International Dance Day 2024 : అంతర్జాతీయ నృత్య దినోత్సవం హిస్టరీ, ప్రాముఖ్యత ఇవే.. ఈ సంవత్సరం థీమ్ స్పెషల్ ఇదే
World Dance Day 2024 : సంతోషం వచ్చినా.. బాధవచ్చినా.. కొందరు డ్యాన్స్ చేస్తారు. ఎన్నో ఎమోషన్స్‌ని మోసే ఈ కళను గౌరవిస్తూ.. ప్రతిసంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన ఇంటర్నేషనల్ డ్యాన్సింగ్ డే నిర్వహిస్తున్నారు.
International Dance Day 2024 Theme : ఇంటర్నేషనల్ డ్యాన్స్ డేని ప్రపంచ డ్యాన్స్ డేగా కూడా పిలుస్తారు. అయితే 64 కళల్లో ఒకటైన డ్యాన్స్‌ను గౌరవిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29వ తేదీన అంతర్జాతీయ నృత్య దినోత్సవం జరుపుతున్నారు. వివిధ సాంస్కృతిక నృత్యాలను విశ్వవ్యాప్తంగా పరిచయం చేయడంతో పాటు.. ఈ రంగాన్ని అభివృద్ధి చేయడంకోసం దీనిని నిర్వహిస్తున్నారు. జాతి, మత అడ్డంకులు లేకుండా.. అందరూ సంతోషంగా దీనిలో పాల్గొనేలా చూడడమే దీని లక్ష్యం.
ప్రపంచ నృత్య దినోత్సవం చరిత్ర ఇదే..
ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ UNESCO, ఇంటర్నేషనల్ డ్యాన్స్ కమిటీ కలిసి ప్రపంచ నృత్యదినోత్సవం నిర్వహించాలని 1982లో కృషి చేశారు. నృత్యం చేయడం, దాని ప్రాముఖ్యతను గురించి అవగాహన పెంచడం, ఈ కళారూపాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ప్రోత్సాహించేలా చేయడం వంటి ప్రోత్సాహించే విధంగా ఈ డేని నిర్వహించాలని నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలలో ఈ డ్యాన్ డేని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నృత్య ప్రదర్శనలు, వర్క్‌షాప్‌లు, ఈవెంట్లు నిర్వహిస్తారు. వైవిధ్యమైన నృత్యాలు, దాని సౌందర్యాన్ని గుర్తించేందుకు ఈ కార్యక్రమాలు హెల్ప్ చేస్తాయి.
అత్యుత్తమ కొరియోగ్రాఫర్ ఎంపిక..
ప్రపంచ నృత్య దినోత్సవం రోజును నృత్య కళారూపానికి అంకితం చేశారు. ఇది నృత్యాన్ని, నృత్య కళాకారుల విలువను విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ వేడుకను పురస్కరించుకుని.. ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ డ్యాన్స్ కమిటీ, ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ ITI ప్రపంచవ్యాప్తంగా ఉన్న నృత్యకారులందరిలో అత్యుత్తమ కొరియోగ్రాఫర్ లేదా డ్యాన్సర్‌ను ఎంపిక చేస్తుంది. వారిని కొన్ని నృత్యప్రదర్శనలు, కార్యక్రమాల ద్వారా నిర్ణయిస్తారు. నృత్యకళాకారులను ప్రోత్సాహిస్తూ ప్రతి సంవత్సరం దీనిని నిర్వహిస్తున్నారు.
అంతర్జాతీయ నృత్య దినోత్సవం 2024 థీమ్
అన్ని రకాలుగా నృత్యాన్ని ప్రోత్సాహించడమే లక్ష్యంగా అంతర్జాతీయ నృత్య దినోత్సవం థీమ్‌ను ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రభుత్వాలు, నాయకులు నృత్యం విలువను గుర్తించి.. వారికి మద్దతుగా నిలిచేలా కార్యక్రమాలు చేపడతారు. ప్రజలు తమ ప్రయోజనాల కోసం నృత్యాన్ని ప్రోత్సాహించే విధంగా, నృత్యంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చెప్తూ.. ఈ డేని నిర్వహిస్తారు. డ్యాన్స్‌ను ఇప్పటికీ కొందరు ప్రొఫెషన్‌గా చూడడంలేదని.. కుప్పిగంతుల కింద లెక్కవేస్తున్నారని.. ఆ ఫీలింగ్‌ను రూపుమాపడానికే ఈ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డేని నిర్వహిస్తున్నారు.
డ్యాన్స్ వర్క్‌షాప్‌లలో ప్రజలు పాల్గొనేలా చేయడం.. ప్రసిద్ధ కళా రూపాలను ప్రదర్శించడం చేస్తూ ఉంటారు. ఈ ఈవెంట్లను ఆన్లైన్లలో కూడా కండక్ట్ చేస్తారు. వీటిని స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ చేసి.. ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూస్తారు. ఈ ఆహ్లాదకరమైన ప్రక్రియ శారీరకంగా, మానసికంగా హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. ఫిట్‌గా ఉండేందుకు జిమ్‌కి వెళ్లడం ఇష్టంలేని వారు డ్యాన్స్‌తో మెరుగైన ఫలితాలు పొందవచ్చు. డ్యాన్స్‌లో వివిధ రకాలు ఉంటాయి కాబట్టి.. ఎవరి నేచర్‌కు తగ్గట్లు వారు ఈ డ్యాన్స్‌ను ఎంచుకోవచ్చు. అంతేకాకుండా చిన్ననాటి నుంచే పిల్లలకు డ్యాన్స్ నేర్పించడం వంటివి చేయడం వల్ల వారు కూడా చురుకుగా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. శారీరకంగా వ్యాయామం అందుతుంది. మనసుకు కూడా హాయినిస్తుంది.
Also Read : పిల్లలను త్వరగా నిద్రపుచ్చడానికి ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి