National Sleepover Day 2024 : స్నేహితులతో ఎంజాయ్ చేసే రాత్రి ఇది, ఈ స్లీప్ ఓవర్ డే కేవలం ఆడవారికి మాత్రమే.. ఎందుకంటే?
Sleepover Day Definition : కొన్ని వినడానికి విడ్డూరంగానూ.. ఆచరించడానికి ఆశ్చర్యంగానూ ఉంటాయి. అలాంటి వాటిలో స్లీప్ ఓవర్ డే కూడా ఒకటి. దీని అర్థమేంటి? ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా?
ఇవి ఫాలో అవ్వాలి
స్లీప్ ఓవర్‌కి మీకు ఇన్విటేషన్ వచ్చిందనుకో మీరు కొన్ని విషయాలు ఫాలో అవ్వాలి. ముందుగా స్లీపింగ్ బ్యాగ్ సిద్ధం చేసుకోవాలి. దానిలో టూత్ బ్రష్.. నైట్ డ్రెస్, మేకప్ ప్రొడెక్ట్స్ ప్యాక్ చేసుకోవాలి. పిల్లలు, టీనేజర్లకు ఎక్కువగా పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే తమ సొంత ప్లేస్ నుంచి వారికి గ్యాప్ వస్తుంది. అంతేకాకుండా ఇతర ప్రాంతాలకు లేదా ఇతరుల దగ్గరికి వెళ్లినప్పుడు తమని తాము ఏ విధంగా సిద్ధం చేసుకుంటారనే అంశాన్ని ఇది హైలైట్ చేస్తుంది. అయితే ఈ స్లీప్ ఓవర్ డేలో ఫ్రెండ్స్ గ్యాంగ్ వస్తే దానిని స్లంబర్ పార్టీ లేదా పైజామా పార్టీ అని కూడా అంటారు.
స్లీప్ ఓవర్ డే చరిత్ర..
స్లీప్ ఓవర్ డేని 1930 నుంచి జరుపుకుంటున్నారు. అయితే వివిధ దేశాల్లో దీనిని ఫాలో అవుతారు. అయితే రెండు బ్రాండ్స్ తమ ప్రమోషన్లో భాగాంగా ఈ స్లీప్ ఓవర్ డేని తెరపైకి తీసుకొచ్చాయి. న్యూ లుక్.. మేకప్ సో ప్యూర్ యూ కెన్ స్లీప్ ఇన్ ఇట్ అనే ట్యాగ్ లైన్ తీసుకొచ్చారు. మహిళలు తమ సౌందర్య రహస్యాలు ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడానికి ఈ స్లీప్ ఓవర్ డేని ఎంచుకుంటారు. #Sleepinthebare అనే హ్యాష్‌టాగ్‌తో ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తారు. అయితే 2017లో మే 9వ తేదీని జాతీయ దినోత్సవ క్యాలెండర్లో.. స్లీప్ ఓవర్ డేగా రిజిస్టర్ చేశారు.
ఉమెన్స్ డే వీక్‌లో ఈ స్లీప్ ఓవర్ డే వస్తుంది. కాబట్టి దీనిని అమ్మాయిలకు స్ఫూర్తిధాయకంగా డిజైన్ చేశారు. ఈడే వారిలో విశ్వాసాన్ని కాన్ఫిడెన్స్‌ని పెంచుతుందని భావిస్తారు. అంతే కాకుండా ఫ్రెండ్స్ మధ్య బాండింగ్ పెరగడానికి.. ఇన్ఫర్మేషన్ను పంచుకోవడానికి హెల్ప్ చేస్తుందని చెప్తారు. ఒకరి బాధలు, సంతోషాలు మనస్ఫూర్తిగా షేర్ చేసుకోవడంలో ఇవి హెల్ప్ అవతాయని భావిస్తారు. ముఖ్యంగా ఓ ట్రూ ఫ్రెండ్‌తో టైమ్ స్పెండ్ చేస్తే లోపలున్న స్ట్రెస్ తగ్గి మరింత హెల్తీగా ఉంటారని ఈ డే సూచిస్తుంది.
Also Read : ఎముక విరిగినప్పుడు ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది.. ఆ ఫుడ్స్ మాత్రం అస్సలు తీసుకోకూడదట