అన్వేషించండి

Earbuds: కాటన్ బడ్స్‌తో చెవులు శుభ్రం చేసుకుంటే అలా జరుగుతుందా?

ఇయర్ బడ్స్ తో చెవులు శుభ్రం చేసుకుంటే మంచిది అనుకుంటారు కానీ అది చెప్పలేనంత హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చెవులను శుభ్రం చేసుకోవాలని అనుకుంటే ఎక్కువ మంది ఎంచుకునే ఆప్షన్ కాటన్ ఇయర్ బడ్స్ తో క్లీన్ చేసుకోవడం. కానీ ఇది ఒక్కొసార శాశ్వతంగా వినికిడి శక్తి కోల్పోయేలా చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సున్నితమైన, ముఖ్యమైన అవయవాల్లో చెవులు ఒకటి. వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి లేదంటే ఇన్ఫెక్షన్ బారిన పడిపోతాయి. చెవిలో ఏర్పడే గులిమి తొలగించుకునేందుకు పిన్నీసులు, ఇతర సన్నని వస్తువులు చెవిలో పెట్టేసి తిప్పేస్తు ఉంటారు. అది ఉండటం వల్ల చెవులు ఇన్ఫెక్షన్ కి గురవుతాయని అనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే. గులిమి తీసేందుకు కాటన్ బడ్స్ వాడితే అది మంచి కంటే ఎక్కువ హాని చేస్తుంది.

కాటన్ బడ్స్ ఏ విధంగా హాని చేస్తాయి?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కాటన్ బడ్స్ తరచుగా వినిపయోగించడం వల్ల గులిమి బయటకి రాకపోగా మరింత లోపలికి వెళ్ళిపోతుంది. జిగటగా మెత్తగా ఉండే ఈ పదార్థం గట్టిగా మారిపోయి అడ్డంకిగా మారవచ్చు. దీని వల్ల వినికిడి లోపం లేదంటే శాశ్వతంగా వినిపించకపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ గుమిలి వల్ల చెవిపోటు వస్తుంది. దీనివల్ల విపరీతమైన నొప్పి, ఇన్ఫెక్షన్ వస్తుంది. సున్నితమైన ఈ ప్రాంతంలో గట్టి వస్తువులు పెట్టడం వల్ల రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది. దీన్ని ఎదుర్కోవడం కష్టం. ఒక్కోసారి అంతర్గత గాయాలు ఏర్పడతాయి.

చెవి ఇన్ఫెక్షన్ లక్షణాలు

⦿ చెవి పోటు

⦿ చెవిలో రింగింగ్ శబ్దాలు

⦿ వినికిడి మందగించడం

⦿ చెవి నుంచి దుర్వాసన

⦿ తరచూ మైకం

⦿ దీర్ఘకాలిక దగ్గు

చెవులకు గుమిలి అవసరమేనా?

చెవుల్లోకి దుమ్ము, బ్యాక్టీరియాయ, ఇతర సూక్ష్మ క్రిములు, చిన్న వస్తువులు లోపలికి పోకుండా ఉండేందుకు గుమిలి సహాయపడుతుంది. స్విమ్మింగ్ చేసేటప్పుడు, స్నానం చేసేటప్పుడు నీరు లోపలికి పోకుండా అడ్డుకోవడంలో ఇది రక్షణ గోడలా పని చేస్తుంది. అందుకే చెవిలో ఉండే వ్యాక్స్ వదిలించుకోవాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో ఇయర్ వాక్స్ దాన్ని అదే సహజంగా శుభ్రం చేసుకుంటుంది. దాన్ని ప్రత్యేకంగా తీసివేయాల్సిన అవసరం లేదు. హార్వర్డ్ హెల్త్ అసోసియేషన్ ప్రకారం చెవిలో గులిమి ఉంటే అది అనారోగ్యకరమని అర్థం కాదు.

⦿ ఇది సహజమైన మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. చెవి లోపల చర్మం పొడిగా మారకుండా చేస్తుంది.

⦿ చెవిలోకి చేరే దుమ్ము, ధూళిని పోకుండా అడ్డుకుంటుంది.

⦿ డెడ్ స్కిన్ సెల్స్, చెత్త పోకుండా నిలువరిస్తుంది.

కాటన్ బడ్స్ ఉపయోగించకుండా చెవులు శుభ్రం చేసుకోవడం ఎలా?

తడి వస్త్రంతో క్లీనింగ్

కాటన్ బడ్స్ గులిమిని లోపలికి నెట్టేస్తాయి. అందుకే వాటిని చెవి వెలుపల మాత్రమే శుభ్రం చేసుకునేందుకు ఉపయోగించాలి. చెవి లోపల ప్రదేశాన్ని క్లీన్ చేసుకునేందుకు తడి లేదా వెచ్చని వస్త్రంతో తుడవడం మంచిది.

క్లీనింగ్ డ్రాప్స్

చెవులని క్లీన్ చేసేందుకు మార్కెట్లో ఓవర్ ది కౌంటర్ క్లీనింగ్ డ్రాప్స్ అందుబాటులో ఉన్నాయి. సహజమైన ఉత్పత్తులతో వీటిని తయారు చేస్తారు. వీటిని చెవులో వేసుకుంటే క్లీన్ అయిపోతాయి.

బల్బ్ సిరంజ్

సిరంజ్ ఉపయోగించి చెవిలో నీటిని పంపించొచ్చు. ఈ నీటితో చెవులు శుభ్రపడతాయి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: మహిళలూ మీ వయసు 30 దాటిందా? ఎముకలు బలంగా ఉండాలంటే వీటిని తప్పకుండా తినండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Embed widget