, పొడవుగా కనిపిస్తుంది. కాబట్టి హెల్తీ హెయిర్ కోసం రెగ్యులర్ ట్రిమ్స్ చాలా అవసరం. అయితే వీటివల్లే వేగంగా పెరుగుతుందా అంటే లేదు. మీ జుట్టు రకం, లైఫ్‌స్టైల్, తీసుకునే ఆహారం మీద డిపెండ్ అయి ఉంటుంది.
జుట్టు పెరుగుదల కోసం..
కుదుళ్ల నుంచి జుట్టుకు పోషణ ఇవ్వాలనుకుంటే.. మీరు సీరమ్, మసాజ్‌లు, శరీరానికి కావాల్సిన విటమిన్స్ (సప్లిమెంట్స్ లేదా ఫుడ్) తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి. వాటితో పాటు రెగ్యులర్ ట్రిమ్స్ చేయించడం వల్ల ఆరోగ్యంగా జుట్టు పెరుగుతూ ఉంటుందని బోర్డ్ సర్టిఫైడ్ కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ మిచెల్ గ్రీన్ తెలిపారు.
ట్రిమ్ ఎప్పుడు చేయాలి? ఎంత చేయాలి?
జుట్టు పెంచుకోవాలనుకునేవారు.. ప్రతి 8 నుంచి 12 వారాలకు ఓసారి ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది. స్పెషల్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే.. 6 నుంచి 8 వారాలకు ఒకసారి కట్ చేసుకోవాలి. బ్యాంగ్స్ ఉంటే 3 నుంచి 4 వారాలకు ఒకసారి ట్రిమ్ చేయాలి. కలర్, స్ట్రెయిటెనింగ్, డ్యామేజ్ ఉన్న జుట్టు అయితే.. ప్రోపర్ హెయిర్ కట్ చేయించుకోవడం మంచిది. దీనివల్ల డ్యామేజ్ హెయిర్ పోయి.. మంచి జుట్టు మీ సొంతమవుతుంది. అప్పుడు మీరు రెగ్యులర్ కేర్ తీసుకోవచ్చు.
హీట్ టూల్స్ ఎక్కువగా వాడకపోవడం, హీట్ ప్రొటెక్టెంట్ ఉపయోగించడం, డీప్ కండిషనింగ్ మాస్క్‌లు పెట్టడం వల్ల జుట్టు బలంగా మారుతుంది. అలాగే క్లీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే వ్యాయామం చేయడం, ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండడం వల్ల రక్తప్రసరణ మెరుగై.. జుట్టు బాగా ఎదుగుతుంది.






















