(Source: ECI/ABP News/ABP Majha)
Ascaris Lumbricoides Causes : కడుపులోనే పెరిగే పాములతో జాగ్రత్త.. ఏటా పెరుగుతున్న మృతుల సంఖ్య, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Ascaris Lumbricoides Causes : చిన్నపిల్లలకు ఎక్కువగా కడుపులో నులిపురుగులు పెరుగుతాయి. అలాగే.. అస్కారియాసిస్ అనే పాములు చిన్నా, పెద్ద వయసు తేడా లేకుండా అందరినీ ఇబ్బంది పెడతాయి. కారణాలు ఏమంటే..
Ascariasis Lumbricoides Precutions : అస్కారియాసిస్ అనేవి కడుపులో పెరిగే పాములు. ఇవి వివిధ కారణాలవల్ల కలుగుతాయి. తకానీ ఇవి శరీరంలో వివిధ ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. పిల్లల నుంచి పెద్దలవరకు దీనివల్ల ఇబ్బంది ఎదుర్కొంటారు. ముఖ్యంగా పది సంవత్సరాలకంటే తక్కువ వయసున్న వారిపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అసలు ఈ పాములు ఎలా శరీరంలోకి వస్తాయి? దీనివల్ల కలిగే సమస్యలు ఏమిటి? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఏటా అరవై వేలమంది చనిపోతున్నారట..
అస్కారియాసిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా మరణభయం కలిగిస్తున్న అంటువ్యాధులలో ఇది కూడా ఒకటి. ప్రపంచంలోని మానవ జనాభాలో ఇది 25 శాతం మందిని ప్రభావితం చేసినట్లు గుర్తించారు. ఏటా దీనివల్ల 60,000 మంది చనిపోతున్నారని నిపుణులు తెలిపారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం లేని ప్రాంతాల్లో ఇది సోకి.. తీవ్ర అనారోగ్యాలకు గురి చేసి.. కొన్ని సందర్భాల్లో మరణానికి దారితీస్తుంది. అందుకే ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్య సమస్యగా మారింది. అస్కారియాసిస్ అనేవి పురుగుల గుబ్బల నుంచి ఏర్పడుతాయి. ఇది పేగు ల్యూమన్ పాక్షిక లేదా పూర్తి అవరోధానికి కారణమవుతాయి.
ఆలస్యం చేస్తే ప్రాణాంతకమే..
ఈ పాములు లేదా పురుగులు పేషెంట్ శరీరంలో బాగా పెరిగి.. పేగులకు అడ్డంపడిపోతాయి. ఆ పరిస్థితుల్లో ఆపరేషన్ చేసి.. వాటిని తీయాల్సి వస్తుంది. ఏమాత్రం ఆలస్యం చేసినా.. అది ప్రాణాంతకమవుతుంది. ఈ నేపథ్యంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వీటిపై అవగాహన కల్పిస్తున్నారు. పేగులకు అవి అడ్డుపడినా.. పలు చికిత్సలతో వాటిని నయం చేయవచ్చు. కొన్ని పరిస్థితుల్లో సర్జరీ లేదా.. ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.
ఒకరినుంచి ఒకరికి ఇలా వ్యాపిస్తాయి..
ఈ పాములు కలిగి ఉన్న వ్యక్తి బహిరంగ మలవిసర్జన చేస్తే.. ఈ పాములు మలం ద్వారా నేలలోకి చేరుతాయి. వాటి గుడ్లు కూడా నేలలోకి వెళ్తాయి. ఆ ప్రాంతంలో పెరిగే మొక్కలకి ఇవి అంటుకుపోతాయి. వాటి శుభ్రంగా కడగకుండా.. తినేవాళ్ల కడుపులోకి చేరి.. పెరుగుతాయి. ఇదే కాకుండా.. గుడ్లతో కలుషితమైన నీరు తాగడం వల్ల కూడా ఇవి మరొకవ్యక్తికి చేరుతాయి.
కారణాలు ఇవే.. (Ascariasis Causes)
కలుషితమైన మట్టిని తీసుకోవడం, పరిశుభ్రత, పారిశుద్ధ్యం లేని ప్రాంతాల్లో ఉండడం.. ఆహారాలు తీసుకోవడం ఈ పాములను శరీరంలోకి చేర్చుతుంది. ఈ గుడ్లతో ప్రభావితమైన పందిని, కోడి కాలేయాన్ని తినడం వల్ల కూడా అస్కారియాసిస్ వచ్చే ప్రమాదముంది. కలుషితమైన నేలలో పండించే పండ్లు, కూరగాయలు శుభ్రం చేయకుండా తినడం, సరిగ్గా ఉడికించకుండా తింటే.. కడుపులో పాములు పెరుగుతాయి. మానవ మలాన్ని ఎరువుగా ఉపయోగించే ప్రాంతాల్లో ఈ తరహా సమస్య వచ్చే ఆస్కారముంది. మురికిలో ఆడుకుని.. చేతులు కడగకుండా నోటిలో పెట్టుకుంటే కూడా ఇది వచ్చే అవకాశముంది.
రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Ascariasis Prevention)
మంచి పరిశుభ్రత పాటించాలి. భోజనం చేసే ముందు చేతులను సబ్బు లేదా లిక్విడ్తో కడుక్కోవాలి. తాజా పండ్లు, కూరగాయలను బాగా కడిగి తినాలి. జర్నీ చేసేటప్పుడు వాటర్ కచ్చితంగా తీసుకెళ్లాలి. అశుభ్రంగా ఉండే నీటికి దూరంగా ఉండాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తాగాల్సి వస్తే వేడి నీటిని తాగండి. బాగా ఉడికించిన ఆహారం తీసుకోవాలి. ఈ సమస్యపై ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పించాలి.
Also Read : వర్షాకాలంలో ఇమ్యూనిటీని ఇలా పెంచుకోండి.. ఆ ఫుడ్స్కి వీలైనంత దూరంగా ఉండాలట