అన్వేషించండి

Cold Shower Study: చన్నీటితో స్నానం చేస్తే బరువు తగ్గుతారా? తాజా అధ్యయనం ఏం చెప్పిందో చూడండి!

మన పూర్వికులు తీవ్రమైన చలిలో సైతం చన్నిటి స్నానమే చేసేవారు. మన పెద్దలు ఫిట్‌గా ఉండటానికి కారణం కూడా ఇదే కావచ్చు.

రోజూ మీరు వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా? లేదా చన్నీళ్లతోనా? వేడి నీళ్లతో స్నానం చేయడం మంచిదే. అయితే, ఊబకాయంతో బాధపడేవారు చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందుతారట. తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. మరి చన్నీళ్ల స్నానం బరువు తగ్గిస్తుందని చెప్పడానికి ఆధారాలేమిటీ? పరిశోధకులు ఏం చెప్పారు?

మన పూర్వికులు తీవ్రమైన చలిలో సైతం చన్నిటి స్నానమే చేసేవారు. మన పెద్దలు ఫిట్‌గా ఉండటానికి కారణం కూడా ఇదే కావచ్చు. కానీ, ఇప్పుడు దాదాపు అందరి బాత్రూమ్‌లలో గీజర్లు ఉంటున్నాయి. దీంతో చన్నీటి స్నానం చేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఆ చలిని తట్టుకోవడం మా వల్ల కాదని భావిస్తున్నారు. అలాగే, శరీరానికి హాయిగా ఉండాలంటే వేడి నీటి స్నానమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు. దీంతో నిత్యం చన్నీటి స్నానం చేసేవారి సంఖ్య తగ్గిపోతుంది. 

అయితే, తాజా స్టడిలో చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుందని తేలింది. ఈ సందర్భంగా పరిశోధకులు ఎలుకలపై పలు పరిశోధనలు జరిపారు. కొన్ని ఎలుకలకు కొవ్వు పట్టే పాశ్చాత్య ఆహారాన్ని ఇచ్చారు. వాటిలో కొన్నింటిని 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు గల నీటితో స్నానం చేయించారు. మరికొన్నింటిని సాధారణ నీటితో స్నానం చేయించారు. చిత్రం ఏమిటంటే.. మిగతా ఎలుకలతో పోల్చితే చల్లదనానికి గురైన ఎలుక త్వరగా బరువు తగ్గింది. 

Also Read: మెంతులతో మెరుపు తీగలా మారిపోతారు, బరువు తగ్గేందుకు ఇలా చేయండి

ఈ అధ్యయనాన్ని ‘నేచర్ మెటబాలిజం’ అనే జర్నల్‌లో ప్రచురించారు. చలి పెరిగే కొద్ది శరీరం లోపలి నుంచి వేడిని ఉత్పత్తి చేస్తుందని, అది బరువు తగ్గేందుకు సహకరిస్తుందని పరిశోధకులు తెలిపారు. సాధారణ నీరు లేదా వేడి నీటితో స్నానం చేసేవారి శరీరం నుంచి ఉత్పత్తయ్యే వేడి చాలా తక్కువగా ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గే అవకాశాలు తక్కువన్నారు. అయితే, కొన్ని అధ్యయనాలు మాత్రం వేడి నీటి స్నానం బరువు తగ్గేందుకు సహకరిస్తాయని చెబుతున్నాయి. వేడి స్నానం వ్యాయమంతో సమానమని పేర్కొన్నాయి. వీటిలో ఏ నీటితో స్నానం చేయడం వల్ల ఊబకాయులకు మేలు జరుగుతుందనే అంశంపై స్పష్టమైన అధ్యయనం జరిపి ఉంటే బాగుండేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.

Also Read: పావురాలతో శ్వాసకోశ సమస్యలు? వాటితో ఎలాంటి సమస్యలు వస్తాయి?

గమనిక: వివిధ అధ్యయనాలు, వైద్య నిపుణులు, హెల్త్ ఆర్టికల్స్ నుంచి గ్రహించిన కొన్ని వివరాలను మీ అవగాహన కోసం యథావిధిగా అందించాం. ఇది చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్య ఉన్న మీరు డాక్టర్ సలహా, సూచనలు తీసుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Saddula Bathukamma Naivedyam : సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
Fenugreek Water 21 Days : 21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Dondakaya Pachadi : దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Abhijeet Dipke Detained: విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Embed widget