Colon Cleanse at Home : బరువు తగ్గడంతో పాటు, ఆరోగ్యానికి మేలు చేసే కోలన్ క్లెన్సింగ్.. ఇంటి చిట్కాలతో శుభ్రంగా చేసుకోండిలా
How to Clean Stomach Naturally at Home : కోలన్ క్లెన్సింగ్ చేస్తే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు నిపుణులు. అయితే గట్ హెల్త్ కోసం ఈ కోలన్‌ని సహజంగా ఇంట్లోనే ఎలా డిటాక్స్ చేయాలో చూసేద్దాం.

Colon Cleanse : కోలన్. దీనినే పెద్ద పేగు అంటారు. అయితే దీనిని శుభ్రపరచుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. బరువు తగ్గడంతో పాటు.. గట్ హెల్త్‌ని ప్రమోట్ చేసుకునేందుకు పెద్దపేగును శుభ్రం చేసుకోవాలని చెప్తున్నారు. ఇంతకీ కోలన్‌ని ఎందుకు క్లెన్స్ చేసుకోవాలి? దీనివల్ల కలిగే లాభాలు ఏంటి? సహజంగా ఇంట్లోనే దీనిని ఎలా శుభ్రం చేసుకోవచ్చో.. నిపుణులు ఇచ్చే సూచనలు ఏంటో తెలుసుకుందాం.
కోలన్ క్లెన్సింగ్ ఎందుకు అవసరమంటే..
- పెద్దపేగును శుభ్రం చేసుకోవడం వల్ల మెరుగైన జీర్ణక్రియ సొంతమవుతుంది. పెద్దపేగులో టాక్సీన్లు, వేస్టేజ్ ఉంటే.. శరీరానికి పోషకాలు అందవు. దీనిని క్లెన్సింగ్ వల్ల ఈ సమస్య తప్పుతుంది. అలాగే కడుపు ఉబ్బరం, ఫటిగో తగ్గుతుంది.
- బరువు తగ్గడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. మెటబాలీజంను పెంచి.. శరీరంలో నీటి స్టోరేజ్‌ని కంట్రోల్ చేస్తుంది. మంటను, ఇన్ఫ్లమేషన్ను తగ్గించి.. హెల్తీ గట్ను ప్రమోట్ చేస్తుంది.
పెద్దపేగును ఎలా శుభ్రం చేసుకోవచ్చంటే..
ఫైబర్ : ఫైబర్ కలిగిన ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, పప్పులు, తృణ ధాన్యాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పెద్ద పేగులోని టాక్సీన్లను బయటకు పంపడంలో హెల్ప్ చేస్తుంది.
హైడ్రేషన్ : హైడ్రేటెడ్‌గా ఉంటే కూడా పెద్దపేగులోని మలినాలు బయటకు పోతాయి. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగడంతో పాటు.. హెర్బల్ టీలు కూడా తీసుకోవచ్చు. ఇవి మీకు శక్తిని అందించి హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి.
ప్రోబయోటిక్స్ : ప్రోబయోటిక్స్ ఉండే ఫుడ్స్ కూడా పెద్దపేగును శుభ్రపరచడంలో హెల్ప్ చేస్తుంది. యోగర్ట్, పెరుగు, మజ్జిగ, కించి వంటివాటిలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి.
స్వీట్స్, సాల్ట్, ఫ్యాటీ ఫుడ్స్‌కి వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి శరీరంలోకి వెళ్లి పెద్ద పేగులో టాక్సిన్లుగా పేరుకుపోతాయి. కాబట్టి ఇలాంటి ఫుడ్‌ని అవాయిడ్ చేయాలి.
క్లెన్సింగ్ కోసం.. వీటిని తీసుకోవచ్చు..
- నిమ్మరసం, అల్లం రసాన్ని సమానంగా తీసుకోవాలి. నీటిలో కలిపి షాట్‌గా తాగేయాలి. ఇది కోలన్ క్లెన్సింగ్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తుంది.
- యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఒక టేబుల్ స్పూన్ తీసుకుని.. దానిని ఓ గ్లాస్ వాటర్ కలిపి తాగినా మంచి ఫలితాలు ఉంటాయి.
- ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణాన్ని ఆరోగ్యప్రయోజనాల కోసం తీసుకుంటారు. అలాగే పెద్ద పేగును క్లీన్ చేయడం కోసం కూడా దీనిని తీసుకోవచ్చు. 1 టీస్పూన్ త్రిఫల చూర్ణాన్ని నీటిలో కలిపి తాగితే పెద్ద పేగు క్లీన్ అవుతుంది.
- పెప్పర్మెంట్ టీ, చమోలీ టీ, అల్లం టీ వంటి హెర్బల్ టీలు కూడా పెద్ద పేగును క్లీన్ చేయడంలో హెల్ప్ చేస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..
మీరు పెద్ద పేగును క్లెన్స్ చేసుకోవాలనుకున్నప్పుడు, దానికోసం డైట్లో కొత్త ఫుడ్స్ చేర్చుకునేలా ఉంటే.. కచ్చితంగా వైద్యుల సహాయం తీసుకోవాలి. నిపుణుల సలహా తీసుకుని ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి.
Also Read : పీరియడ్స్‌లో ఆ ఫుడ్స్ తింటున్నారా? స్వీట్లు, ఐస్‌క్రీమ్, చిప్స్, స్పైసీఫుడ్స్.. వామ్మో అవి తింటే అంత డేంజరా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

