News
News
X

మీ కంటికి చిన్న పరీక్ష, ఈ చిత్రంలో వ్యోమగామి కాళ్లను గుర్తిస్తే, మీ చూపు సూపర్!

అమెరికన్ వ్యోమగామి మార్క్ వందే హే నెటిజన్లకు ఓ టెస్ట్ పెట్టారు. స్పేస్ స్టేషన్ బయటున్న స్పెస్ వాకర్ కాళ్లను గుర్తించాలన్నారు. అలా గుర్తించిన వారి కంటి చూపు వ్యోమగామికి సమానంగా ఉంటుందన్నారు.

FOLLOW US: 

న్నో వింతలు విశేషాల సమాహారం అంతరిక్షం. మనకు తెలియని.. మనం గుర్తించలేని ఎన్నో అద్భుతాలు అక్కడ దర్శనం ఇస్తాయి. వాటి రహస్యాలను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు నిత్యం పరిశోధనలు జరుపుతూనే ఉంటారు. అంతరిక్షంలోని పలు కొత్త విషయాలను తెలుసుకునేందుకు వ్యోమగాములు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇందుకోసం భూమ్మీద నుంచి రాకెట్ సాయంతో అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వేదికగా పరిశోధనలు జరుపుతారు. అదే సమయంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ కు ఆయా సమయాల్లో అనేక మరమ్మత్తులు చేస్తుంటారు. అలా స్పేస్ స్టేషన్ కు రిపేర్ చేస్తున్నస్పేస్ వాకర్ కాళ్లను గుర్తించగలిగితే, మీ కంటి చూపు వ్యోమగామికి సమానంగా ఉంటుందంటూ..  నాసా వ్యోమగామి మార్క్ వందే హే తాజాగా ఓ ఫోటోను ట్వీట్ చేశారు. 

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బయట రష్యా స్పేస్ వాక్ కు సంబంధంచిన ఓ ఫోటోను మార్క్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. స్పేస్‌ వాకర్ కాళ్లను గుర్తించాలంటూ నెటిజన్లను కోరాడు. అయితే ఈ ఫోటోలో స్పేస్ వాకర్ ను గుర్తించడం అంత ఈజీకాదు. ఎందుకంటే స్పేస్ స్టేషన్ లోని బయట భాగంలో ఓ పార్టులా తను కనిపిస్తున్నాడు. ఈ ఫోటోలో వ్యోమగామి కాళ్లు అంతరిక్ష కేంద్రం వైపు వేలాడుతున్నట్లుగా కనిపిస్తాయి.

ఫిబ్రవరి 2, 2018న తీసిన ఈ ఫోటోలో అంతరిక్షం నుంచి అందమైన భూమి కనిపిస్తుంది.  రష్యాకు సంబంధించిన  కాస్మోనాట్స్ అలెగ్జాండర్ మిసుర్కిన్, అంటోన్ ష్కప్లెరోవ్ ఆ రోజు చాలా ఎక్కువ సేపు స్పేస్ వాక్ చేశారు. సుమారు 8 గంటల పాటు వారు బయట ఉండి స్పేస్ స్టేషన్ కు మరమ్మత్తులు చేశారు. స్పేస్ వాక్ లో కొత్త రికార్డు సృష్టించారు. భూమిపై రష్యా ఫ్లైట్ కంట్రోలర్లతో  కమ్యూనికేషన్లను మెరుగుపరచడానికి యాంటెన్నాకు కొత్త భాగాలను ఇన్‌ స్టాల్ చేయడానికి ఈ ఇద్దరు కాస్మోనాట్స్ అంతర్జాతీయ స్పేస్ స్టేషన్  వెలుపల ఎనిమిది గంటలు గడిపినట్లు CNET వెల్లడించింది. 

ఈ ఫోటోను మార్క్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశారు. ఈ ఫోటోకు సంబంధించి ఓ చిన్న క్లూ ఇస్తున్నట్లు చెప్పారు. అవసరం అయితే ఫోటో పై భాగంలో లేదంటే మధ్య భాగంలో చూడాలని చెప్పాడు. ఇందుకోసం అవసరం అయితే ఫోటోను జూమ్ చేసినా సరిపోతుందని చెప్పారు. మీరు వ్యోమగామి కాళ్లను గుర్తించిన తర్వాత.. వారి పరిమాణంతో పోల్చితే  స్పేస్ స్టేషన్ ఎంత పెద్దదిగా ఉందో తెలుసుకునేందుకు కాస్త సమయం కేటాయించాలని సూచించారు.  చివరకు కొంత మంది నెటిజన్లు రష్యన్ వ్యోమగామి కాళ్లను గుర్తించారు. మార్క్ తో తమ ఆనందాన్ని పంచుకున్నారు.  స్పేస్ వాకర్ కాళ్లు గుర్తించేందుకు నా స్మార్టో ఫోన్ లో ఫోటోను ఎంతో జూమ్ చేయాల్సి వచ్చింది. ఆయనను చూసిన తర్వాత స్పేస్ స్టేషన్ ఎంత పెద్దిగా ఉందో అర్థం అయ్యిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. పలువురు నెటిజన్లు సైతం ఈ ఫోటోలో స్పేస్ వాకర్ కాళ్లను గుర్తించడంతో పాటు రకరకాల అభిప్రాయాలను పంచుకున్నారు.

Also read: ఇలాంటి చెట్ల కిందకు వెళ్తే ప్రమాదాన్ని పాకెట్లో పెట్టుకున్నట్టే!

Also read: స్మాల్‌పాక్స్ వ్యాక్సిన్ మంకీపాక్స్ నుంచి మిమ్మల్ని రక్షిస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారు?

Published at : 20 Aug 2022 05:49 PM (IST) Tags: Space NASA Astronomy Mark Vande Hei

సంబంధిత కథనాలు

Lumpy Skin Disease : లంపి స్కిన్ డిసీజ్ మనుషులకు వ్యాపిస్తుందా? ఆ వైరస్ లక్షణాలు ఏంటి?

Lumpy Skin Disease : లంపి స్కిన్ డిసీజ్ మనుషులకు వ్యాపిస్తుందా? ఆ వైరస్ లక్షణాలు ఏంటి?

Diabetes: మీ శరీరం నుంచి వచ్చే వాసన మీకు డయాబెటిస్ ఉందో లేదో చెప్పేస్తుంది, ఎలాగంటే

Diabetes: మీ శరీరం నుంచి వచ్చే వాసన మీకు డయాబెటిస్ ఉందో లేదో చెప్పేస్తుంది, ఎలాగంటే

Ovarian Cancer: అండాశయ క్యాన్సర్‌ని నిరోధించడానికి ఐదు సూత్రాలు

Ovarian Cancer: అండాశయ క్యాన్సర్‌ని నిరోధించడానికి ఐదు సూత్రాలు

Khosta 2 Virus: రష్యన్ గబ్బిలాలలో కోవిడ్‌లాంటి వైరస్, మనుషులకు సోకే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు

Khosta 2 Virus: రష్యన్ గబ్బిలాలలో కోవిడ్‌లాంటి వైరస్, మనుషులకు సోకే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు

Bathukamma Special Recipes: మలీద లడ్డూలు, సద్దుల బతుకమ్మ మెచ్చే ప్రసాదం

Bathukamma Special Recipes: మలీద లడ్డూలు, సద్దుల బతుకమ్మ మెచ్చే ప్రసాదం

టాప్ స్టోరీస్

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh :  బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!