అన్వేషించండి

Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?

Baby Crying After Every Feed : మీ పిల్లలు పాలు తాగిన తర్వాత ఏడుస్తున్నారా? తరచుగా ఇలా జరుగుతుంటే దానికి కారణం ఎలా గుర్తించాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పాలు తాగాక పిల్లల ఏడుపునకు గ్యాస్, కోలిక్ కారణం.
  • కోలిక్ లక్షణాలు, పాలు సరిగ్గా పట్టకపోవడం వివరాలున్నాయి.
  • తేన్పు, సరైన స్థానం వంటి తల్లిదండ్రుల జాగ్రత్తలు వివరించబడ్డాయి.
  • తీవ్ర లక్షణాలుంటే వెంటనే వైద్యుని సంప్రదించమని సూచన.

Babies Cry After Feeds Reasons : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? ఇది తరచుగా జరుగుతుంటే తల్లిదండ్రులు దానికి కారణాలు ఏంటో తెలుసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే అది ఆకలి వల్లనా? నొప్పి వల్లనా? కడుపునొప్పి వల్లనా? ఏడుస్తున్న సమయం వల్లనా తెలుసుకోవాల్సి ఉంటుందని డాక్టర్ ప్రశాంత్ బాబు తెలిపారు. యశోదా ఆస్పత్రిలో కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, నియోనాటాలజిస్ట్​గా చేస్తోన్న డాక్టర్ బి. ప్రశాంత్ బాబు పిల్లలు పాలు తాగడం తర్వాత ఏడ్వడం గురించి పలు విషయాలు తెలిపారు. అవేంటంటే..

పిల్లల్లో కడుపునొప్పి 

పిల్లల్లో కడుపునొప్పి(కోలిక్) అంటే ఆరోగ్యంగా ఎదుగుతున్న శిశువు ఎక్కువసేపు, పదేపదే ఏడవడమే. ఇది తరచుగా సాయంత్రం పూట ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా 3 వారాల పాటు.. వారానికి 3 రోజులు.. రోజుకు 3 గంటల చొప్పున ఏడవడం జరుగుతుంది. ఇది 3 నుంచి 4 నెలల వయస్సులో తగ్గిపోతుంది. అయితే మీ బేబి పాలు తాగడానికి ఇబ్బంది పడుతున్నా, తరచుగా వాంతి చేసుకుంటున్నా, లేదా బరువు సరిగ్గా పెరగకపోయినా, అది కడుపునొప్పి అని భావించకూడదని చెప్తున్నారు.

Also Read : పిల్లలు ఏడుస్తున్నప్పుడు పేరెంట్స్ అస్సలు చేయకూడని మిస్టేక్స్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

పాలు తాగిన తర్వాత ఏడ్వడానికి కారణాలు ఇవే

పిల్లలు పాలు తాగేప్పుడు గాలిని మింగడం సర్వసాధారణం. దీనివల్ల కడుపులో గ్యాస్ పేరుకుపోవడం వల్ల కడుపు బిగుతుగా మారవచ్చు. కాళ్లు పైకి ముడుచుకుపోవచ్చు. లేదా కొంతమంది పిల్లలకు ఇంకా ఆకలిగా ఉండవచ్చు. లేదా పాలు తాగడం వారికి కష్టంగా ఉండవచ్చు. రిఫ్లక్స్ కూడా ఒక కారణమేనని చెప్తున్నారు వైద్యులు.

పిల్లలు పాలు కక్కడం సాధారణమే. కానీ తరచుగా వాంతులు చేసుకోవడం, వీపు వెనక్కి వంచడం, లేదా బరువు సరిగ్గా పెరగకపోవడం వంటివి కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. నిజమైన పాల అలెర్జీ అసాధారణం, కానీ మలంలో రక్తం, దద్దుర్లు, లేదా విరేచనాలు వంటివి కనిపిస్తే తెలియజేయాలి. 

