దానిమ్మలో విటమిన్ కె, సి, బి, పొటాషియం, జింక్, ఫైబర్ మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. అందుకే దీనిని హెల్త్ బెనిఫిట్స్ కోసం తీసుకుంటారు. కానీ కొందరు దానిమ్మ తినకపోవడమే మంచిది అంటున్నారు ఆహార నిపుణులు. స్కిన్ అలెర్జీ ఉన్నవారు దాన్మిమ తింటే సమస్య ఎక్కువ అవుతుందట. రక్తపోటు ఉన్నవారు దానిమ్మను తీసుకోకపోవడమే మంచిదిట. అసిడిటీ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. మీరు దానిమ్మ తీసుకోకపోవడమే మంచిది. జలుబు, దగ్గుతో ఉన్నవారు దానిమ్మరసం తీసుకుంటే సమస్య ఎక్కువ అవుతుందట. మలబద్ధకం, గ్యాస్ సమస్య ఉన్నవారు దానిమ్మరసం తాగితే అజీర్ణ సమస్య ఎక్కువ అవుతుంది. మధుమేహమున్నవారు దానిమ్మరసం తాగకపోవడమే మంచిది. దీనివల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది. ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యులను సంప్రదిస్తే మంచిది. (Images Source :Envato)