అన్వేషించండి

Dengue: డెంగ్యూకు ‘కోవిడ్’ ఎఫెక్ట్ - ఆ ప్రమాదాన్ని పెంచేస్తున్న కరోనా వ్యాక్సిన్స్?

మీరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా, లేదా మరో రూపంలో యాంటీబాడీస్‌ను అతిగా తీసుకున్నారా? అయితే, మీకు డెంగ్యూ వస్తే ప్రమాదమే.

కోవిడ్19 ప్రపంచాన్ని ఎన్ని విధాలుగా చిత్రహింసలకు గురించేసిందో తెలిసిందే. అయితే, దాని నుంచి ప్రజలను కాపాడేందుకు పరిశోధకులు యుద్ధప్రాతిపదికన.. వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చారు. దానివల్ల ఎంతో మంది ప్రాణాలతో బయడపడ్డారు. కోవిడ్ వ్యాప్తికి కూడా అడ్డుకట్ట పడింది. అయితే, కోవిడ్ తగ్గినా.. దానివల్ల చాలా రకాల అనారోగ్యాలు ప్రజలను వెంటాడుతున్నాయి. కేవలం కోవిడ్ మాత్రమే కాదు.. దాన్ని కంట్రోల్ చేయడం కోసం వాడిన యాంటిబాడీస్, వ్యాక్సిన్స్ వల్ల కూడా కొన్ని సమస్యలు వెంటాడుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా డెంగ్యూ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. చాలామంది తీవ్రమైన అనారోగ్యానికి గురికావడమే కాకుండా.. మరణాలు సంఖ్య కూడా పెరిగింది. దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కారణాలను తెలుసుకొనే ప్రయత్నంలో పరిశోధకులు ఉన్నారు. ఈ సందర్భంగా ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (THSTI)లో భారతీయ శాస్త్రవేత్తలు ఇటీవల పలు కీలక విషయాలను తెలుసుకున్నారు. కోవిడ్ యాంటీబాడిస్ ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో వివరించారు. కోవిడ్ యాంటీబాడిస్.. డెంగ్యూ వైరస్ సైరోటైప్‌తో క్రాస్-రియాక్ట్ చేయగలవని తెలుసుకున్నారు. 

తాజా లెక్కల ప్రకారం.. 1996 నుంచి ఇప్పటివరకు డెంగ్యూ కేసులు ఏకంగా 1,312 శాతం వరకు పెరిగినట్లు అధ్యయనంలో తేలింది. మరణాలకు కారణం.. డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్, డెంగ్యూ షాక్ సిండ్రోమ్‌లే కారణమని తెలిసింది. 2012కు ముందు ఇండియాలో డెంగ్యూకు చెందిన DENV 1, DENV 3 ఉనికిలో ఉండేవి. ఇటీవల DENV 2 ఆధిపత్యం చూపుతోందని పరిశోధకులు వెల్లడించారు. ఇదివరకు పెద్దగా ప్రభావం చూపని DENV 4 కూడా యాక్టీవ్‌గా ఉన్నట్లు గణంకాలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా ఇది సౌత్ ఇండియాలోనే ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు తెలిసింది. 

THSTIకు చెందిన సుమారు 24 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. SARS-CoV-2 నివారణకు పనిచేసిన యాంటీబాడీస్.. డెంగ్యూకు కారణమయ్యే వైరస్ సెరోటైప్ DENV-2తో క్రాస్ రియాక్ట్ అయినట్లు తెలుసుకున్నారు. యాండీబాడీ మెరుగయ్యే కొద్ది ఇన్‌ఫెక్షన్ పెరుగుతుందని తెలిపారు. డెంగ్యూ వ్యాధి నివారణ ఇప్పటికీ పెద్ద సవాలే. పైగా.. డెంగ్యూ మరింత ప్రాణాంతకంగా మారుతోంది. పైగా ఇప్పుడు కోవిడ్ యాంటీబాడీస్.. వల్ల అది మరింత భయానకంగా మారడం కలవరపరుస్తోంది.

డెంగ్యూ లక్షణాలు

⦿ అధిక జ్వరం
⦿ తలనొప్పి
⦿ కళ్ళు నొప్పులు
⦿ వికారం
⦿ కీళ్ల నొప్పులు
⦿ అలసట

ఇవి సుమారు ఐదు రోజుల పాటు ఉంటాయి. లక్షణాలు కనిపించగానే చికిత్స తీసుకోకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పీరియడ్ ముగిసే సమయానికి బీపీ పడిపోయి క్రిటికల్ కండిషన్ కి వెళతారు. ఊపిరితిత్తులు, పొత్తికడుపులో ద్రవం పేరుకుపోతుంది. దద్దుర్లు అభివృద్ధి చెందుతాయి. కొంతమంది రోగుల్లో రక్తస్రావం కూడా జరుగుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే రోగిని అత్యవసరంగా హాస్పిటల్ లో చేర్పించాలి. లేదంటే ప్రాణానంతకం కావచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వైద్యులు చెప్పిన విధంగా చేస్తే డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్ లో చేరాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఒకవేళ ఈ పరిస్థితులు తలెత్తితే మాత్రం తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి.

హాస్పిటల్ లో ఎప్పుడు చేరాలి?

⦿  రోగి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుంటే
⦿  నిరంతర వాంతులు, అధిక జ్వరం
⦿  రోగికి రక్తస్రావం జరిగి పాలిపోయినట్టుగా కనిపించినప్పుడు
⦿ రోగి అవయవాలు చల్లగా మారిపోయి చలిగా అనిపించినప్పుడు
⦿ రక్తంలోని ప్లేట్‌లెట్స్ 40 వేలు కంటే బాగా తగ్గినప్పుడు

Also Read: హైపర్ అసిడిటీని తగ్గించే ఆయుర్వేద ఆహార పదార్థాలు ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Embed widget