అన్వేషించండి

Cancer Facts For Men : ఆడవారి కంటే మగవారికే ఆ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువట.. లక్షణాలు ఇవే

Colon Cancer Causes : పెద్దపేగు క్యాన్సర్ ఆడవారి కంటే మగవారిలోనే ఎక్కువగా వస్తుంది. అసలు ఈ క్యాన్సర్​ లక్షణాలు ఏమిటి? ఎందువల్ల ఇది వస్తుంది?

Colon Cancer Symptoms : అన్ని రకాల క్యాన్సర్​ల మాదిరిగానే.. పెద్దపేగు క్యాన్సర్​ కూడా కణాలు పెరగడం ద్వారానే సంభవిస్తుంది. క్యాన్సర్ కణాలు పెద్దపేగు, పురీషనాళంలో నియంత్రణ లేకుండా పెరిగినప్పుడు ఈ క్యాన్సర్ వస్తుంది. ఈ పెద్దపేగు క్యాన్సర్​ను కొలొరెక్టల్ క్యాన్సర్ అని కూడా అంటారు. 23 మంది పురుషులలో ఒకరికి, 25 మందిలో మహిళలో ఒకరు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారని అంచనా. ఈ క్యాన్సర్​ దశ, రకాన్ని బట్టి చికిత్సలు ఉంటాయి. మరి ఈ క్యాన్సర్  లక్షణాలు, చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

పెద్దపేగు క్యాన్సర్ దశలు

ఈ క్యాన్సర్​ను గుర్తించడానికి వైద్యులు వివిధ దశల ద్వారా గుర్తిస్తారు. ఆ దశలకు అనుగుణంగా చికిత్సలు చేస్తారు. ఇది వారి చికిత్స ప్రణాళికను నిర్ణయించడంలో హెల్ప్ చేస్తుంది. దీనిలో 5 దశలు ఉంటాయి. మొదటి దశను కార్సినోమా ఇన్​ సిటు అని పిలుస్తారు. ఈ దశలో అసాధారణ కణాలు పెద్దపేగు లేదా పురీషనాళం లోపలి పొరల్లో మాత్రమే ఉంటాయి. తర్వాతి దశలంలో క్యాన్సర్ పెద్ద పేగు లేదా పురీషనాళంలోని లైనింగ్ లేదా శ్లేష్మ పొరలోకి చొచ్చుకుపోయి కండరాల పొరలోకి పెరిగి పోతుంది. ఇది సమీపంలోని శోషరస కణుపులకు, శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. 

మూడో దశలో క్యాన్సర్ పెద్ద పేగు లేదా పురీషనాళం గోడలకు కణజాలాలను వ్యాపిస్తుంది. కానీ శోషరస కణుపులను ప్రభావితం చేయదు. నాల్గొవ దశలో క్యాన్సర్ శోషరస కణుపులను ఇస్తుంది కానీ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించదు. చివరి దశలో క్యాన్సర్ కాలేయం, ఊపిరితిత్తుల వంటి అవయవాలకు వ్యాపిస్తుంది. 

లక్షణాలు

పెద్దపేగు క్యాన్సర్​ లక్షణాలు ప్రారంభదశలో గుర్తించడం కష్టం. కానీ తర్వాత మలబద్ధకం, అతిసారం, మలం రంగులో మార్పులు, మలంలో రక్తం, పురీషనాళం నుంచి రక్తస్రావం, కడుపు ఉబ్బరం, తిమ్మిరి, పొత్తి కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఒకటి లేదా రెండు వారాల కంటే ఎక్కువగా ఉంటే వైద్యుడిని కచ్చితంగా సంప్రదించాలి. అలసట, బలహీనతం, బరువు తగ్గడం, నెలకంటే ఎక్కువ కాలం మలంలో మార్పులు, పేగులు నిండుగా ఉన్న భావన, వాంతులు కూడా వీటి లక్షణాలే. కాలేయం, ఊపిరి తిత్తులకు క్యాన్సర్ వ్యాపిస్తే కామెర్లు, చేతులు, కాళ్లలో వాపు, శ్వాసలో ఇబ్బందులు, దీర్ఘకాలిక తలనొప్పివంటి లక్షణాలు కనిపిస్తాయి. 

కారణాలు

పెద్దపేగు క్యాన్సర్​కు గల కారణాలపై పరిశోధకులు ఇంకా అధ్యయనం చేస్తున్నారు. ఇది జన్యు ఉత్పరివర్తనాల వల్ల సంభవించవచ్చు. వారసత్వంగా కూడా రావొచ్చు. వీటివల్లే క్యాన్సర్ వస్తుందని చెప్పలేము కానీ.. వీటి వల్ల వచ్చే ప్రమాదం ఎక్కువ. 

ప్రమాద కారకాలు

కొన్ని కారకాలు పెద్దపేగు క్యాన్సర్​ను అభివృద్ధి చేస్తాయి. మీ వయసు, కుటుంబ ఆరోగ్య చరిత్ర వంటివి పెద్ద పేగు క్యాన్సర్ మీద ప్రభావం చూపిస్తాయి. 50 ఏళ్లు కంటే ఎక్కువ వయసు, పేగు వ్యాధులు, కొలొరెక్టల్​ క్యాన్సర్, జన్యుపరమైన సిండ్రోమ్​లు కలిగి ఉండటం వంటివి ప్రమాదకారకాలుగా చెప్పవచ్చు. అధిక బరువు, ఊబకాయం, ధూమపానం, మద్యపానం విపరీతంగా చేయడం, డయాబెటిస్ టైప్​ 2, నిశ్చలమైన జీవన శైలిని ఈ క్యాన్సర్​ను ప్రభావితం చేస్తుంది. 

నివారణ

పెద్దపేగు క్యాన్సర్​ను జీవనశైలిలో మార్పులతో నివారించవచ్చు. లేదంటే ఈ వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. రెడ్ మీట్​కి దూరంగా ఉంటూ.. ప్రాసెసె చేసిన ఫుడ్స్​కి దూరంగా ఉండాలి. మొక్కల ఆధారిత ఫుడ్స్ తీసుకోవడం మంచిది. ఫ్యాట్ ఫుడ్స్ తగ్గించడం, వ్యాయామం చేయడం, మధుమేహాన్ని కంట్రోల్​లో ఉంచుకోవడం, బరువు తగ్గడం, స్మోకింగ్-డ్రింకింగ్ వ్యసనాలకు దూరంగా ఉండడం వల్ల ఈ క్యాన్సర్ అదుపులో ఉంటుంది. పలు చికిత్సలతో దీనిని కంట్రోల్ చేయవచ్చు.

Also Read : HPV వ్యాక్సిన్ కేవలం అమ్మాయిలకే కాదు.. అబ్బాయిల్లో ఆ క్యాన్సర్ రాకుండా దీనిని తీసుకోవాలట

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
PM Modi US Tour: జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
Lagacharla Incident: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Embed widget