అన్వేషించండి

Deepika Padukone Summer Looks : సమ్మర్​ హెయిర్ స్టైల్స్​ కోసం.. దీపికా పదుకొనేని ఫాలో అయిపోండి

Summer Styles : వేసవిలో హెయిర్ సెట్​ చేసుకోవడమనేది చాలా కష్టం. కానీ కొన్ని టిప్స్​ ఫాలో అయితే హెయిర్​ను బాగా స్టైల్ చేసుకోవచ్చు. అదేలానో తెలుసుకునేందుకు దీపికానీ ఫాలో అయిపోండి.

Summer Hair Styles: సమ్మర్​లో కూడా స్టైలిష్​గా కనిపించాలంటే మీరు దీపికా పదుకొనేని ఫాలో అయిపోవాలి. ఈ భామ.. తన లుక్స్​ని వివిధ రకాల హెయిర్ స్టైల్స్​తో పుల్ చేస్తూ ఉంటుంది. అయితే సమ్మర్​లో ఎలాంటి ఇంబ్బంది లేకుండా.. హెయిర్ డ్యామేజ్​ కాకుండా స్టైల్ చేసుకోవాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. బీచ్​ వేవ్స్​ నుంచి.. స్ట్రెయిట్, చిక్​ లుక్​ కోసం.. దీపికా హెయిర్​ను ఏవిధంగా స్టైల్ చేస్తోందో చెప్పింది ఆమె హెయిర్ స్టెలిస్ట్ ఇయాని సపటోరి. కొన్నిటిప్స్ ఫాలో అయితే దీపికా మాదిరి అందరూ జుట్టును స్టైల్ చేసుకోవచ్చని వెల్లడించింది. 

ఇండియన్ హెయిర్​ వివిధ రకాలు ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా హెయిర్​ను స్టైల్ చేసుకోవాలంటే సరైన ఉత్పత్తులు ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకే దీపికా హెయిర్​కు డైసన్ ఉత్పత్తులు వినియోగిస్తానని తెలిపింది ఇయాని. దీపికా కూడా డైసన్ హెయిర్ కేర్ టెక్నాలజీస్ బ్రాండ్ అంబాసీడర్​గా చేస్తుంది. ఇవి జుట్టుపై ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా.. జుట్టుకు కావాల్సినంత టెంపరేచర్​తో స్టైల్ చేసుకోవచ్చు అంటున్నారు ఇవి హెయిర్​కు నష్టం కలిగించవని చెప్తోంది. దీనివల్ల అనేక స్టైల్​స్​ను ఈజీగా చేయగలుగుతున్నామని తెలిపింది. 

వేవి హెయిర్.. 

మీరు ఈవెంట్​కు, మీటింగ్​కు వెళ్లేప్పుడు వేవి హెయిర్​ స్టైల్​ చేసుకోవచ్చు. జుట్టును స్టైల్ చేసుకునేందుకు ఇది సులభమైన మార్గం. తడిగా ఉన్న జుట్టును టవల్‌తో ఆరబెట్టి.. డ్రైయర్‌తో జుట్టును ఆరబెట్టుకోవచ్చు. స్మూత్ బ్లో-డ్రై చేసుకుని.. స్మూతింగ్ బ్రష్​ను అటాచ్ చేయవచ్చు. ఇప్పుడు మీకు ఇష్టమైన హెయిర్ స్టైలింగ్ ప్రొడక్ట్‌ను ఎంచుకుని.. జుట్టుకు అప్లై చేయాలి. రెండు దిశలలో భారీ కర్ల్స్, వేవ్స్‌ను చేసుకునేందుకు బారెల్‌ను అటాచ్ చేసి..  ముఖం నుంచి దూరంగా పెట్టి కర్ల్స్​ను చేయాలి. 10 సెకన్లు హెల్డ్ చేస్తే మంచి కర్ల్స్ వస్తాయి. ఇలాగే మిగిలిన జుట్టుకు కర్ల్స్ చేయాలి. మొత్తం పూర్తి అయ్యాక హెయిర్​ను చేతులతో కావాల్సినట్టు సెట్ చేసుకోవచ్చు. 

