అన్వేషించండి

Men fertility : మగాళ్లూ.. ఈ వయస్సు దాటితే ఆ సామర్థ్యం మటాష్ - పిల్లలను కనాలంటే ఇదే కరెక్ట్ ఏజ్, ఇలా ప్లాన్ చేసుకోండి

Men fertility : మగవారు తండ్రి కావడానికి అత్యంత అనుకూలమైన కాలం 20 ఏళ్లు నుంచి 30 ఏళ్ల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వయస్సుతోపాటు ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత పురుషుల సంతానోత్పత్తి తగ్గుతుంది.

Men fertility : సంతానోత్పత్తిపై వయస్సు వల్ల కలిగే సమస్యలు, ప్రభావాలను తగ్గించడానికి స్త్రీలు, పురుషులు ఇద్దరు ఒక నిర్దిష్ట వయస్సు కంటే ముందే పిల్లలను కనాలి. ఇది తెలివైన పని. ఎందుకంటే పరిమిత సంఖ్యలో అండాలతో జన్మించిన స్త్రీల వలే కాకుండా.. పురుషులు ప్రతిరోజూ కొత్త స్మెర్మ్ ను ఉత్పత్తి చేస్తారు. వృషణాలు ప్రతిరోజూ 100 నుంచి 200 మిలియన్ల వరకు తాజా స్పెర్మ్ ఉత్పత్తి చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంటే పురుషుల వయస్సు పెరిగే కొద్దీ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయే ప్రమాదం తక్కువే. కానీ.. పర్యావరణం, జీవనశైలి మార్పులు, అనారోగ్యాలు వంటివి పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ఆరోగ్య సమస్యలు కూడా స్పెర్మ్ ఉత్పత్తికి లేదా స్ఖలనం ప్రక్రియకు అడ్డంకిగా మారుతాయి. వీటిలో ఎపిడిడైమిటిస్ వంటి అంటువ్యాధులు, వేరికోసెల్ వంటి శరీర నిర్మాణ సమస్యలు, స్పెర్మ్ విడుదల చేయడంలో సమస్యలను కలిగిస్తాయి. పురుష పునరుత్పత్తి అవయవాలు అసాధారణ అభివృద్ధికి  కారణమయ్యే క్రోమోజోమ్ లోపాలు, అంగస్తంభన, అకాల స్కలనం లేదా ఇబ్బందికరమైన సంభోగం వంటి లైంగిక సమస్యలు, డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇవ్వన్నీ కూడా సంతానోత్పత్తి తగ్గడానికి కారణాలని నిపుణులు చెబుతున్నారు. 

అంతేకాదు పర్యావరణం, కుటుంబ నేపథ్యం వంటి కారకాలు కూడా సంతానోత్పత్తి క్షీణతకు దోహదం చేస్తాయి. టెస్టోస్టెరాన్ రీప్లేస్ మెంట్ థెరపీ, కెమోథెరపీ, రేడియేషన్ వంటి క్యాన్సర్ చికిత్సలు, కొన్ని యాంటీ ఫంగల్ మెడిసిన్, అల్సర్ మందులు కూడా స్పెర్మ్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి. హెర్నియా సమస్యలు, స్క్రోటల్ లేదా వృషణ శస్త్ర చికిత్సలు, ప్రొస్టేట్ సర్జరీలు, వేసెక్టమీలు వంటివి కూడా స్మెర్మ్ మార్గాన్ని అడ్డుకుంటాయి. ఇవే కాదు పారిశ్రామిక రసాయనాలు, భారీ లోహాలు, రేడియేషన్ ప్రభావం కూడా సంతానోత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. 

మగవారి సంతానోత్పత్తిలో లైఫ్ స్టైల్ కీలక పాత్ర పోషిస్తుంది. అనాబాలిక్ స్టెరాయిడ్స్, కొకైన్, గంజాయి వంటి డ్రగ్స్ వాడకం, మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు కూడా స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తాయి. వీటితోపాటు ఊబకాయం నేరుగా స్పెర్మ్ ను ప్రభావితం చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక బరువు అనేది సంతానోత్పత్తిని ప్రభావితం చేసే హార్మోన్ల మార్పులకు కారణం అవుతుంది. మహిళల వలే  పురుషుల వయస్సు సంతానోత్పత్తి క్షీణతకు కారణం కానప్పటికీ వయస్సు కూడా చాలా కీలకమైంది. 

