అన్వేషించండి

Hair fall: ఫోన్ చూస్తే జుట్టు రాలిపోతుందా? మీరూ ఇలా చేస్తుంటే జాగ్రత్త, షాకింగ్ విషయాలు చెప్పిన పరిశోధకులు

జుట్టు రాలిపోవటానికి అనేక కారణాలు ఉంటాయి. స్క్రీన్ టైం ఎక్కువగా ఉన్నవారికి జుట్టు రాలిపోయే ప్రమాదం కూడా ఎక్కువే అని అధ్యయనాలు చెప్తున్నాయి.

జుట్టు రాలిపోవటానికి అనేక కారణాలు ఉంటాయి. కొందరికి ఒత్తిడి వల్ల, కొందరిలో జెనెటిక్స్ వల్ల, కొందరికి రకరకాల ఆరోగ్య సమస్యల వల్ల సాధారణంగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. జుట్టు ఊడిపోతుందన్న బెంగతో గంటలు గంటలు ఫోన్లో రెమెడీస్ కోసం వెతుకుతున్నారా? అయితే అది కూడా జుట్టు ఊడిపోవటానికి ఇంకో కారణం కావొచ్చు, జాగ్రత్తా! ఆశ్చర్యపోతున్నారా? ఎక్కువ గంటలు ఫోన్లు వాడటం ఆరోగ్యానికి మంచిది కాదనే విషయం మనకు తెలిసిందే కానీ, కొత్తగా స్క్రీన్ టైం ఎక్కువగా ఉన్నవారికి జుట్టు రాలిపోయే ప్రమాదం కూడా ఎక్కువే అని అధ్యయనాలు చెప్తున్నాయి.

మీరు సినిమానో, యూట్యూబ్ విడియోనో చూస్తున్నపుడు కింద జుట్టు రాలిపడుతుందని చెప్పట్లేదుగానీ, స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ పరోక్షంగా జుట్టు రాలిపోవటానికి, అంతేగాక, రకరకాల ఆరోగ్య సమస్యలకూ ఇదే కారణమవుతోందని మనం గుర్తించాలి. బ్లూ లైట్ వల్లనె కాకుండా గంటలు గంటలు చెవి పక్కన ఫోన్ ఉంచి మాట్లాడేవారికి రేడియేషన్ వల్ల కూడా జుట్టు రాలిపోతుందని పరిశోధనలు చెప్తున్నాయి.

ఎక్కువగా ఫోన్లు, టీవీల నుంచి వచ్చే బ్లూ లైట్ ఏ విధంగా జుట్టు రాలిపోవటానికి కారణమవుతుందనే దాని మీద కావలిసినంత పరిశోధన జరగలేదు గానీ, జర్నల్ ఆఫ్ కాస్మెటాలజీ అండ్ ట్రైకాలజీ ప్రచురించిన అధ్యయనం ప్రకారం, చెవి పక్కన ఫోన్ పెట్టి గంటల తరబడి మాట్లాడేవారికి హెయిర్ ఫాల్ అవుతున్నట్టు గుర్తించారు. ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ చాలా ప్రమాదకరం. ఇదే జుట్టు రాలటానికి కూడా కారణమని పరిశోధకులు అంటున్నారు.

రేడియేషన్ సరే.. బ్లూ లైట్ వల్ల జుట్టు ఎలా రాలిపోతుంది?

ఒక్కసారి ఇన్స్టాగ్రాం ఓపెన్ చేసామంటే రీల్స్ చూస్తూ ఎన్ని గంటలు స్క్రోల్ చేస్తామో సమయం తెలియదు. నెట్ఫ్లిక్స్ లో ఏదైనా ఇంట్రెస్టింగ్ సీరీస్ వచ్చిందంటే రాత్రంతా కూర్చోని బింజ్ వాచ్ చేసే వాళ్లే ఎక్కువ. స్క్రీన్ టైం వల్ల ఇదే సమస్య. ఇదొక అడిక్షన్ లా మారుతోంది. చిన్న పెద్ద తేడా లేదు. అందరూ స్క్రీన్ లకు అతుక్కుపోతున్నారు. 

ఒక్కసారి ఇన్స్టాగ్రాం ఓపెన్ చేసామంటే రీల్స్ చూస్తూ ఎన్ని గంటలు స్క్రోల్ చేస్తామో సమయం తెలియదు. నెట్ఫ్లిక్స్ లో ఏదైనా ఇంట్రెస్టింగ్ సీరీస్ వచ్చిందంటే రాత్రంతా కూర్చోని బింజ్ వాచ్ చేసే వాళ్లే ఎక్కువ. స్క్రీన్ టైం వల్ల ఇదే సమస్య. ఇదొక అడిక్షన్ లా మారుతోంది. చిన్న పెద్ద తేడా లేదు. అందరూ స్క్రీన్ లకు అతుక్కుపోతున్నారు. స్క్రీన్ నుంచి వెలువడే బ్లూ లైట్ వల్ల నిద్రలేమి, స్ట్రెస్, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు కారణమవుతోంది. తద్వారా జుట్టు రాలిపోవటం ఒక్కటే కాదు. చర్మం కళ తప్పిపోతుంది. అధిక బరువు వంటి ఆరోగ్యసమస్యలూ వస్తాయి.

స్క్రీన్ నుంచి వెలువడే బ్లూ లైట్ నేచురల్ స్లీప్ హార్మోన్ అయిన మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీని వల్ల నిద్ర సమస్యలు వస్తాయి. ఇదే కాకుండా అధిక ఒత్తిడి ఎక్కువ మోతాదులో స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసోల్ విడుదలకు కారణమవుతుంది. ఈ హార్మోన్ హెయిర్ ఫాలికల్స్ గ్రోత్ ను తగ్గిస్తుంది. అందువల్ల ఒత్తిడి తగ్గించుకోకపోతే కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. 

Also Read : ఐపీఎల్ సీజన్ 2024 స్టార్ట్ అవుతోంది.. ఇలా బెట్టింగ్ వేస్తే మోసపోతారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget