అన్వేషించండి

Fruits Side Effects: పండ్లు తినేప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పులు చేయొద్దు - ఎందుకంటే..

Fruits: పండ్లు తినడం కూడా ఒక కళ. పండ్లు తినేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేయకూడదు. చాలా మందికి పండ్లు తినేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలియవు. తద్వారా ఆరోగ్యపరంగా నష్టపోతారు.

Fruits health benefits: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొన్నిపండ్లలో పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కొన్నిట్లో పోషకాలు లేకున్నా టేస్టీగా ఉంటాయి. అరటి, మామిడి, బొప్పాయి, పైనాపిల్ వంటి పండ్లలో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. అయితే, పండ్లు తినడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందట. అదేంటీ అని ఆశ్చర్యపోతున్నారా? అవునండి. పండ్లను సరైన విధానాల్లో తినకపోతే తిప్పలు తప్పవట. ఇంతకీ ఆ విధానాలేమిటీ? పండ్లు తినేప్పుడు మనం తరచు చేసే తప్పులేంటో తెలుసుకుందాం.

భోజనం తర్వాత పండ్లు తినొద్దు

పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే. అయినప్పటికీ భోజనం చేసిన వెంటనే పండ్లను తినకూడదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే భోజనం తర్వాత పండ్లు తింటే జీర్ణసంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. భోజనం కాగానే పండ్లు తింటే అందులోని ఎంజైమ్స్ విచ్చిన్నమై ఆహారంతో కలిసిపోతాయి. దీంతో పొట్టలో సమస్యలు వస్తాయి. దీని వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే పండ్లకు త్వరగా జీర్ణమయ్యే గుణం ఉంటుంది. ఇతర పదార్థాలతో కలిపి తిన్నప్పుడు మాత్రం జీర్ణవ్యవస్థ నెమ్మదిగా మారుతుంది. పొట్టలో అసౌకర్యం మొదలవుతుంది. అందుకే పండ్లను విడిగా తీసుకోవాలి. రాత్రిపూట నిద్రకు రెండు లేదా మూడు గంటల ముందు నుంచీ పండ్లు తినకూడదు. పొట్టనిండా పండ్లు తిని నిద్రిస్తే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.

అన్ని రకాల పండ్లు కలిపి తినొద్దు

ఇక చాలా మంది పండ్లు ఆరోగ్యానికి మంచివని ...అన్ని రకాలు కలిపి తింటుంటారు. దాని వల్ల మీ కడుపు ఓవర్ లోడ్ అవుతుంది. ఫలితంగా కడుపులో సమస్యలు వస్తాయి. మీరు ఏవైనా పండ్లు తింటుంటే 1 లేదా 2 పండ్ల కలిపి మాత్రమే తినండి. పండ్లు త్వరగా జీర్ణం అవుతాయి. కాబట్టి, పండును పండుగానే తినండి. చాలా మంది జ్యూస్ రూపంలో తీసుకుంటారు. పండుగా తింటేనే పోషకాలన్నీ లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

ఏ సమయంలో పండ్లు తింటే మంచిది?

పండ్లను ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్య తినడం మంచిది. ఎందుకంటే పండ్లు త్వరగా అరుగుతాయి. వీటిలో చక్కెర ఎక్కువ శాతం ఉంటుంది. పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మనం నిద్రిస్తున్న సమయంలో శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. రక్తసరఫరాలో మార్పులు ఉంటాయి. ఆ సమయంలో శరీరం అన్ని పోషకాలను గ్రహించలేదు. ఫలితంగా ఎసిడిటీ పెరుగుతుంది. కాబట్టి పండ్లను మధ్యాహ్నం తినడం మంచిది. 

పండ్లు తిన్నాక నీళ్లు తాగొద్దు

మనలో చాలా మంది పండ్లను తినగానే నీళ్లు తాగుతుంటారు. పుచ్చకాయ, ఖర్జూర, దోస, నారింజ, స్ట్రాబెర్రీలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తిన్న వెంటనే నీళ్లు తాగితే పీహెచ్ స్థాయిలో మార్పులు వస్తాయి. దీంతో డయేరియా లేదా కలరా సమస్యలు వస్తాయి. పండ్లు తిని తొక్క పారేసే అలవాటు చాలా మందిలో ఉంటుంది. ఇది అస్సలు మంచిది కాదు. వాటిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. యాపిల్ పండ్ల తొక్కలో ఫైబర్ విటమిన్ సి, విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. వీటిని తొక్కతోనే తినడం వల్ల పోషకాలన్నీ అందుతాయి. ఊబకాయం కూడా తగ్గుతుంది. క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చు. 

Also Read : చలికాలంలో సన్​షైన్​ విటమిన్ చాలా అవసరమట.. ఎందుకంటే..

