Cold plunging: ఐస్ బాత్ ఆరోగ్యానికి మంచిదా? సెలబ్రిటీస్ చేసే ‘కోల్డ్ ప్లంగింగ్’తో కలిగే ప్రయోజనాలేమిటీ?
Cold plunging: ఈ రోజుల్లో స్పోర్ట్స్ స్టార్స్ నుంచి సినిమా తారల వరకు అందరూ ఐస్ వాటర్ లో మునకేస్తున్నారు. కోల్డ్ పంగింగ్ చాలా ట్రెండ్ లో ఉంది. మరి ఇది నిజంగా కోల్డ్ పంగింగ్ తో ఇన్ని లాభాలు ఉన్నాయా?
ఈ మధ్య చాలామంది సెలబ్రిటీలు ఐస్ బాత్ ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. బాత్ టబ్ నిండా ఐసు ముక్కలు వేసుకుని.. అందులోనే కూర్చుంటున్నారు. సమంత, మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్ వంటి సెలబ్రిటీలంతా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. తాజాగా ‘రాజ రాజ చోర’, ‘రెజీనా’ మూవీస్‌లో హీరోయిన్‌గా నటించిన సునయనా సైతం ఐస్ బాత్‌లో మునకేసింది. ఈ విధానాన్ని ‘కోల్డ్ ప్లంగింగ్’ అంటారు. మరి, దీని వల్ల కలిగే ప్రయోజనాలేమిటీ? మనం కూడా అలా ఐసులో మునగొచ్చా?
‘కోల్డ్ ప్లంగింగ్’ అంటే?: తల నుంచి పాదాల వరకు ఆపాద మస్తకం వీలైనంత వరకు పూర్తిగా ఐస్ వాటర్‌లో మునగడాన్ని కోల్డ్ పంగింగ్ అంటారు. దీనినే ఐస్ బాత్ అని కూడా చెప్పవచ్చు.
ఎలాంటి ప్రయోజనాలు?
శరీరంలో ఇన్ఫ్లమేషన్ లేదా కండరాల నొప్పిని తగ్గిస్తుంది. ముఖ్యంగా వర్కవుట్ తర్వాత ఉండే కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
చాలా కాలంగా వేధిస్తున్న పాత నొప్పులను తగ్గించడం కోల్డ్ పంగింగ్‌తో సులభం అవుతుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. మానసిక స్థితిని కూడా చురుకుగా మారుస్తుంది.
శరీరంలో జీవక్రియల వేగం పెంచుతుంది. అంతేకాదు చలి తట్టుకునే శక్తిని కూడా పెంచుతుంది. కోల్డ్ ప్లంగింగ్ సమయంలో జీవక్రియల వేగం దాదాపు 350 శాతం పెరిగినట్టు గుర్తించారట. శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించే బ్రౌన్ ఫ్యాట్ పెరుగుతుంది. తరచుగా కోల్డ్ ప్లంగింగ్ చెయ్యడం వల్ల క్యాలరీల ఖర్చు పెరిగి బరువు నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
View this post on Instagram
కోల్డ్ ప్లంగింగ్ సురక్షితమేనా?
మరి ఈ కోల్డ్ ప్లంగింగ్ సురక్షితమేనా అని అడిగితే మాత్రం అవును అని చెప్పడం లేదు నిపుణులు. చల్లని నీటిలో మునకవేయడం అనేది ఒకొక్కరిలో ఒక్కోవిధమైన ఫలితాలను ఇస్తుంది. ప్రతి సారీ ఆ ఫలితాలు మంచివిగానే ఉంటాయని చెప్పలేము.
- కొందరిలో హైపోథెర్మియాకు కారణం కావచ్చు. హైపోథెర్మియా అంటే శరీర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పడిపోతాయి. ఇది ఒక్కోసారి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంది.
- చర్మం కూడా చాలా పొడిబారి చిట్లిపొయ్యే ప్రమాదం ఉంది.
- గుండె మీద కూడా ఒత్తిడి పెరగవచ్చు. బీపీ పెరిగే ప్రమాదం ఉంది. మెదడుపై కూడా ఒత్తిడి పెరిగి మూర్ఛపోవం లేదా ఫిట్స్‌కు గురికావచ్చు.
అందరికీ ఇది మంచి ఫలితాలనే ఇస్తుందని చెప్పలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరికి వారు కోల్డ్ ప్లంగింగ్ చెయ్యడం సురక్షితం కాదు. నిపుణుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియను పూర్తి చెయ్యాల్సి ఉంటుంది.
View this post on Instagram
Also Read : పెయిన్ కిలర్స్ వాడితే మగతనం మటాష్? పిల్లలు పుట్టడమూ కష్టమేనా, తాజా అధ్యయనంలో ఏం తేలింది?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.