అన్వేషించండి

కొంచెం తింటున్నా కడుపు నిండినట్లు అనిపిస్తోందా? జాగ్రత్త, ప్రాణాంతక వ్యాధి కావచ్చు

త్వరగా గుర్తిస్తే పూర్తిగా చికిత్స సాధ్యపడే క్యాన్సర్లలో ఓవేరియన్ క్యాన్సర్ కూడా ఒకటి. సమయానికి చికిత్స ప్రారంభిస్తే ఈ ప్రాణాంతక వ్యాధిని శాశ్వతంగా తరిమెయ్యడం సాధ్యమే అని నిపుణులు చెబుతున్నారు.

త దశాబ్ద కాలంగా క్యాన్సర్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. రకరకాల క్యాన్సర్ల వల్ల చాలా మంది మరణిస్తున్నారు కూడా. చాలా క్యాన్సర్లకు ప్రత్యేక లక్షణాలు లేకపోవడం వల్లే గుర్తించడంలో ఆలస్యం జరుగుతోంది. నిజానికి క్యాన్సర్‌ను త్వరగా గుర్తిస్తే దాదాపుగా అన్ని క్యాన్సర్లకు చికిత్సలు అందుబాటులో ఉంటాయి. అలా సమయానికి గుర్తించి క్యాన్సర్ ను జయించిన వారు కూడా ఉన్నారు. అందుకే క్యాన్సర్ లో అత్యంత కీలకమైన అంశం సమస్యను గుర్తించడమే. ఎంత త్వరగా గుర్తిస్తే చికిత్స అంత సులభం అవుతుంది. అంతే ప్రభావవంతంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్లను త్వరగా గుర్తించడం చాలా ముఖ్యం. ఈ క్యాన్సర్లను సమయానికి గుర్తిస్తే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

ఓవేరియన్ క్యాన్సర్‌ను గుర్తించడం అంత సులభం కాదు. ఈ క్యాన్సర్ ముదిరిపోయే వరకు పెద్ద లక్షణాలేమీ కనిపించవు. కానీ త్వరగా గుర్తిస్తే పూర్తిగా చికిత్స సాధ్యపడే క్యాన్సర్లలో ఓవేరియన్ క్యాన్సర్ కూడా ఒకటి. ప్రతి రోజు దాదాపు 4వేల మంది ఓవేరియన్ క్యాన్సర్ తో మరణిస్తున్నారు. ఎలాంటి లక్షణాలు కనిపించని ఈ వ్యాధిని త్వరగా గుర్తించడం చాలా కష్టం. కానీ అతి చిన్న మార్పులు కూడా చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి.

కొన్ని సమస్యలు స్త్రీలలో చాలా సాధారణంగా ఉండే అనారోగ్యాల మాదిరిగానే ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి వెన్నునొప్పి. అంతేకాదు రాత్రి భోజనం సమయంలో కనిపించే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఓవేరియన్ క్యాన్సర్ కు సంకేతాలు కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో చూడండి. 

లండన్‌‌కు చెందిన వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. భోజనం చేస్తున్నప్పుడు త్వరగా కడుపు నిండినట్టు అనిపించడం, లేదా ఆకలి మందగించడం వంటివి అండాశయ క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి కావచ్చని అంటున్నారు. ఒక్కోసారి ట్యూమర్ కడుపులోని ఇతర అవయవాల మీద ఒత్తిడి కలుగజేయడం వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయట. అందువల్ల పూర్తి స్థాయిలో భోజనం చేయడం వీలు కాదని అంటున్నారు. ఇలా రెగ్యులర్ గా జరుగుతుంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ ను కలవడం అవసరం అని అంటున్నారు.

కడుపు త్వరగా నిండిన భావన కలగడం అనేది ఒక లక్షణం కావచ్చు. కానీ ఓవేరియన్ క్యాన్సర్‌ను అనుమానించేందుకు మరికొన్ని లక్షణాల గురించి  కూడా అక్కడి నిపుణులు వివరించారు.

⦿ తెలియని ఒక చిన్న నొప్పి కడుపులో నిరంతరాయంగా ఉండడం
⦿ కడుపు ఎప్పుడూ ఉబ్బరంగా ఉన్నట్టు ఉండడం
⦿ తరచుగా అజీర్తి చెయ్యడం
⦿ వెన్నునొప్పి లేదా నడుము నొప్పి
⦿ బవెల్ మూమెంట్స్ లో తేడాలు
⦿ మెనోపాజ్ తర్వాత కూడా రక్తస్రావం కనిపించడం
⦿ విపరీతమైన అలసట
పై లక్షణాలు కూడా మీలో కనిపిస్తే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన్న క్యాన్సర్ కావచ్చని భయపడాల్సిన పనిలేదు. ఇవి మరే ఇతర చిన్నచిన్న అనారోగ్యాల వల్ల కూడా కావచ్చు. కానీ క్యాన్సర్ లో కూడా ఇలాంలాంటి లక్షణాలు కనిపిస్తాయని మాత్రమే నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read : 'కెజియఫ్' మీద కామెంట్స్‌పై వెనక్కి తగ్గని వెంకటేష్ మహా - మంట మీద పెట్రోల్ పోశారా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dil Raju IT Raids: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు- దిల్ రాజు సహా నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఆకస్మిక దాడులు
హైదరాబాద్‌లో ఐటీ సోదాలు- దిల్ రాజు సహా నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఆకస్మిక దాడులు
Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Davos Tour: దావోస్‌లో ఘనంగా గ్రాండ్‌ ఇండియా పెవిలియన్ ప్రారంభం.. హాజరైన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి
దావోస్‌లో ఘనంగా గ్రాండ్‌ ఇండియా పెవిలియన్ ప్రారంభం.. హాజరైన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి
Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు- సీసీటీవీ వీడియో వైరల్
తైవాన్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు- సీసీటీవీ వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mahakumbh Monalisa | కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను కట్టిపడేసింది | ABP DesamKolkata Doctor Murder Case | కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు | ABP DesamCM Chandrababu CM Revanth Met in Davos | దావోస్ లో కలిసిన చంద్రబాబు, రేవంత్ | ABP DesamAkash Puri Helps Pavala Shyamala | సీనియర్ నటి పావలా శ్యామలకు ఆకాశ్ పూరీ ఆర్థిక సాయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dil Raju IT Raids: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు- దిల్ రాజు సహా నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఆకస్మిక దాడులు
హైదరాబాద్‌లో ఐటీ సోదాలు- దిల్ రాజు సహా నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఆకస్మిక దాడులు
Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Davos Tour: దావోస్‌లో ఘనంగా గ్రాండ్‌ ఇండియా పెవిలియన్ ప్రారంభం.. హాజరైన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి
దావోస్‌లో ఘనంగా గ్రాండ్‌ ఇండియా పెవిలియన్ ప్రారంభం.. హాజరైన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి
Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు- సీసీటీవీ వీడియో వైరల్
తైవాన్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు- సీసీటీవీ వీడియో వైరల్
CM Nara Lokesh: డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
Donald Trump : అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
Donald Trump Inauguration: డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
Joe Biden: కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
Embed widget