యోగా మహిళలు రెగ్యులర్​గా చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. శారీరకంగా, మానసికంగా పొందే లాభాలివే.

యోగా హార్మోన్ల సమస్యలను తగ్గిస్తుంది. PCOS, థైరాయిడ్, పీరియడ్స్​కి సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది.

శరీరానికి ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది. నడుమునొప్పిని దూరం చేయడంతో పాటు భంగిమన సరిచేసుకోవడంలో హెల్ప్ అవుతుంది.

మైండ్​ని రిలాక్స్ చేస్తుంది. కార్టిసాల్ లెవెల్స్​ను తగ్గించి.. ఎమోషనల్​గా హెల్తీగా ఉండేలా చేస్తుంది.

ఫెర్టిలిటీ సమస్యలను దూరం చేస్తుంది. మోనోపాజ్ సమస్యలను కూడా తగ్గిస్తుంది.

బరువు తగ్గడానికి కూడా యోగా చేయవచ్చు. మెటబాలీజం పెరుగుతుంది. కేలరీలు కరుగుతాయి.

శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. స్కిన్​ను డీటాక్స్ చేసి.. హెల్తీ స్కిన్​ను అందిస్తుంది.

జీర్ణక్రియ మెరుగవడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్​ఫ్లమేషన్​ను తగ్గిస్తుంది.

నిద్ర నాణ్యత పెరుగుతుంది. నరాలకు విశ్రాంతిని అందించి ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.