అన్వేషించండి

Salt side effects: ఉప్పు తగ్గించి తీసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే!

శరీరంలో సోడియం తగ్గించేందుకు 2,200 మిల్లీగ్రాముల లో సోడియం సాల్ట్ తీసుకుంటే చాలని అధ్యయనాలు చెబుతున్నాయి.

మధ్య డైటింగ్ లో భాగంగా ఉప్పు తగ్గించి తీసుకోవడం, లేదా పూర్తిగా మానెయ్యడం బాగా ట్రెండ్ లో ఉంది. ఉప్పు వల్ల శరీరంలో వాటర్ రిటైన్ అయ్యి బరువు పెరిగిపోతారని, రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందని, బీపీ పెరిగిపోతుందని, ఫలితంగా గుండె బలహీనపడి గుండె సమస్యలు వస్తాయని ఇలా రకరకాల వాదనలు చలామణిలో ఉన్నాయి. ఉప్పు తక్కువగా ఉండే పదార్థాలే ఆరోగ్యకరమైనవని కూడా ప్రాచూర్యంలో ఉంది. మరి నిజంగానే ఉప్పు పూర్తిగా తగ్గించడం ఆరోగ్యానికి మంచిదేనా? కొంత మంది నిపుణులు అసలు కాదని అంటున్నారు. సోడియం రిటెన్షన్ ఎంత ప్రమాదకరమో సోడియం తగ్గిపోవడం అంతకు మించి ప్రమాదకరం కావచ్చట. కొద్ది మొత్తంలో సోడియం స్థాయిలు తగ్గినా అది ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందని అధ్యయన వివరాలు చెబుతున్నాయట.

మన శరీరానికి అవసరమైన పోషకాల్లో సోడియం కూడా ఒకటి. ఇది ఉప్పు ద్వారా శరీరానికి అందుతుంది. అయితే సోడియం మోతాదుకు మించి తీసుకున్నపుడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోవడం, బీపీ, గుండె సమస్యలు, ఊబకాయం వంటి రకరకాల అనారోగ్యాలకు కారణం అవుతుంది. ఈ రోజుల్లో చాలా మంది ఉఫ్పు‌ను మోతాదు కంటే తగ్గించి తీసుకోవడం, లేదా పూర్తిగా మానెయ్యడం చేస్తున్నారు. ఇలా చేస్తే దుష్ప్రభావాలు ఉంటాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

ఉఫ్పు బాగా తగ్గించి తీసుకుంటే సింపాథటిక్ నాడీ వ్యవస్థ చురుకుగా ఉండడం వల్ల నిద్ర సమస్యలు వస్తాయి. లో సోడియం సాల్ట్ వాడేవారిలో శరీరంలో సోడియం క్షీణించడాన్ని గమనించారు. అందువల్ల శరీరం మీద సోడియం క్షీణత వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇది స్లీప్ ప్యాటర్న్ మీద నేరుగా ప్రభావం చూపుతుందని చాలా అధ్యయనాలు తేల్చి చెప్పాయి.

ఉఫ్పు తగ్గించి తీసుకోవడం వల్ల సోడియం తగ్గిపోయి నిద్ర ప్యాటర్న్ చెడిపోతుందని జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజి అండ్ మెటబాలిజమ్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం వివరిస్తోంది. ఈ అధ్యయనం కోసం మధ్య వయస్కులను ఎంచుకున్నారు. సోడియం తగ్గినపుడు రాత్రి నిద్ర నాణ్యత తగ్గి పోవడాన్ని స్పష్టంగా గమనించారు. చాలినంత నిద్ర లేకపోవడం వల్ల పనినాణ్యత తగ్గడం నుంచి రకరకాల సమస్యలు వేధిస్తాయి. దీర్ఘకాలం పాటు నిద్ర లేమి వేధిస్తే మెదడు పనితీరు మందగిస్తుంది. క్రమంగా డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు కూడా రావచ్చు. మతిమరుపు వేధించవచ్చు. కనుక నిద్ర చాలినంత ఉండాలంటే శరీరంలో సోడియం మోతాదులు సరిగ్గా ఉండాలి.

ఉప్పు తగ్గించి తీసుకున్నపుడు సోడియం తగ్గడం మాత్రమే కాదు కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా తగినంత లభించవు. అందువల్ల ఎముకల ఆరోగ్యం మీద కూడా దుష్ప్రభావాలు ఏర్పడుతాయి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం ఎంత ప్రమాదకరమో, బాగా తగ్గించెయ్యడం లేదా మానెయ్యడం కూడా అంతే అనారోగ్యకరం.

