Carrot Rice: పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్, తెలివితేటలు పెంచుతుంది
క్యారెట్ ఆరోగ్యానికి ఎంత లాభమో చెప్పక్కర్లేదు. పిల్లలకు మంచి లంచ్ బాక్సు రెసిపీలను తయారుచేయచ్చు క్యారెట్లతో.
పిల్లలకు లంచ్ బాక్సుల్లో రోజూ ఏం పెట్టాలని ఆలోచించే తల్లికి క్యారెట్ రైస్ మంచి ఎంపిక. దీన్ని తినడం వల్ల ఎన్నో పోషక విలువలు కూడా పిల్లల శరీరానికి అందుతాయి. దీన్ని చేయడం చాలా సులువు కాబట్టి వారానికోసారి పిల్లల బాక్సుల్లో దీన్ని చేసి పెట్టచ్చు. అందులోను క్యారెట్లు ఆరోగ్యానికి ఎంత మంచివో చెప్పక్కర్లేదు. క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ రాకుండా ఇవి అడ్డుకుంటాయి. క్యారెట్లలో ఫైబర్, కాల్షియం అధికం. కాబట్టి బరువు కూడా పెరగరు. దీనిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. కంటికి, మెదడుకు చాలా మంచిది. వీటిలో విటమిన్ సి కూడా ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా దీనిలోని గుణాలు కాపాడతాయి. పచ్చి క్యారెట్లను తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది.
కావాల్సిన పదార్థాలు
క్యారెట్ తురుము - అరకప్పు
వండిన అన్నం - ఒక కప్పు
ఉల్లిపాయ తరుగు - పావు కప్పు
పచ్చిమిర్చి - మూడు
జీడిపప్పు - ఆరు
మిరియాల పొడి - చిటికెడు
గరం మసాలా - చిటికెడు
జీలకర్ర - అర టీస్పూను
ఆవాలు - అర టీస్పూను
కరివేపాకు - ఒక రెబ్బ
కొత్తి మీరు తరుగు - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
పసుపు - పావు స్పూను
తయారీ విధానం
1. క్యారెట్ రైస్ కోసం క్యారెట్లను నిలువుగా సన్నగా తరుముకోవాలి. లేదా గుండ్రంగా కోసుకున్న బానే ఉంటుంది. ఎంత సైజు ముక్కలు కోసుకోవాలన్నది మీ ఇష్టం.
2. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు వేసి వేయించాలి.
3. అవి కాస్ల వేగాక ఉల్లి తరుగు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
4. కాస్త పసుపు వేసి కలపాలి. తరువాత క్యారెట్ తురుము కూడా వేసి వేయించాలి.
5. క్యారెట్లు కాస్త వేగాక అందులో మిరియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి.
6. వీటన్నింటినీ బాగా వేయించాలి.
7. ఇప్పుడు వండిన అన్నాన్ని వేసి కలపాలి. పైన కొత్తమీరను చల్లుకోవాలి.
8. అంతే టేస్టీ క్యారెట్ రైస్ సిద్ధం. పిల్లలు ఇష్టంగా తినడం గ్యారెంటీ.
Also read: బిర్యానీ లవర్స్, ఈ రోజు మీరు కచ్చితంగా బిర్యానీ తినాల్సిందే, హ్యాపీ ఫస్ట్ బిర్యానీ డే
Also read: నిద్రలో మాట్లాడడం చిన్న సమస్యేమీ కాదు, అది మానసిక అనారోగ్యానికి సూచన, ఏం చేయాలి?
Also read: సెల్‌ఫోన్లు క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయా? ఈ రెండింటికీ మధ్య లింకేంటి?