పురుషుల వయస్సు పెరిగే కొద్దీ గర్భం దాల్చే సమయం పెరుగుతుందని..గర్భధారణ రేటు కూడా తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 30 ఏళ్ల లోపు పురుషులతోపోల్చితే  40 ఏళ్లు పై బడిన పురుషులు ఏడాదిలోపు గర్భం దాల్చే అవకాశం 30శాతం తక్కువగా ఉంటుంది. 45 ఏళ్ల పైబడిన పురుషుల్లో గర్భం దాల్చే సగటు సమయం 25 ఏళ్ల లోపు పురుషుల కంటే 5 రేట్లు ఎక్కువగా ఉంటుంది. 35 ఏళ్ల పైబడిన పురుషులు 25 శాతం గర్భధారణ రేటును కలిగి ఉంటే 35 ఏళ్ల లోపు పురుషులకు 52 శాతం రేటు ఉంటుంది.  

Also Read : కసిగా 10 వేల అడుగులు టార్గెట్ పెట్టుకుని నడిచేస్తున్నారా? ఈ సమస్యలు తప్పవు, ఈ టిప్స్ పాటించండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Waking Up at 3 AM : రోజూ తెల్లవారుజామున 3-4 గంటలకే మెలకువ వస్తోందా? కారణాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
రోజూ తెల్లవారుజామున 3-4 గంటలకే మెలకువ వస్తోందా? కారణాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
Infused Water : తరచూ అలసట, కడుపులో మంట, నోటి దుర్వాసనతో ఇబ్బందా? ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయండి
తరచూ అలసట, కడుపులో మంట, నోటి దుర్వాసనతో ఇబ్బందా? ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయండి
Supplements for Skin and Hair : చర్మం మెరవాలన్నా.. జుట్టు ఒత్తుగా ఉండాలన్నా తీసుకోవాల్సిన 5 సప్లిమెంట్స్ ఇవే
చర్మం మెరవాలన్నా.. జుట్టు ఒత్తుగా ఉండాలన్నా తీసుకోవాల్సిన 5 సప్లిమెంట్స్ ఇవే
Diwali Home Decoration : దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Counting: ఏపీ మున్సిపల్ పోరు.. ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ఫలితాలపై ఉత్కంఠ!
ఏపీ మున్సిపల్ పోరు.. ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ఫలితాలపై ఉత్కంఠ!
AP Youth Trapped In Russia: రష్యా యుద్ధభూమిలో చిక్కుకున్న విశాఖ యువకులు.. 'కాపాడండి' అంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి!
రష్యా యుద్ధభూమిలో చిక్కుకున్న విశాఖ యువకులు.. 'కాపాడండి' అంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి!
Bigg Boss Season 10 Today November 2nd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీ టెంపర్‌పై ముకేశ్ షాకింగ్ కామెంట్స్! ఇచ్చిపడేసిన కంటెస్టెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీ టెంపర్‌పై ముకేశ్ షాకింగ్ కామెంట్స్! ఇచ్చిపడేసిన కంటెస్టెంట్స్!
Infused Water : తరచూ అలసట, కడుపులో మంట, నోటి దుర్వాసనతో ఇబ్బందా? ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయండి
తరచూ అలసట, కడుపులో మంట, నోటి దుర్వాసనతో ఇబ్బందా? ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయండి
EPFO WhatsApp services: ఈపీఎఫ్‌ఓ గుడ్‌న్యూస్‌.. ఇకపై వాట్సప్‌లోనే సేవలు, ఆటోమేటిక్‌ సెటిల్‌మెంట్‌!
ఈపీఎఫ్‌ఓ గుడ్‌న్యూస్‌.. ఇకపై వాట్సప్‌లోనే సేవలు, ఆటోమేటిక్‌ సెటిల్‌మెంట్‌!
Pant- Natarajan Trade: ఫ్రాంచైజీలకు ఊరటనిస్తూ బీసీసీఐ డెడ్‌లైన్ పొడిగింపు.. గోవా మినీ వేలానికి ముందే పంత్, నటరాజన్ ట్రేడింగ్స్ ఖ‌రారు
ఫ్రాంచైజీలకు ఊరటనిస్తూ బీసీసీఐ డెడ్‌లైన్ పొడిగింపు.. గోవా మినీ వేలానికి ముందే పంత్, నటరాజన్ ట్రేడింగ్స్ ఖ‌రారు
Cyclone Musuru Helpline Numbers: ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
Hyderabad Baby Dies: ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
Embed widget