అన్వేషించండి

Worms in stomach: వామ్మో, అతడి కడుపు నిండా గుట్టల గుట్టలు పాములు - ఎలా బయటకు తీశారో చూడండి

కడుపులో పాములు లేదా నులు పురుగులు పెరుగుతాయని మన పెద్దలు చెబుతుంటారు. కానీ, ఈ స్థాయిలో.. ఇంత పెద్ద పెద్ద పాములు కడుపులో ఉంటాయని ఊహించగలమా? అయితే, మీరు ఈ వీడియో చూడాల్సిందే.

మీకు పాములంటే భయమా? అయితే, ముందే చెబుతున్నాం. తప్పకుండా మీరు చూడబోయే వీడియో మీకు నిద్రలేకుండా చేస్తుంది. అంతేకాదు.. ఏం తింటున్నా అదే గుర్తుకొస్తుంది. పర్వాలేదు.. మాకు గుండె ధైర్యం టన్నుల కొద్ది ఉందంటే మీ ఇష్టం. మళ్లీ చివర్లో చెప్పలేదు.. ముందే చెప్పాలి కదా అనే మీమ్స్, కామెంట్స్ చేస్తే కుదరదు. సరే.. ఇక అసలు విషయంలోకి వెళ్లిపోదాం. 

ఎక్కడ జరిగిందో.. ఎప్పుడు జరిగిందో తెలీదుగానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. అందులో ఓ వ్యక్తికి డాక్టర్లు ఆపరేషన్ చేస్తున్నారు. అతడి పేగులు బయటకు లాగి.. కత్తెరతో సున్నితంగా కట్ చేశారు. అంతే.. అతడి పేగుల నుంచి నూడుల్స్ లాంటివి ఏవో వచ్చాయ్ (అంటే చూడగానే అలాగే అనిపిస్తాయ్). కానీ, వాటిలో కొన్ని కదలడం చూస్తే.. అవి నూడుల్స్ కాదు.. పాముల్స్ అని తెలిసి కళ్లు బైర్లు కమ్ముతాయ్. కానీ, అన్ని పాములు కడుపులో ఉంచుకుని అతడు ఎలా బతికాడో.. పాపం ఎంత నరకం అనుభవించాడో అనే ఆలోచనలు కూడా మన బుర్రలో తిరుగుతాయ్. (ఈ పోస్ట్‌లో ఉన్నలింక్ క్లిక్ చేస్తే వీడియో ఓపెన్ అవుతుంది)

ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన శ్రీకాంత్ మిరియాలా అనే మానసిక వైద్యుడు.. అవి పాములేనని పేర్కొన్నారు. అయితే, ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం గందరగోళంగానే ఉంది. వాస్తవానికి కడుపులో పాములు పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిని మనం పాములు అని సింపుల్‌గా అంటాం గానీ.. వైద్య పరిభాషలో వాటిని అస్కారిస్ లుంబ్రికోయిడ్స్ అని అంటారు. మన పెద్దలు వాటిని నులు పురుగులు అనేవారు. అయితే, వాటి సైజు.. పై వీడియోలో చూపించినంత ఉండవు. చాలా చిన్నవిగా కంటికి కనిపించనంతగా ఉంటాయి. అవి పెరిగినప్పుడు మలద్వారం దగ్గర విపరీతమైన దురద పెడుతుంది. ఎక్కువ శాతం పురుగులు మల విసర్జనతో బయటకు పోతాయి. ఈ అస్కారియాసిస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే.. ఈ కింది లింక్ క్లిక్ చేయండి.

పూర్తి వివరాలకు ఇది చదవండి: కడుపులోనే పెరిగే పాములతో జాగ్రత్త.. ఏటా పెరుగుతున్న మృతుల సంఖ్య, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

ఏంటీ ఈ పురుగులు? ఎలా చేరుతాయి?

అస్కారిస్ లుంబ్రికోయిడ్స్ (Ascaris lumbricoides) ఆ స్థాయిలో కడుపులో కాపురం చేయడం అనేది చాలా చాలా అరుదు. ఇది ఒక పరాన్న జీవి. అనేక రకాలుగా ఇది మన శరీరంలోకి చేరుతుంది. ముఖ్యంగా పరిశుభ్రంగా లేనప్పుడు. ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి.. దీని ముప్పు మరింత ఎక్కువగా ఉండవచ్చు. బయట పానీపూరీలు, సరిగ్గా కడగని వెజిటేబుల్ సలాడ్స్, పండ్లు తిన్నా సరే ఇవి కడుపులోకి చేరే ప్రమాదం ఉంది. అలాగే, తీపి పదార్థాలు అతిగా తిన్నా నులు పురుగులు పెరుగుతాయని చెబుతుంటారు. కర్ణుడి చావుకు అనేక కారణాలు అన్నట్లుగా.. ఈ పురుగులు కడుపులోకి చేరడానికి కూడా అనేక మార్గాలున్నాయి. ముఖ్యంగా మీ పిల్లలు ఎక్కువగా బురదలో ఆడతున్నట్లయితే.. ఒక కన్నేసి ఉంచండి. 

బహిరంగ మల విసర్జనతోనే ముప్పు

ఇకపై.. ఎప్పుడూ బాగా ఉడికించిన, తాజా ఆహారాన్ని తినండి. లేకపోతే.. మీ కడుపు కూడా ఇలా పాముల పుట్టలా మారిపోతుంది. ఇప్పటికే ప్రపంచంలో 1.2 బిలియన్ మంది ఈ రకం నులుపురుగుల సమస్యతో బాధపడుతున్నారట. 60 వేల మందికి పైగా చనిపోతున్నారట. ఇవి నోటి ద్వారా మాత్రమే వెళ్తాయని అనుకుంటే పొరపాటే. ముఖ్యంగా పై వీడియోలో చూపించిన పురుగులు.. మల ద్వారం గుండా లోపలికి వెళ్తాయి. మీరు బహిరంగ మలవిసర్జన అలవాటు ఉంటే.. ఎక్కువ ముప్పు ఉంటుంది. ఇవి ఎక్కువగా మొక్కల ఆకులపై నివసిస్తుంటాయి.

మల విసర్జన చేసేప్పుడు.. అవి ఆ మార్గం ద్వారా లోపలికి చేరే అవకాశం ఉంది. ఇవి ఒకరి నుంచి ఒకరికి ఈజీగా సోకుతాయి. ఈ సమస్య ఉన్న వ్యక్తి విసర్జించిన చోటే.. మరొకరు కూర్చున్నట్లయితే ఈ పాములు వెనుక నుంచి లోపలికి వెళ్లిపోతాయట. ఈ వీడియో షేర్ చేసిన డాక్టర్ బాబు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కానీ, క్లారిటీ లోపించింది. అందుకే, ఇంతగా వివరించాం. కడుపు నొప్పి, వికారం, వాంతులు, ఉబ్బరం, అతిసారం వంటి సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. ఈ ఆర్టికల్ చూసి.. నా కడుపులో పాములు ఉన్నాయేమో చూడండి డాక్టర్ అనొద్దు. ఉన్నాయో లేదో డాక్టరే చూసి చెబుతారు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget