అన్వేషించండి

Diabetes: డయాబెటిక్ రోగులు వానాకాలంలో మీ పాదాలను ఇలా కాపాడుకోండి

వానాకాలం వచ్చిందంటే మధుమేహ రోగులకు ఎంతో ఇబ్బంది మొదలవుతుంది.

డయాబెటిక్ రోగులు ఆహారం విషయంలోనే కాదు, మరెన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పాదాలను కాపాడుకోవాలి. డయాబెటిక్ ఉన్న వారిలో పాదాల సమస్యలు త్వరగా వస్తాయి. డయాబెటిక్ ఫుట్ కేర్ అనేది వర్షాకాలంలో చాలా ముఖ్యం. మధుమేహ వ్యాధిగ్రస్తులు తడిగా ఉండే ప్రదేశాలలో తిరగడం వల్ల, తేమతో కూడిన వాతావరణంలో ఉండడం వల్ల పాదాలకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల పాదాల్లోని నరాలు దెబ్బతింటాయి. పాదాలకు ఏదైనా దెబ్బలు తాకినా అవి త్వరగా నయంకాక ఇన్ఫెక్షన్ల బారిన పడి పాదాలు తొలగించుకునే పరిస్థితి కూడా వస్తుంది. అందుకే డయాబెటిక్ రోగులు కచ్చితంగా పాదాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా వానాకాలంలో వారు తడి ప్రదేశాలలో తిరగకూడదు.

డయాబెటిక్ రోగులు పాదాలను కాపాడుకునేందుకు వాటికి రక్షణగా బూట్లను ఉపయోగించాలి. అలాగే సరిగ్గా సరిపోయే బూట్లనే ధరించాలి. ముఖ్యంగా బొటనవేలు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే బొటనవేలుకే ఎక్కువగా బూట్లలో ఇరుక్కుని గాయాలు అవుతాయి. అవి త్వరగా తగ్గకుండా ఇన్ఫెక్షన్ బారిన పడి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.

పాదాలపై గాయాలు, దెబ్బలు వంటివి రాకుండా జాగ్రత్త పడండి. పాదాలకు  నొప్పి లేదా గాయం తగిలినా వెంటనే వైద్యులను సంప్రదించండి. పాదాలు ఎప్పుడూ కూడా పొడిగా శుభ్రంగా ఉండేలా చూసుకోండి. తేమ లేకుండా జాగ్రత్త పడండి. మీ పాదాలను గోరువెచ్చటి నీటితో కడిగి వెంటనే తడిని తుడిచేసి మాయిశ్చరైజర్ ను అప్లై చేస్తూ ఉండండి.

వానాకాలంలో చెప్పులు లేకుండా నడవడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే నేలతడిగా ఉంటే పాదాలపై ఆ ప్రభావం పడుతుంది ముఖ్యంగా ఆ నీటిలో ఉండే బ్యాక్టీరియా పాదాలకు చేరుతుంది దీనివల్ల ఇన్ఫెక్షన్లు మొదలవొచ్చు

పాదాలకు సంబంధించిన వ్యాయామాలు చేయడం చాలా ముఖ్యం. డయాబెటిక్ రోగులు రోజూ పాదాలలో రక్తప్రసరణను పెంచేందుకు వ్యాయామాలు చేయాలి. పాదాలలో రక్తప్రసరణ పెరిగితే ఇన్ఫెక్షన్, పుండ్లు వంటివి రాకుండా ఉంటాయి. కాబట్టి నడక, సైక్లింగ్ వంటివి చేస్తూ ఉండాలి.

పాదాలలో తిమ్మిరి పెట్టడం, జలదిరింపు వంటివి రావడం ఎక్కువ కాకుండా చూసుకోండి. రక్తంలో చక్కెర స్థాయిలు అధికమైతే పాదాలకు తిమ్మిరి పట్టడం, జలదరింపులు రావడం జరుగుతాయి. కాబట్టి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా జాగ్రత్త పడండి. మధుమేహం ఉన్న రోగులలో 15 నుంచి 25 శాతం మంది ఇలా డయాబెటిక్ ఫుట్ అల్సర్ బారిన పడుతున్నారు. భారతదేశంలో ప్రతి ఏడాది లక్ష మంది డయాబెటిక్ రోగుల పాదాలను తొలగిస్తున్నట్టు అంచనా. అందుకే మధుమేహ  రోగులు పాదాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి.

Also read: చాక్లెట్ అతిగా తింటున్నారా? ఈ సైడ్ ఎఫెక్టులు రాక తప్పవు
 
Also read: ఈ ఉద్యోగాలు చేసే మహిళలు అండాశయ క్యాన్సర్ బారిన త్వరగా పడతారు
 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Embed widget