News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Cracking Knuckles: పిడికిలి వేళ్ళు విరుచుకుంటే కీళ్ల నొప్పులు వస్తాయా?

అలిసిపోయేలా వర్క్ చేసి ఒక్కసారిగా వేళ్ళు వెనక్కి విరుచుకుంటే హాయిగా రిలాక్స్ గా అనిపిస్తుంది. కానీ ఇది చెడ్డ అలవాటని అంటున్నారు.

FOLLOW US: 
Share:

చాలా మంది పిడికిలి బిగించి వేళ్ళు విరుచుకుంటూ ఉంటారు. ఎక్కువగా పని చేసినప్పుడు చేతులు నొప్పులుగా అనిపిస్తాయి. అటువంటి సమయంలో కొంత మంది పనులు చేసినప్పుడు వేళ్ళు అలసటగా అనిపిస్తాయి. అప్పుడు పిడికిలి మూసి చిటికెలు అనేలా విరుచుకుంటారు. కానీ దీని వల్ల ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. దీనిలో ఎంత వరకు నిజం ఉంది.  ఇది చెడు అలవాటు మాత్రమే కాదు ఎముక సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. మొటికలు విరుచుకోవడం వల్ల వేలు కీళ్లలో లూబ్రికేషన్ తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.  

మొటికలు ఎలా సౌండ్ వస్తాయి?

సైనోవియల్ ద్రవంలోని బుడగలు పగిలిపోవడం వల్ల చిటుక్ అని సౌండ్ వస్తుంది. ఈ ద్రవం కీళ్లని సులభతరం చేస్తుంది. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం చాలా వాయువులు ద్రవంలో కరిగిపోతాయి. మొటికలు విరిచినప్పుడు లోపల ఒత్తిడి పెరిగి ఆ బుడగలు పగిలిపోతాయి. ఒక్కసారి వేళ్ళు విరిచినప్పుడు సౌండ్ వస్తుంది. మళ్ళీ వెంటనే అలా చేస్తే ఎటువంటి శబ్దం రాదు. ఈ వాయువులు సైనోవియల్ ద్రవంలో మళ్ళీ కరిగిపోయే వరకు కొంత సమయం పడుతుంది. అందుకే మళ్ళీ పిడికిలి రీ క్రాక్ చేయలేము.

అలా చేస్తే కీళ్ల నొప్పులు వస్తాయా?

పిడికిలి వేళ్ళు మెల్లగా విరిచినప్పుడు వచ్చే శబ్ధం వల్ల రిలాక్స్ గా అనిపిస్తుంది. అందుకే చేతులు అలిసిపోయినప్పుడు ఎక్కువ మంది ఇదే పని చేస్తూ ఉంటారు. కానీ ఇది ఆర్థరైటిస్ కి దారి తీస్తుందని చాలా మంది నమ్మకం. ఇదొక బాధకరమైన పరిస్థితి. అయితే ఇలా వేళ్ళు విరుచుకోవడానికి, కీళ్ల నొప్పులకు మధ్య ఎటువంటి సంబంధం లేదని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.

అమెరికన్ బోర్డ్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్ జర్నల్ లో దీనికి సంబంధించి ఒక పరిశోధన గురించి ప్రచురించారు. ఆర్థరైటిస్ తో బాధపడుతున్న 215 మందిని అధ్యయనం చేశారు. అందులో 20 శాతం మందికి పిడికిలి బిగించి వేళ్ళు విరుచుకునే అలవాటు ఉంది. వారిలో 18.1 శాతం మందికి చేతుల్లో కీళ్ల నొప్పులు వచ్చాయి. అలా చేయని మిగతా 21.5 శాతం మందికి కీళ్ల నొప్పులు వచ్చాయి. ఒక వ్యక్తి పిడికిలి బిగించి వేళ్ళు విరిచినా అలా చేయకపోయినా కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం దాదాపు ఒకే విధంగా ఉంటుందని పరిశోధకులు నిర్ధారించారు.

చికిత్స ఉందా?

పిడికిలి వేళ్ళు విరుచుకోవడం లేదా కీళ్ల పగుళ్లు ఏ ఆరోగ్య సమస్యతోనూ ముడిపడి ఉండవు. అందువల్ల ఆందోళన చెందాల్సిన పని లేదని చెబుతున్నారు. అయితే అలా వేళ్ళు విరుచుకున్న సందర్భాల్లో నొప్పి లేదా వాపు గమనిస్తే మాత్రం వెంటనే వైద్యులని సంప్రదించాలి. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ చెప్పిన దాని ప్రకారం మోచేతిలో వదులుగా ఉంటే మృదులాస్థిలో పగుళ్లు వచ్చి కూడా అలా జరుగుతుందని చెప్తున్నారు. ఈ అలవాటు మానుకోవడం కోసం వైద్యులు అనేక పరిష్కారాలు చూపిస్తున్నారు. స్ట్రెస్ బాల్స్, ఫిడ్జ్టింగ్ బొమ్మలు, డూడ్లింగ్ చేయడం వల్ల ఈ అలవాటు నుంచి బయట పడొచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: నిలబడి నీళ్ళు తాగితే కీళ్ల నొప్పులు వస్తాయా? ఎలా తాగితే ఆరోగ్యానికి మేలు

Published at : 30 Jun 2023 10:00 AM (IST) Tags: Arthritis Cracking Knuckles Knuckles Cracking Knuckles Side Effects

ఇవి కూడా చూడండి

Hyperacidity: హైపర్ అసిడిటీని తగ్గించే ఆయుర్వేద ఆహార పదార్థాలు ఇవే

Hyperacidity: హైపర్ అసిడిటీని తగ్గించే ఆయుర్వేద ఆహార పదార్థాలు ఇవే

Weight Loss: జిమ్‌కు వెళ్ళకుండా బరువులు ఎత్తకుండానే మీ బరువు ఇలా తగ్గించేసుకోండి

Weight Loss: జిమ్‌కు వెళ్ళకుండా బరువులు ఎత్తకుండానే మీ బరువు ఇలా తగ్గించేసుకోండి

Pea Protein Powder: బఠానీలతో చేసిన ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే అన్నీ లాభాలున్నాయా?

Pea Protein Powder: బఠానీలతో చేసిన ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే అన్నీ లాభాలున్నాయా?

Relatioships: నా భర్త ఆమెతో మళ్లీ మాట్లాడుతున్నాడు, నాకు నచ్చడం లేదు - ఏం చేయమంటారు?

Relatioships: నా భర్త ఆమెతో మళ్లీ మాట్లాడుతున్నాడు, నాకు నచ్చడం లేదు - ఏం చేయమంటారు?

Teenagers: తల్లిదండ్రులూ జాగ్రత్త, టీనేజర్లలో పెరిగిపోతున్న డిప్రెషన్ లక్షణాలు

Teenagers: తల్లిదండ్రులూ జాగ్రత్త, టీనేజర్లలో పెరిగిపోతున్న డిప్రెషన్ లక్షణాలు

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది