![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Drinking Water: నిలబడి నీళ్ళు తాగితే కీళ్ల నొప్పులు వస్తాయా? ఎలా తాగితే ఆరోగ్యానికి మేలు
నిలబడి నీళ్ళు తాగితే డైరెక్ట్ గా బ్లాడర్ లోకి వెళ్ళి అది దెబ్బతింటుందని కొందరు చెప్తారు. మరికొందరు అజీర్ణ సమస్యలు వస్తాయని అంటారు. వీటిలో ఏది నిజం.
![Drinking Water: నిలబడి నీళ్ళు తాగితే కీళ్ల నొప్పులు వస్తాయా? ఎలా తాగితే ఆరోగ్యానికి మేలు Drinking Water While Standing Causes Arthritis Drinking Water: నిలబడి నీళ్ళు తాగితే కీళ్ల నొప్పులు వస్తాయా? ఎలా తాగితే ఆరోగ్యానికి మేలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/86bccf85c8e02507e4efe5403c8fdde01687853425283521_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మనలో చాలా మందికి ఉన్న అలవాటు నిలబడి నీళ్ళు తాగడం. కానీ ఎక్కువ మంది చెప్పే మాట నిలబడి నీళ్ళు తాగకూడదు కూర్చుని తాగమని. నిల్చుని నీళ్ళు తాగితే జీర్ణ సమస్యలు వస్తాయని అది నాడీ వ్యవస్థని కూడా నాశనం చేస్తుందని చెప్తారు. అంతే కాకుండా నిలబడి నీళ్ళు తాగితే శరీరంలోకి వేగం పెరుగుతుంది. ఇది ఒక విధంగా ఆరోగ్యానికి హానికరమని చెప్తారు.
ఆయుర్వేదం ఏం చెప్తోంది?
నీళ్ళు తాగే విషయంపై భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. నిలబడి నీళ్ళు తాగితే చాలా శక్తి, వేగంతో శరీరంలోకి ప్రవేశించి కడుపులోకి పడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలోని ద్రవాల సమతుల్యతను దెబ్బతీస్తుంది. అజీర్ణానికి కారణమవుతుంది. అందుకే కూర్చుని నీళ్ళు తాగితే శరీరానికి మేలు చేరుకూరుతుందని చెప్తున్నారు.
కీళ్ల నొప్పులు వస్తాయ్
నిలబడి నీటిని తాగడం వల్ల కీళ్ల ప్రాంతాల్లో నీరు చేరడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయని ఆయుర్వేద నిపుణులు కూడా తెలిపారు. ద్రవాల సమతుల్యత దెబ్బతిని టాక్సిన్స్ చేరడం పెరుగుతుంది. ఇది ఆర్థరైటిస్ సమస్యల్ని ప్రేరేపిస్తుంది.
అవన్నీ అపోహలే
ఈ విషయం మీద వచ్చే వాదనలు అన్నీ కేవలం అపోహలు మాత్రమేనని కొంతమంది వైద్యులు కొట్టి పడేస్తున్నారు. నిలబడి లేదా కూర్చుని నీళ్ళు తాగడం వల్ల ఎటువంటి సమస్యలు రావు. కానీ పడుకుని మాత్రం నీళ్ళు తాగకూడదని అంటున్నారు.
నీరు తాగినప్పుడు ఏం జరుగుతుంది?
నీరు తాగేటప్పుడు నిలబడినా లేదా కూర్చున్నా కూడా అవి ఒకే విధంగా శరీరంలోకి శోషించబడతాయి. ఇవి చిన్న పేగు గోడ ద్వారా వేగంగా శోషించబడతాయి. శోషించబడిన నీరు శరీర ద్రవ విభాగాలకు పంపిణీ చేయబడుతుంది. ఇంట్రాక్యులర్ లోకి 66 శాతం, ఇంటరెస్టిటల్ లోకి 25.5 శాతం, బ్లడ్ వాల్యూమ్ లోకి 8.5 శాతం చేరతాయి. ఈ ప్రక్రియ అనంతరం వ్యర్థాలు మూత్రపిండాల ద్వారా విసర్జించబడతాయి.
హైడ్రేట్ గా ఉండాలి
నీరు ఎలా తీసుకున్నామన్నది ముఖ్యం కాదు వాటిని ఎంత తీసుకుంటున్నామనే దాని మీద దృష్టి పెట్టాలి. అనేక శారీరక విధులకు నీరు అవసరం. నిర్జలీకరణానికి త్వరగా చికిత్స చేయకపోతే శరీరానికి తీవ్రమైన కోలుకోలేని నష్టం వాటిల్లుతుంది. రోజుకి కనీసం 3 లీటర్ల నీటిని తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలా అని అతిగాను నీటిని తీసుకోకూడదు. ఒక వేళ నీటిని తీసుకోలేకపోతే వాటికి ప్రత్యామ్నాయంగా ఇతర ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు. కొబ్బరి నీళ్ళు, ఇంట్లో తయారు చేసుకున్న తాజా పండ్ల రసం, నిమ్మరసం, స్మూతీస్ వంటి వాటిగా ద్రవ పదార్థాలు చేర్చుకోవచ్చు. ఇవి కూడా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు దోహదపడతాయి. శరీరం నిర్జలీకరణానికి గురైతే చర్మం కూడా అందవిహీనంగా కనిపిస్తుంది. అందుకే వీలైనంత వరకు హైడ్రేట్ గా ఉండాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఈ లీన్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తిన్నారంటే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)