అన్వేషించండి

Dengue Fever: ఆ దేశాన్ని అల్లాడిస్తున్న డెంగ్యూ, ఇండియాలోనూ అదే పరిస్థితి - ఈసారి మరింత డేంజర్, లక్షణాలు ఇవే

Dengue Fever: లాటిన్ అమెరికా ఇప్పటివరకు గతంలో ఎన్నడూ చూడని విధంగా అత్యంత ఘోరమైన డెంగ్యూ జ్వరం కేసులను ఎదుర్కొంటోంది.రికార్డు స్థాయిలో 4.1 మిలియన్ కేసులు నమోదయ్యాయి.

Dengue Fever: డెంగ్యూ.. బయటకు కనిపించకుండానే నిలువెత్తు మనిషిని కుంగదీసే భయానక వ్యాధి. వర్షాలు వస్తున్నాయంటే.. ప్రజల్లో భయాన్ని పుట్టించే ఈ మహమ్మారి ఇప్పుడు లాటిన్ అమెరికాను వణికిస్తోంది. ఈసారి మరింత ప్రమాదకరంగా మారిన డెంగ్యూ.. ఇండియాలో అలజడికి సిద్ధమైంది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఇప్పటికే కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి.. మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్తలు పాటించాలి. ఏ లక్షణాలు కనిపించినా డాక్టర్‌ను సంప్రదించాలి.

లాటిన్ అమెరికా ఇప్పటివరకు గతంలో ఎన్నడూ చూడని విధంగా అత్యంత ఘోరమైన డెంగ్యూ జ్వరం కేసులను ఎదుర్కొంటోంది. పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. 2024 మొదటి 4 నెలల్లో డెంగ్యూ కేసులు గత సంవత్సరం ఇదే సీజన్‌తో పోలిస్తే 238 శాతం పెరిగాయి. రికార్డు స్థాయిలో 4.1 మిలియన్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత కేసులు ఐదేళ్ల సగటు కంటే 400 శాతం ఎక్కువ. ఎల్‌నినో క్లయిమేట్ వల్ల తడి, వేడి, దోమలు వృద్ధి చెందడానికి, వైరస్ మరింత వ్యాప్తి చెందే పరిస్థితులను సృష్టించింది.

వాతావరణ మార్పు వల్ల దోమలతో వ్యాపించే రోగాలు పెరుగుతున్నాయి. డెంగ్యూ.. నాలుగు రకాల వైరస్‌ల వల్ల వచ్చే వైరల్ ఫీవర్. ఇది దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక ఉష్ణమండల ప్రాంతాలలో సాధారణంగా కనిపిస్తుంది. కానీ ఇతర వాతావరణ పరిస్థితులలో కూడా సంతానోత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. డెంగ్యూ జ్వరాన్ని మోసే దోమలు ఈడెస్ ఈజిప్టి రకానికి చెందినవి. ఈ దోమలు అమెరికాలోని దక్షిణ భాగాలలో పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి.

డెంగ్యూ లక్షణాలు:

అధిక జ్వరం:

డెంగ్యూ జ్వరం లక్షణాలలో ఒకటి అకస్మాత్తుగా అధిక జ్వరం రావడం కనిపిస్తుంది. సాధారణంగా ఇది 2 నుంచి 7 రోజుల వరకు ఉంటుంది. జ్వరం తరచుగా తీవ్రమైన చెమట, చలితో కూడి ఉంటుంది.

తీవ్రమైన తలనొప్పి:

డెంగ్యూ జ్వరం తరచుగా తీవ్రమైన తలనొప్పితో కూడి ఉంటుంది. ఇది బలహీనంగా మారుతుంది. 

కళ్ల నొప్పి:

డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న చాలా మంది వ్యక్తులు కళ్ల నొప్పిని అనుభవిస్తారు. దీనిని రెట్రో-ఆర్బిటల్ నొప్పి అంటారు. ఈ లక్షణం తరచుగా కంటి కదలికల ద్వారా తీవ్రమవుతుంది.

డెంగ్యూ జ్వరం తీవ్రమైన కండరాలు, కీళ్ల నొప్పులకు కారణమవుతుంది. దీనిని బ్రేక్‌బోన్ ఫీవర్ అని అంటారు.

మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడానికి చిట్కాలు:

మస్కిటో రెపెల్లెంట్స్ వాడండి:

డెంగ్యూ జ్వరాన్ని నివారించడానికి అత్యంత సులభమైన మార్గం మస్కిటో రెపెల్లెంట్స్ ఉపయోగించడమే అని నిపుణులు చెబుతున్నారు. మస్కిటో రెపెల్లెంట్స్ క్రీములు రోజుకు 3 సార్లు కంటే ఎక్కువ వాడకూడదు, సాధారణంగా బ్రాండ్‌ను బట్టి వీటి రక్షణ వ్యవధి మారుతుంది.

ఫుల్ స్లీవ్ బట్టలు ధరించండి:

మిమ్మల్ని పూర్తిగా కప్పి ఉంచే పూర్తి దుస్తులను ధరించండి. చెప్పులకు బదులుగా పొడవాటి చేతుల చొక్కాలు, పొడవాటి ప్యాంటు, షూస్ ధరించండి.

కిటికీలు, తలుపులు మూసి ఉంచండి:

డెంగ్యూ వైరస్‌లను మోసే దోమలు తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు చాలా చురుకుగా ఉంటాయి. ఈ వేళల్లో కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి.