అలాగే పాలు పట్టడంలో ఇబ్బంది లేదా నాలుక అతుక్కుపోవడం కూడా ఒక కారణం కావచ్చు. రొమ్ము నుంచి పాలు జారిపోవడం.. ఎక్కువ సేపు పాలు తాగడం, లేదా చనుమొన నొప్పి వంటివి దీనికి సూచనలు. 

Also Read : పిల్లల స్కూల్ బ్యాగులు మరీ బరువుగా ఉన్నాయా? వెన్నెముక ఆరోగ్యంపై పడే ప్రభావం ఇదే.. వైద్యుల హెచ్చరికలు

పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పిల్లలకు ప్రశాంతమైన ప్రదేశంలో పాలు పట్టండి. పాలు తాగుతున్నప్పుడు తేన్పు రాకుండా చూసుకోవాలి. తర్వాత 20 నుంచి 30 నిమిషాల పాటు బేబిని నిటారుగా ఉంచండి. బాటిల్‌తో పాలు పడుతుంటే.. నెమ్మదిగా పాలు వచ్చే నిపుల్ (టీట్) మింగిన గాలిని తగ్గించవచ్చు. అలాగే బేబి నిద్రపోయేటప్పుడు ఎల్లప్పుడూ వెల్లకిలా పడుకోబెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. 

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే..

కొన్ని రోజుల పాటు.. పాలు పట్టే సమయాలు.. ఏడుపు ఎంతసేపు ఉంటుందో.. పాలు కక్కడం, వీపు వెనక్కి వంచడం, డైపర్‌లను గమనించండి. ఇవి మీ వైద్యుడికి పిల్లల గురించి చెప్పడంలో హెల్ప్ అవుతుంది. మీ పిల్లలు ఎక్కువసార్లు పాలు తాగిన తర్వాత ఏడుస్తుంటే.. పాలు తాగడానికి నిరాకరిస్తే.. పదేపదే వాంతి చేసుకుంటే.. డైపర్లు తక్కువగా తడుపుతుంటే.. బరువు సరిగ్గా పెరగకపోతే వైద్యుడిని కచ్చితంగా సంప్రదించాలి. 

జ్వరం, తీవ్రమైన, ఆకుపచ్చ లేదా రక్తంతో కూడిన వాంతులు, కడుపు ఉబ్బడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా అసాధారణమైన నిద్రమత్తు వంటి లక్షణాలు ఉంటే, వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని డాక్టర్ ప్రశాంత్ బాబు సూచించారు. 

Also Read : పిల్లలలో లో బీపీ.. అధిక జ్వరంతో పాటు ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Rice Prices: బియ్యం అక్రమ నిల్వలు, ధరల పెంపుపై ప్రభుత్వం ఉక్కుపాదం.. సన్నబియ్యంపై గరిష్ఠ ధరలు ఖరారు
బియ్యం అక్రమ నిల్వలు, ధరల పెంపుపై ప్రభుత్వం ఉక్కుపాదం.. సన్నబియ్యంపై గరిష్ఠ ధరలు ఖరారు
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Rice Prices: బియ్యం అక్రమ నిల్వలు, ధరల పెంపుపై ప్రభుత్వం ఉక్కుపాదం.. సన్నబియ్యంపై గరిష్ఠ ధరలు ఖరారు
బియ్యం అక్రమ నిల్వలు, ధరల పెంపుపై ప్రభుత్వం ఉక్కుపాదం.. సన్నబియ్యంపై గరిష్ఠ ధరలు ఖరారు
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
High Tension in Pulivendula: పులివెందులలో రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ వర్గీయులు.. వాహనాలు తగులబెట్టేశారు!
పులివెందులలో రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ వర్గీయులు.. వాహనాలు తగులబెట్టేశారు!
Mallanna Sagar Reservoir: మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్ మహేష్ క్లారిటీ
మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Embed widget