Venkatesh Maha on KGF : 'కెజియఫ్' మీద కామెంట్స్‌పై వెనక్కి తగ్గని వెంకటేష్ మహా - మంట మీద పెట్రోల్ పోశారా?
Venkatesh Maha apology video : 'కెజియఫ్' సినిమా, అందులో హీరో క్యారెక్టరైజేషన్ మీద వెంకటేష్ మహా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
ప్రశాంత్ నీల్ తీసిన 'కెజియఫ్' ఒక సంచలనం. ప్రపంచ సినిమా వేదికపై కన్నడ చిత్ర పరిశ్రమ సగర్వంగా తలెత్తుకుని నిలబడేలా చేసిన సినిమా. దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి 'బాహుబలి' తర్వాత ఆ స్థాయిలో వచ్చిన సినిమా. దర్శక ధీరుడు రాజమౌళితో పాటు భారీ కమర్షియల్ సినిమాలు తీయగల దర్శకులు, తీసి నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ అనే తేడాలు లేకుండా అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించగల ఉన్నారని నిరూపించిన సినిమా. అటువంటి సినిమా మీద వెంకటేష్ మహా (Venkatesh Maha) కామెంట్స్ చేశారు.
'కెజియఫ్' సినిమా (KGF Movie), అందులో హీరో యశ్ క్యారెక్టరైజేషన్ మీద 'కేరాఫ్ కంచరపాలెం' దర్శకుడు వెంకటేష్ మహా పరోక్షంగా కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలు ఒక్క 'కెజియఫ్' సినిమా అభిమానులను మాత్రమే కాదు, కమర్షియల్ సినిమాలను ప్రేమించే ప్రేక్షకులను బాధించాయి. సోషల్ మీడియా వేదికగా కొంత మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేష్ మహా సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి వెంకటేష్ మహా ఒక వీడియో విడుదల చేశారు. అది మరింత వివాదానికి దారి తీసేలా ఉందని పలువురు నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
భాష విషయంలో సారీ! కానీ...
'కెజియఫ్' సినిమాపై కామెంట్స్ విషయంలో తాను ఉపయోగించిన భాష సరైనది కాదని వెంకటేష్ మహా అంగీకరించారు. క్షమాపణలు కోరారు. అయితే, తాను వ్యక్తం చేసిన అభిప్రాయం పట్ల ఆయన వెనక్కి తగ్గలేదు. ఆ విషయంలో సారీ చెప్పలేదు. తాను తీసిన సినిమాలు, తాను వ్యక్తం చేసిన అభిప్రాయం నచ్చిన వాళ్ళు తనకు సందేశాలు పంపుతున్నారని వెంకటేష్ మహా పేర్కొన్నారు. వాళ్ళందరి తరఫున తాను మాట్లాడానని అన్నారు.
కల్పిత పాత్రపై మాత్రమే కామెంట్ చేశా...
మీరంతా నన్ను కామెంట్ చేస్తున్నారు! - వెంకటేష్ మహా
''నేను ఉపయోగించిన భాష, మాట... ఒక సినిమాలోని కల్పిత పాత్ర మీద. నాకు ఒక క్యారెక్టర్ ప్రాబ్లమెటిక్ అనిపించింది. నా వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తం చేశా. నేను కల్పిత పాత్ర మీద కామెంట్ చేశా. అంతే తప్ప నేరుగా ఏ వ్యక్తినీ ఉద్దేశించి అన్న మాట కాదు. దానిని రియల్ లైఫ్ వ్యక్తికి ఆపాదించి చూడటం అనేది... బహుశా నా అభిప్రాయాన్ని మీరు వింటున్న విధానం వల్ల వచ్చిన సమస్యలా అనిపిస్తుంది. దయచేసి నా అభిప్రాయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. నేను ఒక కల్పిత పాత్రను దూషించాను. రియల్ పర్సన్ అయిన నన్ను ఎంతో అసభ్యంగా దూషించడం, నా ఫోటోలను అసభ్యంగా క్రియేట్ చేయడం వంటివి జరుగుతున్నాయి. ఇది మొదటిసారి కాదు, ఇంతకు ముందు ఎన్నో సార్లు జరిగింది. ఇటువంటి సంఘటనల ఆధారంగా నాకు ఆ అభిప్రాయం ఏర్పడింది. కాబట్టి... నా అభిప్రాయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాను'' అని వెంకటేష్ మహా ఒక వీడియో విడుదల చేశారు.
Also Read : మంచు మనోజ్ భార్యకు ఓ కొడుకు ఉన్నాడని తెలుసా?
'కెజియఫ్' మీద చేసిన కామెంట్స్ విషయంలో వెంకటేష్ మహా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కేవలం భాష విషయంలో మాత్రమే సారీ చెప్పారు. ఆల్రెడీ ఆగ్రహంలో ఉన్న అభిమానులకు ఆయన వ్యాఖ్యలు మరింత ఆగ్రహం తెప్పించాయి. మంట మీద పెట్రోల్ పోసినట్లు అయ్యింది.
Also Read : ఎన్టీఆర్ మనవడి 'బ్రీత్' - డిఫరెంట్ టైటిల్, లుక్‌తో వస్తున్న నందమూరి వారసుడు
— Venkatesh Maha (@mahaisnotanoun) March 6, 2023