Cerebral Palsy: సత్యనాదెళ్ల కొడుకును బలితీసుకున్న సెరెబ్రల్ పాల్సీ, ఇదో భయంకరమైన వ్యాధి
పిల్లలకు పుట్టుకతో వస్తుంది సెరెబ్రల్ పాల్సీ. దీనికి చికిత్స కూడా లేదు.
పుట్టుకతోనే పిల్లలకు వచ్చే భయంకరమైన రోగాల్లో సెరెబ్రల్ పాల్సీ ఒకటి. పది మందిలో ఉన్న ఒంటరిని చేసే మహారోగం. కొందరిని నడవనివ్వదు, నవ్వనివ్వదు, చదవనివ్వదు, ఆడనివ్వదు. అసలు ఏ పనిని సక్రమంగా చేయనివ్వదు. మరికొందరి పరిస్థతి మరీ అధ్వానం. పూర్తిగా చక్రాల కుర్చీకే పరిమితం చేస్తుంది. సొంతంగా మెడ కూడా ఎత్తలేరు. ఇలాంటి రుగ్మతతోనే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కొడుకు జైన్ నాదెళ్ల బాధపడుతున్నారు. 26 ఏళ్ల పాటూ సెరెబ్రల్ పాల్సీతో పోరాటం చేసిన ఆయన ఇక పోరాడలేక లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆయన 26 ఏళ్ల పాటూ కేవలం కుర్చీకే పరిమితం అయ్యారు. మెడకు కూడా ప్ర్యతేకంగా సపోర్టు ఇవ్వాల్సి వచ్చింది.
ఎందుకొస్తుంది సెరెబ్రల్ పాల్సీ?
పోలియోను జయించాం కాబట్టి అంగవైకల్యాన్ని జయించామని అనుకున్నాం కానీ, సెరెబ్రల్ పాల్సీ వంటి రుగ్మతల వల్ల ఇంకా అంగవైకల్యం లోకంలో కనిపిస్తూనే ఉంది. సెరెబ్రల్ పాల్సీ వల్ల అంగవైకల్యం, మానసిక వైకల్యం రెండూ ఒకేసారి కలుగుతాయి. ఈ రుగ్మత ప్రపంచంలో ప్రతి వేయి మంది పిల్లల్లో 5 నుంచి 8 మందిలో కనిపిస్తుంది. సెరెబ్రల్ పాల్సీ రావడానికి సరైన కారణం ఇప్పటివరకు తెలియలేదు. కాన్ని కొన్ని పరిస్థితుల వల్ల వచ్చే అవకాశం ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. పిల్లలు నెలలు నిండకుండా పుట్టినా, తక్కువ బరువుతో పుట్టిన కూడా ఇలా సెరెబ్రల్ పాల్సీ బారిన పడే అవకాశం ఉంది.గర్భం దాల్చిన సమయంలో ఇన్ఫెక్షన్ వల్ల శిశువు మెదడుకు గాయం అవ్వడం, పిండదశలోనే మెదడు ఎదుగుదల లోపించడం వల్ల కూడా ఈ రుగ్మత వస్తుంది.
సెరిబ్రమ్ అంటే...
మెదడులో ఒక భాగాన్ని సెరిబ్రమ్ అంటారు. మెదడులో ఈ భాగం దెబ్బతినడం వల్ల సెరిబ్రల్ పాల్సీ రావచ్చు. వీరిలో మెదడు శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే వీరు సొంతంగా ఒక్కపని కూడా చేయలేరు. చేతులు, కాళ్లు కూడా కదల్చలేరు. కొందరిలో మాత్రం మెదడు పాక్షికంగా పనిచేస్తుంది. అలాంటి వారు మాట్లాడడం, చేతులు కదడపం వంటివి చేయగలరు.
చికిత్స
ఈ రుగ్మతకు చికిత్స లేదు. అందుకే దీన్ని భయంకరమైన వ్యాధిగా పిలుస్తారు. జీవితాన్ని అలా గడపడమే.
లక్షణాలు
చిన్నపిల్లల్లో సెరెబ్రల్ పాల్సీ లక్షణాలు రెండు మూడేళ్ల వయసుకే బయటపడతాయి. మెడ నిలబడక పోవడం అనేది ఆరేడు నెలల వయసప్పుడే బయటపడుతుంది. వీరికి తమ చేతులు, కాళ్లపై కండరాలపై నియంత్రణ ఉండదు. కొంతమంది నడవగలిగినా సిజర్ వాకింగ్ చేస్తారు. అంటే కత్తెర కాళ్లతో నడుస్తారు. చూపు, మాట తేడాగా ఉంటాయి. కాళ్లు, చేతులు వంకర్లు తిరిగిపోతాయి. నోటిలోనుంచి లాలాజలం ఊరుతూనే ఉంటుంది. కొంతమంది విపరీతంగా కోపం ప్రదర్శిస్తారు.
Also read: భారత పాస్‌పోర్టు ఉంటే చాలు, ఈ దేశాల్లో వీసా లేకుండా హ్యాపీగా తిరిగేయచ్చు
Also read: శివరాత్రి పర్వదినాన ఉపవాసం చేస్తున్నారా? ఈ ఆరోగ్య జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే