అన్వేషించండి

Bathing Tips: స్నానం చేసేటప్పుడు ఈ శరీర భాగాలు శుభ్రం చేసుకోవడం లేదా?

శరీరం అంతా శుభ్రంగా రుద్దుకుంటూ స్నానం చేయాలని లేదంటే ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉందని చర్మ వ్యాధి నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రోజుకు రెండు సార్లు స్నానం చేస్తే శరీరానికి, మనసుకి హాయిగా అనిపిస్తుంది. స్నానం చేసేటప్పుడు బాడీ అంతా శుభ్రంగా రుద్దుకుంటున్నామని అనుకుంటారు. కానీ శరీరంలోని మూడు ముఖ్యమైన భాగాలు మాత్రం సరిగా పట్టించుకోరని చర్మ వ్యాధి నిపుణులు చెప్తున్నారు. అందుకే ఆ పార్ట్స్ ఎక్కువగా ఇన్ఫెక్షన్ కి గురై చికిత్స తీసుకోవడానికి ఎక్కువ మంది తమదగ్గరకి వస్తున్నారని అంటున్నారు. మూడు శరీర భాగాలు శుభ్రం చేసుకునే విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల చర్మం పొరలుగా మారి ధూళి, బ్యాక్టీరియాయ పేరుకుపోయి ఇన్ఫెక్షన్ కి దారి తీస్తుంది. ఇంతకీ ఆ మూడు భాగాలు ఏమంటే..

చెవి వెనుక

చాలా మంది ఎదుర్కొనే సమస్య ఇది చెవి ఇన్ఫెక్షన్. స్నానం చేసే ముందు వేళ్ళు చెవి వెనుక పెట్టి శుభ్రం చేసుకోకపోవడం వల్ల మురికి పేరుకుపోతుంది. చెవి రంధ్రాలు కూడా దుర్వాసన వస్తూ ఉంటాయి. చెవుల వెనుక పొరలు, చుండ్రు ఏర్పడటం వంటి సమస్యలు వస్తాయని చర్మవ్యాధి నిపుణులు చెప్తున్నారు. అందుకే చెవిలో వేళ్ళు పెట్టి అన్నీ భాగాలు శుభ్రం చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

బొడ్డు

చెమట, ధూళి పేరుకుపోయే సాధారణ ప్రదేశం బొడ్డు. పొట్ట రుద్ధుకుంటున్నాం కదా ఇంక స్పెషల్ గా బొడ్డు క్లీనింగ్ ఏముంటుందని అనుకుంటారు. కానీ దీన్ని తగినంతగా శుభ్రం చేయకపోతే ధూళి, మురికి పేరుకుపోతుంది. నాభిలో ఒక రాయి మాదిరిగా ఏర్పడుతుంది. ఈ సమస్యని ఓంఫాలోలిత్ అని పిలుస్తారు. ధూళి, ఆయిల్, డెడ్ స్కిన్ సెల్స్ బొడ్డులో చిక్కుకుని గట్టిగా రాయిలాగా ఏర్పడుతుంది. ఇది ముదురు రంగులో ఉంటుంది. పట్టుకుంటే గట్టిగా అనిపిస్తుంది. పెద్ద బ్లాక్ హెడ్ ని పోలి ఉంటుంది. బొడ్డు లోపల క్రమం తప్పకుండా, పూర్తిగా శుభ్రం చేయకపోతే కొన్ని సార్లు మీకు తెలియకుండానే రాయి ఏర్పడుతుంది. అందుకే ఖచ్చితంగా వేలు పెట్టి నాభిని క్లీన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. స్నానం చేసిన తర్వాత కూడా టవల్ పెట్టి శుభ్రంగా తడి అనేది లేకుండా తుడుచుకోవాలి.

గోర్లు కింద

అమ్మాయిలు అయితే పార్లర్ కి వెళ్ళి పెడిక్యూర్, మానిక్యూర్ చేయించుకుంటారు. కానీ అది మాత్రమే కాదు స్నానం చేసేటప్పుడు గోర్లు కింద మురికిని వదిలించుకోవడం ముఖ్యం. గోర్లు కింద ధూళి పేరుకుపోతుంది. దాన్ని వదిలించుకోవడానికి క్యూటికల స్టిక్ లేదా క్లాత్ ఉపయోగించాలి. గోరు వెచ్చని నీటితో గోర్లు శుభ్రం చేసుకోవాలి. అప్పుడే చర్మం పొడిగా మారే అవకాశం తక్కువగా ఉంటుంది.

ఎన్ హెచ్ ఎస్ చెప్పిన దాని ప్రకారం చర్మంపై ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది. అది శరీరంలోపలికి వస్తే తీవ్రమైన ఇన్ఫెక్షన్ కి కారణమవుతుంది. చర్మం కింద మెథిసిలిన్-రెసిస్టెంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్ (MRSA) అనేవి చేరతాయి. ఇవి చర్మం లోపల ఇన్ఫెక్షన్ ని కలిగిస్తాయి. అవి చేరాయి అనేందుకు సంకేతాలు

⦿ నొప్పి, వాపు

⦿ ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతం తాకినప్పుడు వేడిగా అనిపిస్తుంది

⦿ చీము లేదా ద్రవం కారుతుంది

⦿ ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతం ఎర్రగా మారిపోతుంది

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: రాత్రివేళ అతిగా మూత్రవిసర్జనకి వెళ్తున్నారా? ఆ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget