Yoga During Pregnancy : గర్భిణీలు యోగా చేయవచ్చా? లాభాలు, నష్టాలు ఇవే.. ఆ తప్పులు చేయకండి
Is Yoga Safe In Pregnancy : యోగా అందరికీ మంచిది. చిన్న, వయసు తేడా లేకుండా అందరూ చేయవచ్చు. అయితే ప్రెగ్నెన్సీతో ఉన్నవారు యోగా చేయవచ్చా? దీనివల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏంటి?

Pregnancy Yoga Benefits and Disadvantages : యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే వయసు సమస్య లేకుండా వివిధ ప్రయోజనాల కోసం యోగాను చేయవచ్చు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో యోగా చేయవచ్చు. ఎలాంటి యోగా ఆసనాలు చేస్తే మంచిది? గర్భణీగా ఉన్నప్పుడు యోగా చేస్తే ఆరోగ్యానికి మంచిదే కానీ.. దానివల్ల కలిగే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రెగ్నెన్సీలో యోగా చేయొచ్చా?
గర్భిణీగా ఉన్నప్పుడు యోగా చేయవచ్చా? అనే ప్రశ్నకు నిపుణులు చేయొచ్చనే సమాధానమే ఇస్తున్నారు. సరైన పద్ధతిలో, కొన్ని మార్పులతో యోగా ప్రాక్టీస్ చేస్తే మంచి ఫలితాలు చూడవచ్చని చెప్తున్నారు. అయితే యోగాను ప్రారంభించే ముందు వైద్యుల సలహా కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రెగ్నెన్సీలో లాభాలు ఇవే
ప్రెగ్నెన్సీ సమయంలో యోగా చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఫ్లెక్సీబులిటీ పెరగడంతో పాటు బలం పెరుగుతుంది. యోగా చేసేప్పుడు శరీరం సున్నితంగా స్ట్రెచ్ అవ్వడం వల్ల కండరాలు బలపడతాయి. హిప్స్, బ్యాక్, పెల్విస్ స్ట్రెచ్ అయ్యి డెలివరీ సమయంలో కాస్త ఈజీగా ఉంటుంది. ఒత్తిడి, యాంగ్జైటీ తగ్గుతుంది. బ్రీతింగ్ వ్యాయామాలు చేయడం వల్ల కార్టిసోల్ తగ్గుతుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది.
గర్భిణీగా ఉన్నప్పుడు వచ్చే నడుము నొప్పి, కడుపు ఉబ్బరం, వాపు, ఫటిగో వంటి సమస్యలను యోగా కంట్రోల్ చేస్తుంది. మంచి నిద్రను అందిస్తుంది. రిలాక్సింగ్ ఆసనాలు, బ్రీతింగ్ నిద్ర నాణ్యతను పెంచుతాయి. రక్తప్రసరణను పెంచి.. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించే వారికి యోగా మంచి ఫలితాలు ఇస్తుంది.
యోగాతో కలిగే ఇబ్బందులు
ప్రెగ్నెంట్గా ఉండి యోగా చేయాలనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. ఎక్కువగా స్ట్రెచ్ చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. రిస్కీ ఆసనాలు వేయకపోవడమే మంచిది. డీప్ బ్యాక్ బెండ్స్, పొట్టపై పడుకోవడం వంటి వాటిని చేయకపోవడమే మంచిది. సరైన గైడెన్స్ లేకుండా యోగా చేయకపోవడమే మంచిది. కాబట్టి నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. లేదంటే కళ్లు తిరగడం వంటి ఇబ్బందులు వస్తాయి.






