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TSRTC సిబ్బందిపై వరుస దాడులతో సజ్జనార్ కీలక ప్రకటన - నిందితులకు జైలుశిక్ష, జరిమానా
TSRTC సిబ్బందిపై వరుస దాడులతో సజ్జనార్ కీలక ప్రకటన - నిందితులకు జైలుశిక్ష, జరిమానా
Fact Check : జగన్ మేనిపెస్టో ప్రకటన చూస్తున్న చంద్రబాబు ఫోటో వైరల్ - నిజమెంత ?
జగన్ మేనిపెస్టో ప్రకటన చూస్తున్న చంద్రబాబు ఫోటో వైరల్ - నిజమెంత ?
Ramayan Leaks: రణ్‌బీర్‌ 'రామాయణ్' సెట్‌‌ నుంచి ఫోటోలు లీక్‌ - సీతగా సాయి పల్లవి ఎంత అందంగా ఉందో చూశారా? 
రణ్‌బీర్‌ 'రామాయణ్' సెట్‌‌ నుంచి ఫోటోలు లీక్‌ - సీతగా సాయి పల్లవి ఎంత అందంగా ఉందో చూశారా? 
YS Jagan Bandage :  బ్యాండేజ్ తీసేసిన వైసీపీ అధినేత - చిన్న మచ్చ కూడా లేకపోవడంపై టీడీపీ సెటైర్లు
బ్యాండేజ్ తీసేసిన వైసీపీ అధినేత - చిన్న మచ్చ కూడా లేకపోవడంపై టీడీపీ సెటైర్లు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Avon Defence Systems | శంషాబాద్ లో ఉన్న ఈ ప్రైవేట్ డిఫెన్స్ స్టార్టప్ గురించి తెలుసా..? | ABP DesamYSRCP Manifesto | YS Jagan | సంక్షేమానికి సంస్కరణలకు మధ్య ఇరుక్కుపోయిన జగన్ | ABP DesamWarangal BRS MP Candidate Sudheer Kumar Interview | వరంగల్ ప్రజలు బీఆర్ఎస్ కే పట్టం కడతారు.! | ABPCM Jagan Announces YSRCP Manifesto 2024 | ఎన్నికల కోసం వైసీపీ మేనిఫెస్టోను ప్రకటించిన సీఎం జగన్ |ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TSRTC సిబ్బందిపై వరుస దాడులతో సజ్జనార్ కీలక ప్రకటన - నిందితులకు జైలుశిక్ష, జరిమానా
TSRTC సిబ్బందిపై వరుస దాడులతో సజ్జనార్ కీలక ప్రకటన - నిందితులకు జైలుశిక్ష, జరిమానా
Fact Check : జగన్ మేనిపెస్టో ప్రకటన చూస్తున్న చంద్రబాబు ఫోటో వైరల్ - నిజమెంత ?
జగన్ మేనిపెస్టో ప్రకటన చూస్తున్న చంద్రబాబు ఫోటో వైరల్ - నిజమెంత ?
Ramayan Leaks: రణ్‌బీర్‌ 'రామాయణ్' సెట్‌‌ నుంచి ఫోటోలు లీక్‌ - సీతగా సాయి పల్లవి ఎంత అందంగా ఉందో చూశారా? 
రణ్‌బీర్‌ 'రామాయణ్' సెట్‌‌ నుంచి ఫోటోలు లీక్‌ - సీతగా సాయి పల్లవి ఎంత అందంగా ఉందో చూశారా? 
YS Jagan Bandage :  బ్యాండేజ్ తీసేసిన వైసీపీ అధినేత - చిన్న మచ్చ కూడా లేకపోవడంపై టీడీపీ సెటైర్లు
బ్యాండేజ్ తీసేసిన వైసీపీ అధినేత - చిన్న మచ్చ కూడా లేకపోవడంపై టీడీపీ సెటైర్లు
BRS Foundation Day: అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Water Crisis: త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో నీటి కరవు, బెంగళూరు కన్నా దారుణ పరిస్థితులు తప్పవా?
Water Crisis: త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో నీటి కరవు, బెంగళూరు కన్నా దారుణ పరిస్థితులు తప్పవా?
Best Horror Movies on OTT: బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు
బొమ్మలో అమ్మను చూడాలనుకొనే చిన్నారి - ఆత్మలతో ఆట.. ఊహించని వేట, ఈ ఇండోనేషియన్ మూవీని అస్సలు మిస్ కావద్దు
IPL 2024: ఢిల్లీదే బ్యాటింగ్‌, బౌండరీల జాతరేనా?
ఢిల్లీదే బ్యాటింగ్‌, బౌండరీల జాతరేనా?
Embed widget