హాలీవుడ్ వేవ్స్

క్లాసీ, చిక్, రిలాక్డ్స్ వైబ్‌ కోసం తలస్నానం చేసి.. హెయిర్​ను బ్లో డ్రై చేయాలి. సాఫ్ట్ స్మూటింగ్​ బ్రష్​తో హెయిర్​ను చిక్కులు లేకుండా డ్రై చేయండి. ఇప్పుడు జుట్టును 3 భాగాలుగా చేసి.. వెనుక ఉన్న హెయిర్​ను 5 భాగాలుగా చేయాలి. భారీ కర్ల్స్​కు తగ్గట్లు బారెల్​ను ఎంచుకుని.. మీకు కావాల్సిన టెంపరేచర్ ఎంచుకోండి. 10 సెకన్లు కోల్డ్​ షాట్​తో కర్ల్స్ చేసుకోండి. ఇలా ప్రతి భాగాన్ని భారీ కర్ల్స్ చేసుకోవచ్చు. ఈ కర్ల్స్‌ను ఫిక్సింగ్ స్ప్రేతో సెట్ చేస్తే బాలీవుడ్ వేవ్ల్​ లుక్ సెట్టు.

బౌన్సీ లుక్​ కోసం.. 

బౌన్సీ లుక్​ ఎప్పుడూ ట్రెండీగానే ఉంటుంది. హెయిర్​ను డ్రై చేసుకుని స్మూత్ బ్రో డ్రై ఫినిషింగ్ చేసుకోవాలి. వాల్యూమైజింగ్ బ్రష్​ని అటా చేసి.. కుదుళ్ల నుంచి మృదువుగా చేయాలి. పాపిడి తీసి.. స్మూతింగ్ డ్రైయర్​ను అటాచ్ చేసి.. స్మూత్ చేసుకోవాలి. స్టిక్ ఆన్ పెర్ల్స్ వంటి టూల్స్​తో బౌన్సీ లుక్​ని క్రియేట్ చేసుకోవచ్చు. 

స్ట్రైయిట్ హెయిర్ కోసం

కర్లీ హెయిర్ ఉండేవారికి.. ఈ స్ట్రెయిట్ హెయిర్​ అనేది ఓ పెద్ద టాస్క్. కానీ డైసన్ ఉత్పత్తులతో హెయిర్​ను ఈజీగా సెట్ చేసుకోవచ్చు. జుట్టు సిల్కీగా, చిక్కులు లేకుండా చేసుకోవడం కోసం తలస్నానం తర్వాత జుట్టును ఆరబెట్టుకోండి. స్మూతింగ్ డ్రైయర్​తో జుట్టు ఆరబెట్టుకోవాలి. పాపిడి తీసి.. కుదుళ్ల నుంచి చివరి వరకు గ్లైడ్ చేయాలి. ఇలా మొత్తం జుట్టును సెట్ చేసుకోవాలి. 

సమ్మర్​లో భారీగా స్టైల్ చేసుకోవడం కన్నా.. ఇలాంటి హెయిర్ స్టైల్స్​ చికాకు లేకుండా చేస్తాయి.  అంతేకాకుండా వీటిని ఇంట్లోనే ఈజీగా ట్రై చేయవచ్చు. ఆఫీస్​కి వెళ్లేవారికి, కాలేజ్​, ఇతర ఈవెంట్లకు వెళ్లేవారికి ఈ తరహా స్టైల్స్​ బాగా నప్పుతాయి.  

Also Read : అంతర్జాతీయ నృత్య దినోత్సవం హిస్టరీ, ప్రాముఖ్యత ఇవే.. ఈ సంవత్సరం థీమ్​ స్పెషల్ ఇదే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget