అన్వేషించండి

Earwax : చెవిలో గులిమిని క్లీన్ చేయకపోతే ప్రమాదమా? మీరు ఇలా చేస్తుంటే జాగ్రత్త!

Earwax : చెవిలో గులిమిని తొలగించేందుకు చెవిలో పిన్నులు, పుల్లలు, ఆఖరికి స్క్రూలు, మేకులు కూడా పెట్టేస్తుంటారు. కానీ చెవిలో గులిమిని శుభ్రం చేయడంపై డాక్టర్లు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

Earwax : చెవిలో గులిమి చాలా చికాకు పెడుతుంది. ఒక్కోసారి చెవి రంధ్రం మూసుకుపోయేలా చేసి వినికిడి సైతం కోల్పోయేలా చేస్తుంది. అయితే చెవిలో గులిమిని ఇష్టం వచ్చినట్లు శుభ్రం చేసుకోవద్దని, ఇలా చేస్తే వినికిడి కోల్పోయే ప్రమాదం ఉందని ఈఎన్టి నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి చెవిలో గులిమి అందరికీ చెవిలోపల ఏర్పడే ఒక జిగురు పదార్థం. చెవి లోపల కెరాటిన్ అనే ప్రోటీన్‌ చర్మంపై మృత కణాలు, కొవ్వు, కొలెస్ట్రాల్‌, సీక్వాలిన్ అనే వ్యర్థ పదార్థాలూ కలిసి చిక్కటి ముద్దలాంటి గులిమిలా తయారవుతాయి. అయితే చాలా మంది గులిమి చాలా ప్రమాదమని అపోహ పడుతుంటారు. కానీ నిజానికి చెవిలో గులిమి మనకు రక్షణగా పనిచేస్తుంది. 

చెవిలో గులిమి.. కర్ణభేరి దగ్గరికి వ్యర్ధపదార్థాలు వెళ్లకుండా దుమ్ము ధూళి వెళ్ళకుండా పురుగులు వంటివి చొరబడకుండా అడ్డుకుంటాయి తద్వారా మన వినికిడి శక్తి  దెబ్బతినకుండా ఉంటుంది. ఒకవేళ చెవిలో గులిమిని ఎక్కువగా తొలగించినట్లయితే చెవిలోపల బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉందని కూడా డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చెవిలో గులిమి ఉండటం వల్ల మేలు జరుగుతుందని, చెవిలో గులిమి ప్రమాదకరం అనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని ఈఎన్టీ నిపుణులు తెలుపుతున్నారు. అయితే చెవిలో గులిమి ఒక్కోసారి ఎక్కువగా పేరుకుపోయినప్పుడు వినికిడి లోపం కూడా వచ్చే అవకాశం ఉందని, అలాంటి సమయంలో గులిమిని తొలగించేందుకు వైద్య నిపుణుల సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు. కానీ కొంతమంది తమ సొంత వైద్యంతో చెవిలో గులిమిని తొలగించాలని ప్రయత్నం చేస్తుంటారు కానీ అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

చెవిలో గొలిమిని తొలగించుకునేందుకు కొందరు వెల్లుల్లిపాయను చెవిలో పెట్టుకుంటారు అయితే ఇలా చేయడం చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి చెవిలో గులిమి అనేది కొందరికి గట్టిగా జిగురులాంటి పదార్థం లాగా ఏర్పడుతుందని మరికొందరికి పొడి రూపంలో ఏర్పడుతుందని సూచిస్తున్నారు. అయితే దీనికి కారణం వంశపారంపర్యంగా వచ్చే లక్షణమని తెలుపుతున్నారు. దీనిపై పలు పరిశోధనలు సైతం జరిగాయి ఆఫ్రికన్, యూరోపియన్ ప్రజల్లో చెవిలో గులిమి జిగురులా ఏర్పడుతుందని, అదే తూర్పు ఆసియా దేశాల్లో ప్రజలకు చెవిలో కొలిమి పొడి రూపంలో ఏర్పడుతుందని పరిశోధనలు తేల్చాయి.

చెవిలో గులిమిని తొలగించుకునేందుకు సురక్షితమైన పద్ధతి:

సాధారణంగా చెవిలో గులిమిని తొలగించే ప్రక్రియ సహజంగానే మన చెవి లోపల ఉన్న నిర్మాణమే చూసుకుంటుంది. చెవిలో గులిమి పేరుకోగానే ఉండలుగా మారి అది బయటకు వచ్చేస్తుంది. అందుకే చెవిలోపల గులిమిని తొలగించుకునేందుకు వీలైనంత వరకూ మానవ ప్రయత్నానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 

చెవిలో గులిమిని శుభ్రం చేయడానికి, బయటకు వచ్చిన మైనం తొలగించడం కోసం చెవి బయట భాగంలో కాటన్ లేదా తడి వాష్‌క్లాత్‌ ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇయర్ కెనాల్ లోకి ఏది చొప్పించవద్దని సూచిస్తున్నారు. అయితే చెవి లోపల నొప్పి, తల తిరగడం, వినికిడి లోపం ఉన్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని, చెవిలో గులిమి తీసే ప్రయత్నం చేయవద్దని, అలా చేస్తే మరింత దెబ్బ తినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read : పాలపొడితో పిల్లలకు నచ్చేలా ఇలా బర్ఫీ చేయండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Vijay Deverakonda: వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
Tummala Nageswararao: తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
Sai Durga Tej : 'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Embed widget