Read Also : స్నేహితులతో ఎంజాయ్ చేసే రాత్రి ఇది, ఈ స్లీప్ ఓవర్​ డే కేవలం ఆడవారికి మాత్రమే.. ఎందుకంటే ?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG Crisis Hits Hyderabad : హైదరాబాద్‌లో LPG కష్టాలు.. పనిచేయని యాప్స్, గ్యాస్ బుకింగ్ కోసం ప్రజల పరుగులు
హైదరాబాద్‌లో LPG కష్టాలు.. పనిచేయని యాప్స్, గ్యాస్ బుకింగ్ కోసం ప్రజల పరుగులు
Cooking Without LPG : గ్యాస్ లేకున్నా వంట చేయొచ్చు.. ఇండక్షన్ మాత్రమే కాదు ఈ ప్రత్యామ్నాయాలు కూడా హెల్ప్ చేస్తాయి
గ్యాస్ లేకున్నా వంట చేయొచ్చు.. ఇండక్షన్ మాత్రమే కాదు ఈ ప్రత్యామ్నాయాలు కూడా హెల్ప్ చేస్తాయి
Curd Poha: పొయ్యి వెలిగించకుండా చిటికెలో చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఇదే! రుచి, ఆరోగ్యం, ఆదాయం మూడు గుణాల అటుకుల పెరుగు!
పొయ్యి వెలిగించకుండా చిటికెలో చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఇదే! రుచి, ఆరోగ్యం, ఆదాయం మూడు గుణాల అటుకుల పెరుగు!
Orange Juice : వేసవిలో ప్రతిరోజూ ఆరెంజ్ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో.. కానీ వాళ్లు తాగకూడదట
వేసవిలో ప్రతిరోజూ ఆరెంజ్ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో.. కానీ వాళ్లు తాగకూడదట

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Autonomous shipbuilding: నెల్లూరులో డ్రైవర్లు అవసరం లేని నౌకల తయారీ కేంద్రం -అటానమస్ షిప్‌బిల్డింగ్ సెంటర్‌ ప్రత్యేకత ఇదే !
నెల్లూరులో డ్రైవర్లు అవసరం లేని నౌకల తయారీ కేంద్రం -అటానమస్ షిప్‌బిల్డింగ్ సెంటర్‌ ప్రత్యేకత ఇదే !
Nirmal District Latest News: శుభకార్యానికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు!నిర్మల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం! ఇద్దరు మృతి, 22 మందికి గాయాలు!
శుభకార్యానికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు!నిర్మల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం! ఇద్దరు మృతి, 22 మందికి గాయాలు!
Made In Korea OTT : ఓటీటీలోకి ఓజీ బ్యూటీ మేడ్ ఇన్ కొరియా - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి ఓజీ బ్యూటీ మేడ్ ఇన్ కొరియా - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Supreme Court: తెలంగాణ స్పీకర్ నిర్ణయమే ఫైనల్‌! ఫిరాయింపుల పిటిషన్లపై విచారణ ముగించిన సుప్రీంకోర్టు! బీఆర్‌ఎస్‌కు షాక్!
తెలంగాణ స్పీకర్ నిర్ణయమే ఫైనల్‌! ఫిరాయింపుల పిటిషన్లపై విచారణ ముగించిన సుప్రీంకోర్టు! బీఆర్‌ఎస్‌కు షాక్!
LPG Crisis Hits Hyderabad : హైదరాబాద్‌లో LPG కష్టాలు.. పనిచేయని యాప్స్, గ్యాస్ బుకింగ్ కోసం ప్రజల పరుగులు
హైదరాబాద్‌లో LPG కష్టాలు.. పనిచేయని యాప్స్, గ్యాస్ బుకింగ్ కోసం ప్రజల పరుగులు
Kavitha : ఢిల్లీ లిక్కర్ కేసులో మరో మలుపు! కవిత నివాసానికి సీబీఐ అధికారులు!
ఢిల్లీ లిక్కర్ కేసులో మరో మలుపు! కవిత నివాసానికి సీబీఐ అధికారులు!
గ్యాస్ కొరతకు పర్ఫెక్ట్ సొల్యూషన్! భగవద్గీత, ఆయుర్వేదం చెప్పిన మంట అవసరం లేని ఆహార, ఆరోగ్య రహస్యాలు!
గ్యాస్ కొరతకు పర్ఫెక్ట్ సొల్యూషన్! భగవద్గీత, ఆయుర్వేదం చెప్పిన మంట అవసరం లేని ఆహార, ఆరోగ్య రహస్యాలు!
Shenlong Suezmax Mumbai Arrival: యుద్ధం అంచున ఇండియన్ కెప్టెన్  సాహసం! హుర్ముజ్ జలసంధి దాటుకొని ముంబై చేరిన చముర నౌక!
యుద్ధం అంచున ఇండియన్ కెప్టెన్  సాహసం! హుర్ముజ్ జలసంధి దాటుకొని ముంబై చేరిన చముర నౌక!
Embed widget