అన్వేషించండి

Cardio vs Weights : జిమ్​లో కార్డియో చేస్తే మంచిదా? వెయిట్స్ లిఫ్ట్ చేస్తే మంచిదా? లాభాలు, నష్టాలు ఇవే

Best Fitness Approach : హెల్తీగా ఉండాలంటే కార్డియో చేయాలంటారు. మరికొందరు జిమ్​లో బరువులు లిఫ్ట్ చేస్తే మంచిది అంటారు. మరి ఈ రెండిటీలో ఏది మంచిది? లాభాలు, నష్టాలు ఏంటి?

Exploring the Pros and Cons of Cardio vs Weights : కొత్తగా జిమ్​కెళ్లేవారిలో ఎన్నో సందేహాలు ఉంటాయి. ఎందుకంటే దాని గురించి ముందే రీసెర్చ్ చేసుకుంటారు కాబట్టి. ఇలా కార్డియో చేస్తే మంచిదని ఒకరు చెప్తే.. వెయిట్స్ లిఫ్ట్ చేస్తే మంచిదని మరొకరు చెప్తారు. వాటిని ఫాలో అయిపోయి గుడ్డిగా చేస్తే అసలుకే మోసం వస్తుందంటున్నారు. ఎందుకంటే.. వీటిని చేయడం వల్ల లాభాలు ఉన్నట్లే కొన్ని నష్టాలు కూడా ఉంటాయట. అందుకే.. నిపుణులు వీటివల్ల కలిగే లాభాలు, నష్టాలతో పాటు కొన్ని టిప్స్ ఇస్తున్నారు. అవేంటంటే..

కార్డియోతో కలిగే లాభాలు (Cardio Pros)

రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివన్నీ.. కార్డియో వ్యాయామాలే. కేలరీలు బర్న్ చేసి.. బరువును తగ్గించడంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తాయి. అలాగే రెగ్యూలర్​గా కార్డియో చేస్తే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్, హై బీపీ వంటి ప్రాణాంతక సమస్యలు తగ్గుతాయి. వీటివల్ల శక్తి పెరుగుతుంది. కాబట్టి రోజువారీ పనులను ఈజీగా చేసుకోవచ్చు. ఈ వ్యాయామాల వల్ల ఎండార్ఫిన్​లు విడుదలై.. శరీరంలో ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. 

కార్డియో వల్ల కలిగే నష్టాలు (Cardio Cons)

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కార్డియో వల్ల కూడా కొన్ని నష్టాలు ఉన్నాయట. మజిల్స్ బిల్డ్ చేసుకోవాలనుకునేవారికి ఇవి పెద్ద ఎఫెక్టివ్​గా ఉండవు. కండరాల పెరుగుదల పరిమితంగా ఉంటుంది. కార్డియో వ్యాయామాల వల్ల మోకాలి దగ్గర లేదా షిన్ స్ప్లింట్స్ వంటి గాయాలు కావొచ్చు. లేదా ఉన్న సమస్యలు ఎక్కువ కావొచ్చు. పైగా వీటిని రెగ్యూలర్​గా చేయడం వల్ల బోర్​ కొట్టే అవకాశముంది కాబట్టి.. జిమ్​కి వెళ్లాలన్నా కోరిక తగ్గుతుందట. 

వెయిట్స్ లిఫ్టింగ్ వల్ల కలిగే లాభాలు (Weights Pros)

జిమ్​లో చాలా మంది బరువు ఎత్తేందుకు ట్రై చేస్తారు. ఎందుకంటే మజిల్స్​ని బిల్డ్ చేసుకోవడానికి ఇది బెస్ట్ వే. వెయిట్ లిఫ్టింగ్ కండర ద్రవ్యరాశిని పెంచుకోవడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మెటబాలీజం పెంచుతుంది. ఎముకలు బలపడుతాయి. ఎముకల్లో వచ్చే బోలు వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీవక్రియను పెంచి.. శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. టోన్డ్ బాడీ సొంతమవుతుంది. వెయిట్ లిఫ్టింగ్ వల్ల బలం పెరిగి.. రోజూవారి పనులు ఈజీగా చేసుకోగలుగుతారు. 

వెయిట్ లిఫ్టింగ్ వల్ల కలిగే నష్టాలు (Weights Cons)

బరువులు లిఫ్ట్ చేస్తే మంచిదనే ఉద్దేశంతో ఎక్కువ బరువులు ఎత్తేందుకు ఉత్సాహం చూపిస్తారు. దీనివల్ల కొన్నిసార్లు గాయాలు కావొచ్చు. భారీ బరువు బరువులను ప్రోపర్​ శిక్షణ లేకుండా లిఫ్ట్ చేస్తే పెద్ద గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. వెయిట్ లిఫ్టింగ్​తో గుండె ఆరోగ్యానికి అంత బెనిఫిట్స్ ఉండకపోవచ్చు. వెయిట్​ని సరైన పోస్టర్​లో లిఫ్ట్ చేయకుంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. 

నిపుణుల సలహా ఏంటంటే.. (Experts Suggestions)

కార్డియో, వెయిట్ లిఫ్టింగ్​ వీటిలో ఏది బెస్ట్​ అనేది పక్కన పెడితే.. ఈ రెండింటీని బ్యాలెన్స్ చేసుకుంటూ జిమ్ చేస్తే శరీరానికి చాలా మంచిదంటున్నారు నిపుణులు. హైబ్రిడ్ విధానంలో వీటిని రెగ్యూలర్​గా చేస్తే పూర్తి ఆరోగ్యం సొంతమవుతుందంటున్నారు. కండరాలకు బలం, గుండె ఆరోగ్య మెరుగుపడుతుంది. గాయాల ప్రమాదం తగ్గుతుంది. కొవ్వును కరిగించి కండరాలను పెంచుతుంది. 

ప్లానింగ్ ఎలా ఉండాలంటే.. (Workout Routine)

వారంలో రెండు నుంచి మూడు కార్డియో సెషన్స్ పెట్టుకోవచ్చు. ఇవి 20 నుంచి 30 నిమిషాలు ఉండాలి. వెయిట్ లిఫ్టింగ్ కూడా రెండు లేదా మూడు రోజులు చేయొచ్చు. దీనిని అరగంట నుంచి 40 నిమిషాలు చేయాలి. వారంలో రెండు ఒకటి లేదా రెండు రోజులు విశ్రాంతి తీసుకోవచ్చు. 

ఫాలో అవ్వాల్సి టిప్స్..(Tips to Follow)

వీటిని స్టార్ట్ చేసేప్పుడు స్క్వాట్​లు, డెడ్​ లిఫ్ట్​లు, కండరాల సమూహాలతో చేసే బెంచ్ ప్రెస్ వంటి వ్యాయాలపై దృష్టి పెట్టాలి. HIIT (హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్) చేస్తే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరాన్ని అతిగా ప్రెజర్ చేయొద్దు. అది చెప్పే మాట వినాలి. అంటే అవసరమైనప్పుడు రెస్ట్ ఇవ్వాలి. నీరసం తగ్గిన తర్వాతే.. జిమ్ రోటీన్​ను సెట్​ చేసుకోవాలి. 

Also Read : మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల పెరుగుతోన్న మరణాలు.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Bigg Boss Rohini: రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ
రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ
Telangana: మేం అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూడేవాడివి - కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ఫైర్ !
మేం అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూడేవాడివి - కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ఫైర్ !
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Embed widget