అన్వేషించండి

Cradle Cap : నవజాత శిశువుల తలపై పొలుసులకు కారణాలు, ఇంటి చిట్కాలు ఇవే.. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే

Newborns Baby Issues : శిశువు తలపై పొలుసులు సాధారణంiగా కనిపించవచ్చు. ఇది రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అవేంటో.. అవి రాకుండా తీసుకోనాల్సి బాధ్యతలేంటో చూసేద్దాం.

Cradle Cap in Newborns : అప్పుడే పుట్టిన పిల్లలకు వచ్చే కొన్ని సమస్యల్లో తలపై పొలుసులు కనిపించడం కూడా ఒకటి. నవజాత శిశువులు చూసేందుకు చాలా సున్నితంగా ఉంటారు. ఆ సమయంలో వారికి ఏమి ఇబ్బంది కలిగినా పేరెంట్స్ తెగ టెన్షన్ పడిపోతుంటారు. అలాంటి వాటిలో మాడుపై పొలుసు కనిపించడం కూడా ఒకటని చెప్తున్నారు నిపుణులు. పేరెంట్స్ పిల్లల్లో ఈ సమస్యను గుర్తించినప్పుడు తెగ టెన్షన్ పడిపోతారట. ఇంతకీ ఇది సాధారణ సమస్య? వైద్యులు ఇస్తోన్న సలహాలు, సూచనలు ఏంటో చూసేద్దాం. 

పిల్లల తలపై పొలుసులు కనిపించడాన్ని వైద్య పరిభాషలో 'క్రెడిల్ క్యాప్' (Cradle Cap) అంటారు. ఇది చూడటానికి తలపై అసహ్యంగా కనిపిస్తుంది. కానీ ప్రమాదకరమైనది కాదని చెప్తున్నారు. కానీ సమయానికి దానిపై దృష్టి పెట్టాలని.. లేకుంటే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. సాధారణంగా ఈ సమస్య చాలామంది పిల్లల్లో కనిపిస్తుందని.. కాబట్టి దాని గురించి అంత చింతించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఎందుకుంటే కొన్ని ఇంటి చిట్కాలతో కూడా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చట. కానీ సమస్య ఎక్కువ ఉంటే వైద్యుల సలహా కచ్చితంగా తీసుకోవాలట. 

పిల్లల తల మీద పొలుసులు ఏర్పడడానికి కారణాలివే

డా ఇమ్రాన్ పటేల్ ప్రకారం.. నవజాత శిశువుల తల మీద పొలుసులు ఏర్పడటానికి ప్రధాన కారణం తల్లి హార్మోన్ల ప్రభావం. పుట్టిన తర్వాత కూడా శిశువు.. తల్లి నుంచి కొన్ని హార్మోన్లు పాల రూపంలో తీసుకుంటాడట. దీనివల్ల చర్మం పొడిగా మారడం ప్రారంభించి... అదనంగా ఉన్న నూనె కారణంగా డెడ్ స్కిన్ సెల్స్ దగ్గరై పొలుసులగా మారతాయట. కొన్నిసార్లు 'ఫంగల్ ఇన్ఫెక్షన్' (Fungal Infection) కూడా దీనికి కారణం అవుతుంది. ఆ సమయంలో పొలుసులతో పాటు చర్మం ఎరుపుగా మారి, వాపుగా కనిపిస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

నవజాత శిశువుల్లో ఈ సమస్య గుర్తిస్తే ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి. మృదువైన నూనెను అంటే బాదం లేదా కొబ్బరి నూనెతో శిశువు తలపై సున్నితంగా మసాజ్ చేసి 15 నిమిషాలు వదిలేయండి. ఇది పొలుసులను మృదువుగా చేస్తుంది. తర్వాత బేబీ షాంపుతో (Baby Shampoo) కడిగిన తర్వాత మెత్తటి బ్రష్ లేదా దువ్వెనతో నెమ్మదిగా దువ్వండి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల తలలో నూనె నిల్వ ఉండదు. పొలుసులు క్రమంగా తగ్గుతాయి.

వైద్యుడిని ఎప్పుడు కలవాలంటే..

చాలా కేసులలో 'క్రెడిల్ క్యాప్' (Cradle Cap) తానంతట అదే నయమవుతుంది. ఇంటి చిట్కాలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. కానీ పొలుసులతో పాటు దురద, వాపు, ఎరుపు పెరిగితే లేదా వ్యాప్తి చెందితే వెంటనే శిశువైద్యుడిని సంప్రదించండి. ఇది ఒక తాత్కాలిక సమస్య. సరైన సంరక్షణ తీసుకుంటే.. త్వరలోనే మాడు మెరుస్తూ, ఆరోగ్యంగా మారతుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget