By: ABP Desam | Updated at : 05 Mar 2023 09:37 AM (IST)
మంచు మనోజ్, భూమా నాగ మౌనికా రెడ్డి
యువ కథానాయకుడు మంచు మనోజ్ (Manchu Manoj) మళ్ళీ ఓ ఇంటి వాడు అయ్యారు. ఈ నెల 3వ తేదీన... శుక్రవారం రాత్రి 8.30 గంటలకు శుభ ముహూర్తాన భూమా నాగ మౌనిక రెడ్డి (Bhuma Naga Mounika Reddy) మెడలో మూడు ముడులు వేశారు. ఆమెతో ఏడు అడుగులు వేశారు. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో కన్నుల పండుగగా పెళ్లి జరిగింది. అన్నట్టు... ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. మరి, పిల్లల సంగతి ఏంటి?
మౌనికకు ఓ కుమారుడు ఉన్నాడని తెలుసా?
మౌనిక కంటే ముందు లక్ష్మీ ప్రణతిని ప్రేమ వివాహం చేసుకున్నారు మనోజ్. కొన్ని రోజులకు విడాకులు తీసుకున్నారు. వాళ్ళిద్దరికీ పిల్లలు లేరు. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త గణేష్ రెడ్డితో భూమా నాగ మౌనికా రెడ్డి మొదటి వివాహం జరిగింది. ఆ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు ధీరవ్ రెడ్డి. ఇప్పుడు ఆ బాబు బాధ్యతను కూడా మనోజ్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
మనోజ్ - మౌనిక పెళ్లిలో ధీరవ్ స్పెషల్ అట్రాక్షన్
మనోజ్ - మౌనిక పెళ్లిలో ధీరవ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. పెళ్లి తర్వాత మనోజ్ ఓ ఫోటో ట్వీట్ చేశారు. అందులో ముగ్గురి చేతులు ఉన్నాయి. నూతన వధూవరుల చేతిపై ధీరవ్ చేతులు ఉన్నాయి. ఈ ఫోటోకి 'శివుని ఆజ్ఞ' అని మనోజ్ క్యాప్షన్ ఇచ్చారు.
శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా సరే కుట్టదని పెద్దలు చెబుతూ ఉంటారు. తమ పెళ్లి కూడా శివుని ఆజ్ఞతో జరిగిందని చెప్పడం మనోజ్ ఉద్దేశం అయ్యి ఉంటుంది. చిన్నారి చేతులు ఉన్న ఫోటో పోస్ట్ చేయడం ద్వారా అతడిని కూడా తన జీవితంలోకి ఆహ్వానించడమే కాదు, చిన్నారి బాధ్యత తనదేనని చెప్పకనే చెప్పినట్లు అయ్యింది. ఈ పెళ్లికి ముందు కొన్ని పుకార్లు వినిపించాయి. వాటికి పెళ్లి ఫోటోలతో మంచు ఫ్యామిలీ చెక్ పెట్టింది.
శివుని ఆజ్ఞ 🙏🏼❤️ #MWedsM #ManojWedsMounika pic.twitter.com/U5hQ5V9xqL
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 4, 2023
మోహన్ బాబు అశీసులతో...
మనోజ్, మౌనిక ప్రేమకు మనోజ్ తండ్రి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదని పెళ్లికి ముందు ప్రచారం జరిగింది. 'పద్మ శ్రీ' పురస్కార గ్రహీత, కలెక్షన్ కింగ్, డా మోహన్ బాబు తనయుడి నిర్ణయానికి అంగీకారం తెలపలేదని గుసగుసలు వినిపించాయి.
మెహందీ, సంగీత్ వేడుకలకు సైతం మోహన్ బాబు రాలేదని ఫిల్మ్ నగర్ వర్గాల్లో పుకార్లు షికారు చేశాయి. వాటి అన్నిటికీ పెళ్లి ఫొటోలే సమాధానం చెప్పారు. మనోజ్, కొత్త కోడలు మౌనికను మోహన్ బాబు ఆశీర్వదించిన ఫోటోలను మంచు ఫ్యామిలీ విడుదల చేసింది. దాంతో మోహన్ బాబు కోపంగా ఉన్నారనేది అవాస్తం అని తేలింది.
పెళ్ళిలో భూమా ఫ్యామిలీ కూడా!
దివంగత రాజకీయ నాయకులు భూమా నాగి రెడ్డి, భూమా శోభా రెడ్డి దంపతుల రెండో కుమార్తె నాగ మౌనిక. తల్లిదండ్రుల మరణం తర్వాత పిల్లల మధ్య ఆస్తి విషయంలో గొడవలు ఉన్నాయని రాయలసీమ రాజకీయ వర్గాల కథనం. ఆ గొడవలు పక్కన పెడితే... భూమా ఫ్యామిలీ కూడా పెళ్లిలో సందడి చేసింది. మౌనిక అక్క అఖిల ప్రియా, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా పెళ్ళికి వచ్చారు. మొత్తం మీద ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో మంచు మనోజ్, భూమా నాగ మౌనికా రెడ్డి పెళ్లి చేసుకున్నారు.
Also Read : వెంకటేష్ 'సైంధవ్'లో యంగ్ హీరోయిన్‌కు ఛాన్స్!
Kushi Release Date : సెప్టెంబర్‌లో 'ఖుషి' ఖుషీగా - విజయ్ దేవరకొండ, సమంత సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Rashmika Mandanna: అప్పుడు సో కాల్డ్ అంది, ఇప్పుడు క్రెడిట్ అంతా అతడిదే అంటోంది - ఇండస్ట్రీ ఎంట్రీపై రష్మిక
Ganavel Raja on Rajamouli: ‘బాహుబలి’ రేంజ్‌లో ‘సూర్య 42’: నిర్మాత జ్ఞానవేల్ రాజా
Rashmika Mandanna: అలా చేస్తూపోతే భవిష్యత్‌లో నాకు బ్యాక్ పెయిన్ గ్యారెంటీ: రష్మిక మందన్న
Samyuktha Menon: ‘విరూపాక్ష’ చిత్ర నిర్మాణ సంస్థపై సంయుక్త మీనన్ ఆగ్రహం, నిజమా? పబ్లిసిటీ స్టంటా?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పూర్తి- సాయంత్రం నాలుగు తర్వాత లెక్కింపు
Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు
TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !
High Court Judges Transfer : హైకోర్టు జడ్జిల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం- ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు జడ్జిలు ట్రాన్స్ ఫర్