Diwali Sweet Recipe: నోట్లో కరిగిపోయేలా నేతి మైసూర్ పాక్,స్పాంజీ రసగుల్లా - దీపావళికి బెస్ట్ స్వీట్లు
Diwali Sweet Recipe: దీపావళినాడు బంధువులకు పంచేందుకు ఉత్తమ స్వీట్ నేతి మైసూర్ పాక్.
Diwali Sweet Recipe: దీపావళి వచ్చిందంటే అందరి నోళ్లు తీపి కావాల్సిందే. ఆ రోజు స్వీట్లు ఇచ్చిపుచ్చుకుంటూనే ఉంటారు. బంధువులకు, స్నేహితులకు స్వీటు బాక్సులు పంపిస్తారు. ఇంట్లో చేసిన స్వీట్ అయితే బంధం మరింత బలపడుతుంది. ఒకసారి ఇలా మైసూర్ పాక్ చేసి చూడండి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది.
కావాల్సిన పదార్థాలు
శెనగపిండి - ఒక కప్పు
పంచదార - ఒకటిన్నర కప్పు
నెయ్యి - ఒక కప్పు
నూనె - అర కప్పు
పాలు - అర కప్పు
కావాల్సిన పదార్థాలు
1. ముందుగా స్టవ్ మీద పెద్ద కళాయి పెట్టి అందులో చక్కెర, పాలు పోసి పాకం తీయాలి.
2. మరీ ముదురుపాకం తీయకూడదు.
3. ఇప్పుడు స్టవ్‌ను చిన్న మంట మీదకు మార్చాలి. అందులో సెనగ పిండి వేసి కలుపుతూ ఉండాలి.
4. ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి.
5. పిండి కాస్త చిక్కగా అయినప్పుడు అందులో నెయ్యి కొద్దికొద్దిగా పోస్టూ కలుపుకోవాలి.
6. అలాగే నూనె కూడా కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి.
7. మాడిపోకుండా ఉండాలంటే కలుపుతూనే ఉండాలి.
8. కోవాలా దగ్గరగా అయ్యాక స్టవ్ కట్టేయాలి.
9. ఇప్పుడు ఒక పళ్లానికి నెయ్యి రాసి, వేడిగా ఉన్నప్పుడే మొత్తం పిండిని పళ్లెంతో వేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
10. కాస్త వేడి తగ్గాక ఒక డబ్బాలో వేసుకుంటే పదిరోజుల పాటూ నిల్వ ఉంటాయి.
......................................................................................
స్పాంజి రసగుల్లా...
కావాల్సిన పదార్థాలు
పాలు - ఒక లీటరు
నిమ్మరసం - అరస్పూను
పంచదార - రెండు కప్పులు
నీళ్లు - ఒక లీటరు
యాలకుల పొడి -అరస్పూను
తయారీ ఇలా
1. ముందుగా పాలను మరగబెట్టాలి. మరిగాక నిమ్మరసం కలపాలి.
2. చిన్నమంట మీద పాలను మరిగిస్తే పాలు విరుగుతాయి.
3. ఒక వస్త్రంలో పాలను వడకట్టి, గట్టిగా మూటలా కట్టి కాసేపు ఉంచాలి.
4. నీరంతా పోయాక ఆ ముద్దని చేతులతో బాగా నొక్కి మెత్తటి పేస్టులా చేసుకోవాలి.
5. తరువాత గుండ్రని ఉండలుగా చుట్టుకోవాలి.
6. మరోపక్క రెండు కప్పు పంచదార, ఒక లీటరు నీళ్లు వేసి మరిగించాలి.
7. అందులో యాలకుల పొడి కలపాలి.
8. పంచదార కరిగి సలసల మరుగుతున్నప్పుడు అందులో ముందుగా చుట్టుకున్న ఉండలను వేసుకోవాలి.
9. పైన మూత పెట్టాలి. ఓ పది నిముషాల తరువాత మూత తీసేసి, స్టవ్ కట్టేయాలి.
10. నాలుగైదు గంటలు పక్కన వదిలేయాలి.
11. టేస్టీ స్పాంజిలాంటి రసగుల్లా తయారైనట్టే.
View this post on Instagram
Also read: ఈ ఆహారాలు డేంజర్, శరీరంలో సీక్రెట్‌గా కొలెస్ట్రాల్ పెంచేస్తాయి