అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Rice Water: అప్పుడప్పుడు గంజి వచ్చేలా అన్నాన్ని వండండి, ఆ గంజిని తాగితే ఈ సమస్యలు దూరం

ఒకప్పుడు గంజిని అధికంగా తాగేవారు. ఇప్పుడు దాదాపు తాగడం మానేశారు.

ఒకప్పుడు గంజి పద్ధతిలోనే అన్నాన్ని వండేవారు. కాబట్టి రోజుకు రెండు పూటలా గంజి వచ్చేది. ఆ గంజిని తాగే వారి సంఖ్య అప్పట్లో ఎంతోమంది. గంజిలో కాస్త మజ్జిగ, ఉప్పు కలుపుకొని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతారు. ఆయుర్వేదం కూడా ఇదే విషయాన్ని నిర్ధారిస్తోంది. ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం బియ్యంతో వండే గంజి వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఎన్నో అందుతాయి. ఆయుర్వేదంలో ఈ గంజినీటిని ‘తందులోదక’ అని పిలుస్తారు. ఇది మన చర్మానికి, రోగనిరోధక వ్యవస్థకు, శరీరంలోని ఎలక్ట్రోలైట్ల సమతుల్యతకు గంజి చాలా అవసరం. మహిళల్లో చాలా సమస్యలకు గంజి చెక్ పెడుతుంది. మూత్ర విసర్జన సమయంలో మంట వస్తున్నా, రక్తస్రావం అవుతున్నా, విరోచనాలు అవుతున్నా, గంజిని తాగడం వల్ల త్వరగా ఆరోగ్యం లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గంజి నీటిని రోజుకొకసారి తాగడం చాలా మంచిది. ముఖ్యంగా శరీరం డీహైడ్రేషన్ బారిన పడినప్పుడు గంజినీరు తాగితే త్వరగా కోలుకుంటారు.

అన్నాన్ని వార్చే పద్ధతిలో వండుకోలేని వారు, ప్రత్యేకంగా గంజి కోసం కొంచెం బియ్యాన్ని వండుకోవడం ఉత్తమం. గుప్పెడు బియ్యాన్ని తీసుకొని ఒక గిన్నెలో వేసి, దానికి రెండు గ్లాసుల నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టాలి. బాగా ఉడికించి తెల్లటి చిక్కటి ద్రవం వచ్చేవరకు ఉంచాలి. తర్వాత వడకట్టి ఆ గంజిని తాగేయాలి. గంజినీరు ముతక బియ్యంతో చక్కగా వస్తుంది. బాస్మతి బియ్యం వాటితో గంజినీరు అంత ఎక్కువగా రాదు. బ్రౌన్ రైస్‌తో కూడా తీసుకోవచ్చు. పాలిష్ చేయని బియ్యం అయితే ఆరోగ్యకరమైన గంజినీరు తయారవుతుంది. పిల్లలకు దీన్ని తాగిపించడం ఎంతో మంచిది.

గంజినీరు చర్మానికి, జుట్టుకు ఎంతో పోషణ అందిస్తుంది. ఆ గంజినీటిని తాగడమే కాదు, జుట్టుకు, చర్మానికి రాసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. లుకోరియా సమస్యతో బాధపడే ప్రతి మహిళ  గంజినీరును తాగాలి. లుకోరియా సమస్య బారిన పడిన మహిళల్లో వైట్ డిస్చార్జ్ అధికంగా అవుతుంది. మూత్ర విసర్జనలో మంట వస్తున్న వారు కూడా గంజినీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. నిజానికి గంజి ఒక ఒక ఎనర్జీ డ్రింక్. బలహీనంగా, నీరసంగా, అలసటగా ఉన్నప్పుడు ఈ గంజినీరు తాగితే మీకు శక్తి లభిస్తుంది. మీ శక్తి స్థాయిలను పెంచడంలో కూడా గంజినీరు ఎంతో ఉపయోగపడుతుంది. దగ్గు, జలుబుతో బాధపడే వారు కూడా గంజి నీటిని తాగడం అలవాటు చేసుకుంటే మంచిది. 

Also read: మెంతి ఆకులు వేసి బంగాళదుంప కూర ఇలా వండారంటే, ఎవరైనా సరే మొత్తం తినేస్తారు

Also read: డయాబెటిస్ ఉన్నవారు కచ్చితంగా వీటిని ఏదో ఒక పూట తినాల్సిందే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
Embed widget