పరిసరాలను శుభ్రంగా ఉంచండి:

డస్ట్‌బిన్‌లను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. దోమలను నివారించేందుకు పరిసరాల్లో మురుగు నీరు లేకుండా చూసుకోవాలి. నీరు నిలువ ఉన్నా సరే.. డెంగ్యూ దోమలు పెరిగిపోతాయి. కాబట్టి, టైర్లు, కొబ్బరి చిప్పలు, ఖాళీ డబ్బాలు తదితరాల్లో నీరు నిలువ లేకుండా చూసుకోండి.

ఇది కూడా చదవండి: మగాళ్లూ.. ఈ వయస్సు దాటితే ఆ సామర్థ్యం మటాష్ - పిల్లలను కనాలంటే ఇదే కరెక్ట్ ఏజ్, ఇలా ప్లాన్ చేసుకోండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayawada News: అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ - నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్న విజయవాడ డీఆర్ఎం
అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ - నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్న విజయవాడ డీఆర్ఎం
Manchu Fight: కలెక్టర్ ముందు ఘర్షణ పడ్డ మోహన్ బాబు, మనోజ్ - ఆస్తులపై తేలని పంచాయతీ !
కలెక్టర్ ముందు ఘర్షణ పడ్డ మోహన్ బాబు, మనోజ్ - ఆస్తులపై తేలని పంచాయతీ !
Jagan disqualification: అసెంబ్లీకి హాజరు కాకపోతే జగన్‌పై అనర్హతా వేటు - పులివెందులకు ఉపఎన్నికలు !
అసెంబ్లీకి హాజరు కాకపోతే జగన్‌పై అనర్హతా వేటు - పులివెందులకు ఉపఎన్నికలు !
Battula Prabhakar: రూ.3 కోట్లు, 100 మంది అమ్మాయిలను ట్రాప్ చేయడమే టార్గెట్ - టాటూ ఆధారంగా ట్రేస్, వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో సంచలన విషయాలు
రూ.3 కోట్లు, 100 మంది అమ్మాయిలను ట్రాప్ చేయడమే టార్గెట్ - టాటూ ఆధారంగా ట్రేస్, వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో సంచలన విషయాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TDP Won Hindupur Municipality | టీడీపీ కైవసమైన హిందూపూర్ మున్సిపాలిటీ | ABP DesamJC Prabhakar reddy vs Kethireddy peddareddy | తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం | ABP DesamTirupati Deputy Mayor Election | తిరుపతి పీఠం కోసం కూటమి, వైసీపీ బాహా బాహీ | ABP DesamPrabhas Look From Kannappa | కన్నప్ప సినిమా నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada News: అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ - నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్న విజయవాడ డీఆర్ఎం
అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ - నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్న విజయవాడ డీఆర్ఎం
Manchu Fight: కలెక్టర్ ముందు ఘర్షణ పడ్డ మోహన్ బాబు, మనోజ్ - ఆస్తులపై తేలని పంచాయతీ !
కలెక్టర్ ముందు ఘర్షణ పడ్డ మోహన్ బాబు, మనోజ్ - ఆస్తులపై తేలని పంచాయతీ !
Jagan disqualification: అసెంబ్లీకి హాజరు కాకపోతే జగన్‌పై అనర్హతా వేటు - పులివెందులకు ఉపఎన్నికలు !
అసెంబ్లీకి హాజరు కాకపోతే జగన్‌పై అనర్హతా వేటు - పులివెందులకు ఉపఎన్నికలు !
Battula Prabhakar: రూ.3 కోట్లు, 100 మంది అమ్మాయిలను ట్రాప్ చేయడమే టార్గెట్ - టాటూ ఆధారంగా ట్రేస్, వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో సంచలన విషయాలు
రూ.3 కోట్లు, 100 మంది అమ్మాయిలను ట్రాప్ చేయడమే టార్గెట్ - టాటూ ఆధారంగా ట్రేస్, వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో సంచలన విషయాలు
Next on Netflix: కీర్తి సురేష్ అక్క, ఆర్యన్ ఖాన్ డైరక్షన్, రానా నాయుడు ఎంట్రీ... కొత్త సిరీస్‌లతో దుమ్ము రేపనున్న నెట్‌ఫ్లిక్స్
కీర్తి సురేష్ అక్క, ఆర్యన్ ఖాన్ డైరక్షన్, రానా నాయుడు ఎంట్రీ... కొత్త సిరీస్‌లతో దుమ్ము రేపనున్న నెట్‌ఫ్లిక్స్
AP News: ఏపీ ప్రభుత్వానికిి అంబులెన్సులు అందించిన నటుడు సోనూసూద్ - అభినందించిన సీఎం చంద్రబాబు
ఏపీ ప్రభుత్వానికిి అంబులెన్సులు అందించిన నటుడు సోనూసూద్ - అభినందించిన సీఎం చంద్రబాబు
Hero Nikhil private videos: హీరో నిఖిల్‌కు షాక్ - ప్రైవేటు వీడియోలతో మస్తాన్ సాయి బ్లాక్‌మెయిల్‌ - పోలీసులకు పట్టించిన లావణ్య !
హీరో నిఖిల్‌కు షాక్ - ప్రైవేటు వీడియోలతో మస్తాన్ సాయి బ్లాక్‌మెయిల్‌ - పోలీసులకు పట్టించిన లావణ్య !
BPL Crisis: బీపీఎల్ లో సంక్షోభం.. జీతం ఇవ్వకపోవడంతో ప్లేయర్ల కిట్లను లాక్కున్న బస్ డ్రైవర్.. ఆటగాళ్ల బాయ్ కాట్..
బీపీఎల్ లో సంక్షోభం.. జీతం ఇవ్వకపోవడంతో ప్లేయర్ల కిట్లను లాక్కున్న బస్ డ్రైవర్.. ఆటగాళ్ల బాయ్ కాట్..
Embed widget